ఖుషి’ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ అవుతుంది – సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వాహబ్
విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ‘ఖుషి’ సినిమా మరో ఐదు రోజుల్లో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. మైత్రీ మూవీస్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించిన ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ‘ఖుషి’ సెప్టెంబర్ 1న గ్రాండ్ గా రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమాకు సూపర్ హిట్ మ్యూజిక్ ఇచ్చి తెలుగు చిత్ర పరిశ్రమ దృష్టిని ఆకర్షించారు మలయాళ సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వాహబ్. ‘ఖుషి’ సినిమాకు మ్యూజిక్ చేసిన ఎక్సీపిరియన్స్ తెలిపారు మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహబ్.
నా మలయాళ హిట్ ఫిల్మ్ హృదయం రిలీజైన తర్వాత మైత్రీ సంస్థ నుంచి పిలుపు వచ్చింది. ‘ఖుషి’ సినిమాకు వర్క్ చేయమని అడిగారు. శివ గారు చెప్పిన కథ విన్నాక ఒక బ్యుటిఫుల్ మూవీకి వర్క్ చేయబోతున్నా అని అర్థమైంది. వెంటనే ఈ ప్రాజెక్ట్ అంగీకరించాను. ‘ఖుషి’ సినిమాకు పనిచేయడం ఒక థ్రిల్లింగ్ ఎక్సీపిరియన్స్ ఇచ్చింది. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి నిన్న మొత్తం మ్యూజిక్ వర్క్ కంప్లీట్ చేసేవరకు ఎగ్జైటింగ్ గా మా జర్నీ సాగింది. మేము సినిమాకు పెట్టిన ఎఫర్ట్స్ రేపు థియేటర్ లో ప్రేక్షకులు చూస్తారు.
‘ఖుషి’ సినిమా కోసం వీణ, సితార్ వంటి ఇస్ట్రుమెంట్స్ వాడాం. నా రోజా నువ్వే పాట నుంచి రీసెంట్ గా రిలీజ్ చేసిన ఓసి పెళ్లామా వరకు అన్ని పాటలు బాగా కుదిరాయి. ఈ సినిమాకు కంప్లీట్ మ్యూజిక్ చేయగలిగాం. మూవీలో అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా మ్యూజిక్ ఉండాలని అనుకున్నారు దర్శకుడు శివ నిర్వాణ. ఈ సినిమాలో కష్టపడి కంపోజ్ చేసిన పాట టైటిల్ సాంగ్. ఖుషి టైటిల్ సాంగ్ మొదట సినిమాలో లేదు. టీజర్ కోసం ట్యూన్ చేశాను. అయితే ఆ ట్యూన్ అందరికీ నచ్చింది. దీన్ని సాంగ్ చేయాలని అడిగారు. అలా ఖుషి టైటిల్ సాంగ్ చేశాను. ఈపాటకు 20, 25 డెమోస్ చేశాం. విదేశాలకు వెళ్లినా కూడా ‘ఖుషి’ పాటల గురించి మాట్లాడుతున్నారు. అదే మాకు పెద్ద అఛీవ్ మెంట్.
శివ మ్యూజిక్ గురించి ప్యాషన్ దర్శకుడు. అతనికి ఏం కావాలో తెలిసిన దర్శకుడు. మేము ఒక హోటల్ లో నెల రోజుల పాటు మ్యూజిక్ సిట్టింగ్స్ చేశాం. నేను ఎక్కువ రోజులు ఒక సినిమాకు పనిచేసింది కూడా ‘ఖుషి’కే. హీరో విజయ్ కు తన సినిమాల నుంచి ఆడియన్స్ ఎలాంటి మ్యూజిక్ కోరుకుంటారో తెలుసు. అందుకే తన సజెషన్స్ నాకు చెప్పేవాడు. అవి చాలా హెల్ప్ అయ్యాయి. ఒక టీమ్ మెంబర్ గా మ్యూజిక్ లో తన ఇన్వాల్వ్ మెంట్ ఉండటం మంచిదే.
మ్యూజిక్ బాగుంటే ప్రేక్షకులు థియేటర్స్ కు రప్పించవచ్చు అని నేను బిలీవ్ చేస్తాను. ‘ఖుషి’లో సమంత, విజయ్ క్యారెక్టర్స్ మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. వాళ్లు పోటా పోటీగా నటించారు. ఈ సినిమాకు వాళ్ల పెయిర్ పెద్ద అసెట్ అవుతుంది.
తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి అవకాశాలు వస్తున్నాయి. నన్ను టాలీవుడ్ ఆహ్వానిస్తున్న తీరు చూస్తుంటే సంతోషంగా ఉంది. మంచి మ్యూజిక్ కోసం తాపత్రయపడే ఇండస్ట్రీ ఇది. సంగీత దర్శకుడిగా ఇలాంటి మూవీస్ చేయాలనే హద్దులేం లేవు. అన్ని జానర్స్ మూవీస్ కు మ్యూజిక్ చేయాలని అనుకుంటున్నాను.
‘ఖుషి’ మ్యూజిక్ కంప్లీట్ అయ్యింది కాబట్టి ఓ నాలుగు రోజులు విరామం తీసుకుంటాను. ఆ తర్వాత నాని హీరోగా నటిస్తున్న హాయ్ నాన్న మ్యూజిక్ వర్క్ స్టార్ట్ చేస్తా. ప్రస్తుతం ఈ సినిమా పాటల పనులు జరుగుతున్నాయి. అలాగే శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వానంద్ నటిస్తున్న సినిమాకు కూడా మ్యూజిక్ అందిస్తున్నాను. ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. తెలుగులో కీరవాణి, మిక్కీ జే మేయర్, భీమ్స్ మ్యూజిక్ ఇష్టం.
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…