“తిమ్మరాజుపల్లి టీవీ” సినిమాకు ఫ్యామిలీ ఆడియెన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు, ఈ కొత్త టీమ్ ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు – సక్సెస్ మీట్ లో నిర్మాత కిరణ్ అబ్బవరం

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ పై నిర్మించిన సినిమా “తిమ్మరాజుపల్లి టీవీ”. తేజ వేల్పుచర్ల సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంతో సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్స్ గా నటించారు. “తిమ్మరాజుపల్లి టీవీ” చిత్రంతో వి.మునిరాజు దర్శకుడిగా పరిచయమయ్యారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే పీరియాడిక్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్నిసొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ కేక్ కట్ చేసి తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

ఆర్ట్ డైరెక్టర్ సుధీర్ మాచర్ల మాట్లాడుతూ – మా “తిమ్మరాజుపల్లి టీవీ” సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఫ్యామిలీ ఆడియెన్స్ మూవీని ఎంజాయ్ చేస్తున్నారు. ఫస్ట్ షో, సెకండ్ షోస్ ఫాస్ట్ గా ఫిల్ అవుతున్నాయి. మా మూవీ పట్ల గర్వంగా ఫీలవుతున్నాం. మీ సపోర్ట్ మరింతగా మా చిత్రానికి అందిస్తారని కోరుకుంటున్నాం. అన్నారు.

డైరెక్టర్ వి.మునిరాజు మాట్లాడుతూ – మా “తిమ్మరాజుపల్లి టీవీ” సినిమాకు సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్. బీ, సీ సెంటర్స్ నుంచే కాక యూఎస్ నుంచి కూడా మా సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. మూవీ చూసిన వాళ్లంతా తమ మెమొరీస్ గుర్తుకొస్తున్నాయి అంటున్నారు. ఈ ఫ్రైడే మా టీమ్ దే అని చెప్పగలను. వీళ్లందరి మొహాలు సంతోషంతో ఎలా వెలుగుతున్నాయో చూస్తున్నారు కదా. ఈ సంతోషం కోసమే రెండున్నరేళ్లుగా కష్టపడుతున్నాం. మేము కోరుకున్న ఫలితం ఈ రోజు దక్కింది. అన్నారు.

హీరోయిన్ వేద జలంధర్ మాట్లాడుతూ– కొత్త వాళ్లం చేసిన మా సినిమాకు హౌస్ ఫుల్స్ కావడం హ్యాపీగా ఉంది. ఊర్ల నుంచి సినిమా చూసిన వాళ్లు ఫోన్ చేసి మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. మేము ఫ్యామిలీ ఆడియెన్స్ కోసం చేసిన ఈ చిత్రంతో ఎలాంటి స్పందన ఆశించామో దాన్ని మించి వస్తోంది. అన్నారు.

డీవోపీ అక్షయ్ రామ్ పొదిశెట్టి మాట్లాడుతూ – మా మూవీ చూసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్స్ చేసి సినిమా చాలా బాగుందని చెబుతున్నారు. సోషల్ మీడియాలో కూడా మా సినిమాకు కంప్లీట్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. మా సినిమాను హిట్ చేసిన అందరికీ థ్యాంక్స్. అన్నారు.

హీరో సాయి తేజ్ మాట్లాడుతూ – మా సినిమాకు చాలా చోట్ల హౌస్ ఫుల్స్ అవుతున్నాయి. మా సినిమాకు ఇంత మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్. మా టీమ్ కు కంగ్రాట్స్ చెబుతున్నా. అన్నారు.

