టాలీవుడ్

‘దసరా’ నిజాయితీగా తీసిన సినిమా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల

నేచురల్ స్టార్ నాని మాసియస్ట్ పాన్ ఇండియా ఎంటర్ టైనర్ ‘దసరా’ దేశవ్యాప్తంగా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటి. నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం టీజర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. దసరా ట్రైలర్ నేషనల్ వైడ్ గా ట్రెండ్ అవుతూ సినిమాపై మరింత క్యురియాసిటీని పెంచింది. కీర్తి సురేష్ కథానాయికగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ ఎత్తున నిర్మించిన ఈ చిత్రం మార్చి 30న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో గ్రాండ్ గా విడుదలౌతుంది. ఈ నేపధ్యంలో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల విలేఖరు సమావేశంలో దసరా విశేషాలని పంచుకున్నారు. మీ నేపధ్యం, సినిమా ప్రయాణం గురించి చెప్పండి ? మాది పెద్దపల్లి దగ్గర సింగరేణి కోటర్స్. మా నాన్నగారు సింగరేణి ఎంప్లాయ్. నేను టెన్త్ క్లాస్ లో వున్నప్పుడు సుకుమార్ గారి ‘జగడం‘ చూశాను. ఆ సినిమా నాపై చాలా ప్రభావం చూపింది. ఫిల్మ్ మేకింగ్ పై ఆసక్తి పెరిగింది. సుకుమార్ గారి దగ్గర చేరాలంటే నాకు మరో మార్గం లేదు. ఆయన ఇంటి ఎదురుగా నిలుచునే వాడిని. ఓ నాలుగేళ్ళు అలా గడిచాక ఒక రోజు ఆయన పిలిచి ఒక షార్ట్ ఫిల్మ్ తీసుకొని రమ్మని చెప్పారు. నేను చేసిన షార్ట్ ఫిల్మ్ ఆయనకి నచ్చింది. అలా ‘నాన్నకు ప్రేమతో’ సినిమాకి డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో చేరాను. రంగస్థలం తర్వాత బయటికి వచ్చి ఈ కథని రాసుకున్నాను. అక్కడికి వెళ్దాం అనే గ్యాప్ లోనే సుధాకర్ గారు కథ విన్నారు. దసరా కథ ఆలోచన ఎప్పుడు వచ్చింది.. నాని గారి కోసమే రాసుకున్నారా ? దసరా నేను చిన్నప్పటి నుంచి విన్న కథ. నిజ జీవితంలో జరిగిన ఒక సంఘటనని ఆధారంగా చేసుకొని ఈ కథని రాసుకున్నా. తర్వాత నాని అన్న వచ్చారు. దసరాలో కనిపించే వీర్లపల్లి మా నాన్నమ్మ గారి ఊరు. నా బాల్యం అంతా అక్కడే గడిచింది. సెలవుల్లో అక్కడే గడిపేవాడిని.  ఆ ఊరి ప్రభావం నాపై చాలా వుంది. అక్కడ జరిగిన ఓ సంఘటన ఆధారంగా అల్లుకున్న కథ దసరా. నేను సుధాకర్ గారికి కథ చెప్పాను. ఆయన నాని అన్నకు చెప్పమన్నారు. అలా దసరా కాంబినేషన్ కుదిరింది. ‘దసరా’ ది తెలంగాణ నేపధ్యం. కీర్తి సురేష్ తో ఆ యాస చెప్పించడం కష్టంగా అనిపించిందా ? లేదండీ. కీర్తి సురేష్ గారిది సూపర్ బ్రెయిన్ పవర్. ఏదైనా చెబితే ఐదు నిమిషాల్లో పట్టేస్తుంది. పెద్ద ఒత్తిడి కూడా తీసుకోదు. ఇంత త్వరగా నేర్చుకుంటుంటే నేనే షాక్ అయ్యా. డబ్బింగ్ కూడా అద్భుతంగా చెప్పింది. దసరా పాన్ ఇండియా విడుదలౌతుంది కదా.. ఒత్తిడి ఉందా ? పాన్ ఇండియా అనే భయం లేదు. అయితే అన్ని భాషల్లో విడుదల చేస్తున్నపుడు అన్ని భాషల్లో క్యాలిటీ అవుట్ పుట్ ఇవ్వాలన్నదానిపైనే ద్రుష్టి పెట్టాను. ‘దసరా’ లో నాని గెటప్ కి అల్లు అర్జున్ పుష్ప పాత్ర స్ఫూర్తి ఏమైనా వుందా ? ’లేదండీ. 2018 దసరా రోజు నాని అన్నకు ఈ కథ చెప్పాను. అప్పుడే ఈ సినిమా టైటిల్ దసరా అని చెప్పాను. అప్పటికి పుష్ప ఫస్ట్ లుక్ బయటికి రాలేదు. సుకుమార్ గారు ఏం చేస్తున్నారో నాకు తెలీదు. లాంగ్ హెయిర్, గెడ్డం పెంచమని నాని అన్నకి చెప్పాను. ఆ రోజుస్కెచ్ వేసి లుక్ అని ఫిక్స్ అయ్యాం. పుష్ప వచ్చినపుడు కూడా .. ధరణి లుక్ ని మనం ముందే అనుకున్నాం కదా అని భావించాను. కానీ ఈ రెండికి పోలిక పెడతారని మాత్రం అనుకోలేదు. దసరాలో హీరోయిన్ గా తెలుగు అమ్మాయి అయితే బావుటుందని అనుకున్నారట ? అవునండీ. తెలుగు అమ్మాయి కోసం దాదాపు ఎనిమిది నెలలు వెదికా. దొరకలేదు. నేను తెలుగు అమ్మాయని చెప్పినపుడే దొరకరని నాని అన్న ముందే చెప్పారు. దసరాలో యాబై మందికి పైగా నటులని ఊర్ల నుంచి తెచ్చి వారికి శిక్షణ ఇచ్చి యాక్ట్ చేయించాం.   నాని గారి ఇంత మాస్ క్యారెక్టర్ లో ప్రేక్షకులు ఎలా యాక్సప్ట్ చేస్తారనే ఆలోచన వచ్చిందా ? ఇది డేరింగ్ స్టెప్ అనిపించలేదా ? నాకు ఇలాంటి లెక్కలు వుండవు, తెలీదు. నేను ఎంత నిజాయితీగా సినిమా తీశాననేదే లెక్క చేసుకుంటాను. నిజాయితీగా తీశాం కాబట్టి కథ కోణం నుంచే చూస్తారని భావిస్తున్నాను. మొదట అనుకున్న బడ్జెట్ కంటే దసరా స్కేల్ పెరిగింది కదా.. ? మొదటి షెడ్యుల్ పూర్తయిన తర్వాత బడ్జెట్ అనుకున్నదాని కంటే ఎక్కువౌతుందని నాని అన్న కి నాకు, నిర్మాత సుధాకర్ గారికి అర్ధమైయింది. అయితే నిర్మాత సుధాకర్ గారు ఎక్కడా రాజీపడకుండా సినిమాని నిర్మించారు. దాదాపు 90 శాతం షూటింగ్ సెట్ లో చేయడానికి కారణం ?…

