నటుడు నవీన్ చంద్ర హీరోగా, దర్శకుడు ఆర్.పి. బాల తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం ‘NC 51’ షూటింగ్ పూర్తయింది. ఆర్.పి. బాల ఫిల్మ్స్, పి.జి. ముత్తయ్య ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఆర్.పి. బాల, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పి.జి. ముత్తయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
‘ఎలెవన్’ చిత్రంలో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నవీన్ చంద్ర కథల ఎంపికలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఆయన కెరీర్‌లో 51వ చిత్రంగా రూపొందుతున్న ‘NC 51’ కొత్త కథాంశంతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించనుంది.
చెన్నైలో అక్టోబర్ 26, సోమవారం నాటికి ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. చిత్రబృందం షూటింగ్ విజయవంతంగా పూర్తవడంతో ఆనందం వ్యక్తం చేస్తూ వేడుక చేసుకుంది. ఈ చిత్రంలో హరిప్రియ రోషిణి, బాల శరవణన్, కాళీ వెంకట్, రవిశంకర్, రాజా రవీంద్ర, నవీన్ నేని, ఆదవ్ చంద్ర, అభిషేక్, విజయ సత్య తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పి.జి. ముత్తయ్య సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, శక్తి బాలాజీ సంగీతం సమకూరుస్తున్నారు. అజయ్ మనోజ్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.
డి. క్రాఫోర్డ్ ఆర్ట్ డైరెక్టర్‌గా, డేంజర్ మణి ఫైట్ మాస్టర్‌గా, కార్తీక్ నేత లిరిసిస్ట్‌గా పనిచేస్తున్నారు. అనీషా రేహానా, హగినో షున్సుకే కెవిన్ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. షూటింగ్ పూర్తవడంతో ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించే దిశగా నిర్మాతలు ఆర్.పి. బాల, పి.జి. ముత్తయ్య సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్రబృందం సిద్ధమవుతోంది.
▪️ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టిన ప్రముఖ నిర్మాత వంశీ నందిపాటి.. తొలి సన్నివేశానికి దర్శకత్వం వహించిన డా. అనిల్ విశ్వనాథ్…
నవంబర్ 6న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న "సమ్మర్ హాలిడేస్" కథా బలమున్న చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ సక్సెస్…
ఎల్లో ఫ్లవర్స్, శ్రీ చక్ర మూవీస్ బ్యానర్ల మీద రమేష్ పుప్పాల, సూర్యకాంతి నిర్మాతలుగా శశిధర్ మున్నంగి తెరకెక్కించిన న్యూ…
నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, మాక్సిమం సిటీ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న నూతన చిత్రం ‘పాకెట్ రాకెట్స్’.…
హైదరాబాద్ ఫుడ్ లవర్స్ కోసం సరికొత్త థీమ్ తో హియ్య స్పెస్ మండి రెస్టారెంట్ ఘనంగా ప్రారంభమైంది. టాలీవుడ్ బ్యూటీ…
నవరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బిర్లా స్టూడియోస్, టెంపుల్ టౌన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న భక్తిరస చిత్రం ‘కనకదుర్గ’ నుంచి తొలి…