Categories: BOLLYWOOD

య‌శ్ రాజ్ ఫిల్మ్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘ఆల్ఫా’.. జూలై 10న ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ విడుద‌ల‌

ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ య‌శ్ రాజ్ ఫిల్మ్స్ బ్యాన‌ర్‌లో ఆలియా భ‌ట్ న‌టిస్తోన్న యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘ఆల్ఫా’. భారీ అంచనాలతో ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తోన్న ఈ సినిమాను జూలై 10న ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుద‌ల చేస్తున్న‌ట్లు నిర్మాత‌లు ప్ర‌క‌టించారు.

వైఆర్ఎఫ్ బ్యాన‌ర్‌, అలియా, శర్వరి ఈ కొత్త అప్‌డేట్ గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అలాగే కొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఆ పోస్టర్‌లో ఆలియా భట్ కొత్త యాక్షన్ లుక్ కనిపిస్తోంది. పోస్టర్‌లో ఆమె ముఖం మీద గాయాలు, గాట్లు క‌నిపిస్తున్నాయి. పోస్ట‌ర్ చూస్తుంటే ఇప్పుడే జరిగిన రక్తపాతంతో కూడిన యాక్ష‌న్ జ‌రిగిన‌ట్లు చూపించారు.”

‘ఆల్ఫా’సినిమాలో ఆలియా భ‌ట్‌తో పాటు హిందీ సినీ పరిశ్రమలో అప్‌క‌మింగ్ స్టార్ శ‌ర్వ‌రి కూడా న‌టించింద‌ది. అలాగే ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో అనీల్ కపూర్‌, బాబీ డియోల్ కీల‌క పాత్ర‌ల్లో నటిస్తున్నారు. సినిమాలో అలియా, శర్వరి కలిసి బాబీ డియోల్‌ను ఢీ కొట్టేలా కఠినమైన పోరాటంలో తలపడనున్నట్టు తెలుస్తోంది

ఆల్ఫా చిత్రంతో ఆలియా భ‌ట్ తొలిసారి య‌శ్‌రాజ్ ఫిల్మ్స్‌తో క‌లిసి ప‌ని చేస్తున్నారు. అలాగే ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీలో తెర‌కెక్కుతోన్న ఫుల్ లేడీ ఓరియెంటెడ్ యాక్ష‌న్ మూవీ ఇది. ఈ సినిమాలో అలియా భట్, శ‌ర్వ‌రి కలిసి ప్రేక్షకులు ఇప్పటివరకు తెరపై ఒక హీరోయిన్ చేయ‌ని యాక్ష‌న్ సీక్వెన్స్‌లో న‌టించారు.

య‌శ్ రాజ్ ఫిల్మ్స్ బ్యాన‌ర్‌పై గ్లోబ‌ల్ హిట్ సిరీస్ ది రైల్వే మెన్‌ను తెర‌కెక్కించిన శివ్ ర‌వైల్ ద‌ర్శ‌క‌త్వంలో ఆల్ఫా సినిమా రూపొందుతోంది. ఆదిత్య చోప్రా నిర్మాత‌.

TFJA

Recent Posts

మైత్రి మూవీ మేకర్స్ ప్రజెంట్స్- సత్య, రితేష్ రానా, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ ‘జెట్లీ’ మే 1న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్

టాలీవుడ్ ఫేవరేట్ ద్వయం సత్య, దర్శకుడు రితేష్ రానా 'జెట్లీ'తో అలరించబోతున్నారు. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ) హేమలత…

28 minutes ago

మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేసిన “ది బ్రేకింగ్ న్యూస్” ఫస్ట్ లుక్

మీడియా నేపథ్యంతో రూపొందుతున్న థ్రిల్లర్ చిత్రం “ది బ్రేకింగ్ న్యూస్” తాజాగా ఫస్ట్ లుక్ మరియు టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో ప్రేక్షకుల…

1 hour ago

సమంత యాక్షన్ కామెడీ ఫ్యామిలీ డ్రామా ‘మా ఇంటి బంగారం’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘తస్సాదియ్యా’ విడుదల.. మే 15న మూవీ గ్రాండ్ రిలీజ్

ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మా ఇంటి…

1 day ago

‘లెనిన్‌’ నుంచి సెకండ్ సాంగ్ ‘ఎట్టా ఎట్టా’ రిలీజ్‌

యంగ్ అండ్ డైన‌మిక్ హీరో అఖిల్ అక్కినేని లేటెస్ట్ మూవీ ‘లెనిన్‌’ శరవేగంగా రూపొందుతోంది. ఈ సినిమాపై మంచి అంచ‌నాలు…

1 day ago

మలయాళంలో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన “పళ్లిచట్టంబి” తెలుగులోనూ ఆ సక్సెస్ రిపీట్ చేస్తుంది – మూవీ ప్రొడ్యూసర్స్ చాణక్య, చైతన్య, చరణ్

మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటించిన భారీ బడ్జెట్ మూవీ "పళ్లిచట్టంబి". ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ ఫిలింస్,…

1 day ago