2 years ago

‘మీటర్’ మాస్ ఊహించినదాని కంటే ట్రిపుల్ వుంటుంది

*మైత్రీ మూవీ మేకర్స్ ప్రెజెంట్స్, కిరణ్ అబ్బవరం, రమేష్ కడూరి, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్ మీటర్ ట్రైలర్ విడుదల టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్…

2 years ago

500 మంది ఫైటర్స్‌తో ‘డెవిల్’ యాక్షన్ ఎపిసోడ్

డిఫరెంట్ మూవీస్, రోల్స్ చేస్తూ హీరోగా తనదైన‌ వెర్సటాలిటీతో మెప్పిస్తోన్న స్టార్ నందమూరి కళ్యాణ్ రామ్. ఆయన లేటెస్ట్ మూవీ ‘డెవిల్’. ‘ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’…

2 years ago

`పొన్నియిన్ సెల్వ‌న్‌`మార్చి 29న ఆడియో, ట్రైల‌ర్ లాంచ్

Ace Director Mani Ratnam, Lyca Productions Magnum Opus "Ponniyin Selvan 2" Grand Audio and Trailer Launch event is on March…

2 years ago

<strong>ఉదయ్ శంకర్, మేఘా ఆకాష్ ల కొత్త సినిమా ప్రారంభం</strong>

Uday Shankar and Megha Akash’s new film takes off...the film will also feature known actors like Madhunandan, Venkatesh Kakamanu, Shashi,…

2 years ago

మంత్రి మ‌ల్లారెడ్డి చేతుల మీదుగా సిఐ భార‌తి షూటింగ్ ప్రారంభం

``CI Bharti'' is being produced by Vishala Pasunuri under the direction of Ramana Reddy Gaddam under the banner of Gharshana…

2 years ago

మేఘాంశ్ శ్రీహరి‘మిస్టర్ బ్రహ్మ ఏంటి ఈ డ్రామా? ప్రారంభం

Meghamsh Srihari, G. Bhavani Shankar, A2 Pictures Productions No1 'Mr Brahma What Is This Drama?' Grand Opening

2 years ago

రామ్‌చ‌ర‌ణ్‌, శంక‌ర్,పాన్ ఇండియా మూవీ `గేమ్ చేంజ‌ర్‌`

Global Star Ram Charan's birthday today has been made special with the announcement of the title of RC15. has locked…

2 years ago