నారా రోహిత్, మూర్తి దేవగుప్తపు, వానర ఎంటర్‌టైన్‌మెంట్స్ ‘ప్రతినిధి 2’ షూటింగ్ ప్రారంభం
హీరో నారా రోహిత్ పొలిటికల్ థ్రిల్లర్ ‘ప్రతినిధి 2’ తో గ్రాండ్ గా కమ్ బ్యాక్ ఇస్తున్నారు. వానర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మూర్తి దేవగుప్తపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సక్సెస్ ఫుల్ పొలిటికల్ థ్రిల్లర్ ‘ప్రతినిధి’ సిరీస్ నుండి రెండవ ఫ్రాంచైజీగా వస్తున్న ఈ చిత్రానికి “One man will stand again, against all odds” అనేది క్యాప్షన్.
ఈ రోజు ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో ప్రారంభమైయింది. హీరో నారా రోహిత్ పై కీలకమైన సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు. ప్రతినిధి 2 కోసం బిగ్ స్పాన్ వున్న కథను ఎంచుకున్నారు నారా రోహిత్. ఈ సినిమా ఫస్ట్ లుక్ సినిమాపై చాలా క్యూరియాసిటీ పెంచింది.
కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, కొండకళ్ల రాజేందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. యువ సంచలనం మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తుండగా, నాని చమిడిశెట్టి సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. రవితేజ గిరిజాల ఎడిటర్, కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్.
ఈ చిత్రం 2024 జనవరి 25న రిపబ్లిక్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తారాగణం: నారా రోహిత్
సాంకేతిక విభాగం:
దర్శకత్వం: మూర్తి దేవగుప్తపు
నిర్మాతలు: కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, కొండకళ్ల రాజేందర్ రెడ్డి
ప్రొడక్షన్ బ్యానర్: వానర ఎంటర్‌టైన్‌మెంట్స్
సంగీతం: మహతి స్వర సాగర్
ఎడిటర్: రవితేజ గిరిజాల
డీవోపీ: నాని చమిడిశెట్టి
ఆర్ట్: కిరణ్ కుమార్ మన్నె
స్టంట్స్: శివరాజు
పబ్లిసిటీ డిజైన్స్ : అనిల్ & భాను
పీఆర్వో: వంశీ-శేఖర్
డిజిటల్: ప్రవీణ్&హౌస్‌ఫుల్ డిజిటల్
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…