నిర్మాత కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ – మా సినిమాకు మీడియా నుంచి వస్తున్న రెస్పాన్స్, ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే హ్యాపీగా ఉంది. ఫ్యామిలీ ఆడియెన్స్ మూవీకి బాగా కనెక్ట్ అవుతున్నారు. మేము పదే పదే అదే రిక్వెస్ట్ చేస్తున్నాము. ఫ్యామిలీస్ మా సినిమాకు వెళ్లండి మీకు నచ్చుందని చెబుతున్నాము. సెకండాఫ్ చాలా బాగుందని యునానమస్ గా అందరూ అంటున్నారు. క్లైమాక్స్ ట్విస్ట్ అయితే ఎవరూ ఊహించలేదని చెబుతున్నారు. కొత్త వాళ్లంతా చేసిన సినిమా, మంచి అటెంప్ట్ చేశారు, మీరు మిస్ కాకుండా ఫ్యామిలీ అందరితో కలిసి థియేటర్ కు వెళ్లండి. వీళ్లను ఆదరించాలని కోరుతున్నా. అన్నారు.

నటీనటులు – సాయి తేజ్, వేద జలంధర్, ప్రదీప్ కొట్టె, స్వాతి కరిమిరెడ్డి, అమ్మ రమేష్, సత్యనారాయణ, లతీష్, తదితరులు

టెక్నికల్ టీమ్

కాస్ట్యూమ్స్ డిజైనర్ – విశాల్య
ఆర్ట్ డైరెక్టర్ – సుధీర్ మాచర్ల
బిజినెస్ హెడ్ అండ్ మార్కెటింగ్ – చౌహాన్
క్రియేటివ్ ప్రొడ్యూసర్ – రితికేష్ గోరక్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – కేఎల్ మదన్
డీవోపీ – అక్షయ్ రామ్ పొదిశెట్టి
మ్యూజిక్ – వంశీకాంత్ రేఖన
సీఈవో – రహస్య కిరణ్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
కో ప్రొడ్యూసర్ – తేజ వేల్పుచర్ల
ప్రొడ్యూసర్ – కిరణ్ అబ్బవరం
రచన, ఎడిటింగ్, దర్శకత్వం – వి. మునిరాజు

TFJA

Recent Posts

మైత్రి మూవీ మేకర్స్ ప్రజెంట్స్- సత్య, రితేష్ రానా, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ ‘జెట్లీ’ మే 1న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్

టాలీవుడ్ ఫేవరేట్ ద్వయం సత్య, దర్శకుడు రితేష్ రానా 'జెట్లీ'తో అలరించబోతున్నారు. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ) హేమలత…

2 hours ago

మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేసిన “ది బ్రేకింగ్ న్యూస్” ఫస్ట్ లుక్

మీడియా నేపథ్యంతో రూపొందుతున్న థ్రిల్లర్ చిత్రం “ది బ్రేకింగ్ న్యూస్” తాజాగా ఫస్ట్ లుక్ మరియు టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో ప్రేక్షకుల…

2 hours ago

సమంత యాక్షన్ కామెడీ ఫ్యామిలీ డ్రామా ‘మా ఇంటి బంగారం’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘తస్సాదియ్యా’ విడుదల.. మే 15న మూవీ గ్రాండ్ రిలీజ్

ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మా ఇంటి…

1 day ago

‘లెనిన్‌’ నుంచి సెకండ్ సాంగ్ ‘ఎట్టా ఎట్టా’ రిలీజ్‌

యంగ్ అండ్ డైన‌మిక్ హీరో అఖిల్ అక్కినేని లేటెస్ట్ మూవీ ‘లెనిన్‌’ శరవేగంగా రూపొందుతోంది. ఈ సినిమాపై మంచి అంచ‌నాలు…

1 day ago

మలయాళంలో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన “పళ్లిచట్టంబి” తెలుగులోనూ ఆ సక్సెస్ రిపీట్ చేస్తుంది – మూవీ ప్రొడ్యూసర్స్ చాణక్య, చైతన్య, చరణ్

మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటించిన భారీ బడ్జెట్ మూవీ "పళ్లిచట్టంబి". ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ ఫిలింస్,…

1 day ago

‘సైయారా’ కాంబోలో మరో క్రేజీ ప్రాజెక్ట్

గ‌త ఏడాది బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ‘సైయారా’ కాంబో మ‌ళ్లీ మ‌న ముందుకు రావ‌టానికి స‌మాయ‌త్త‌మ‌వుతోంది. సైయారా అద్భుత విజయంతో…

2 days ago