విరూపాక్ష‘ సినిమాకు కథే హీరో.. పాత్రల పరిచయ కార్యక్రమంలో సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్
సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మిస్టీక్ థ్రిల్లర్ విరూపాక్ష. సంయుక్తమీనన్ కథానాయిక. కార్తీక్ దండు దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థలు శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై బాపినీడు బి.సమర్పణలో ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఏప్రిల్ 21న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా ఇప్పటి వరకు విడుదలైన టీజర్, పాటలకు స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ నుంచి పాత్రలను పరిచయం చేస్తూ నిర్వహించిన కార్యక్రమంలో చిత్రయూనిట్ పాల్గొంది.
సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ.. ‘2019లో ఈ కథ విన్నాను. చిన్న ఆఫీస్‌లో ఈ కథ విన్నాను. ముందుగా సుకుమార్ నుంచి కాల్ వచ్చింది. కథ విను.. కచ్చితంగా నీకు నచ్చుతుంది. చేస్తావ్ అని అన్నారు. సుకుమార్ గారు కదా?.. ఏదో లవ్ స్టోరీ చెబుతారని అనుకున్నా. కానీ నన్ను భయపెట్టాడు డైరెక్టర్ కార్తీక్. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అప్పుడే ఫిక్స్ అయ్యాను. ఈ సినిమాను చూసి మా అమ్మ, మీ అమ్మగారు గర్వంగా చెప్పుకుంటారు. ఈ సినిమాను ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. దర్శకుడు కార్తీక్‌కు హ్యాట్సాఫ్. శ్యాం గారి కెమెరా పనితనానికి హ్యాట్సాఫ్. నాగేంద్ర గారి ఆర్ట్ వర్క్ అద్భుతంగా ఉంది. విరూపాక్ష ప్రపంచాన్ని అద్భుతంగా రూపొందించారు. కార్తీక్ విజన్‌కు అజనీష్ ప్రాణం పోశారు. బీజీఎం అదరగొట్టేశారు. పాటలు బాగా వచ్చాయి. సినిమా అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను. నటీనటుల సహకారంతోనే నేను నటించగలిగాను. సునిల్, సాయి చంద్, బ్రహ్మాజీ, అజయ్, సంయుక్త ఇలా అందరూ నాకు ఎంతగానో సహకరించారు. నాకు సెట్‌లో ఆరోగ్యం బాగా లేకపోయినా నాకోసం షూటింగ్ క్యాన్సిల్ చేశారు. మా నిర్మాతలకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. నన్ను సపోర్ట్ చేసిన విరూపాక్ష టీం, సుకుమార్ గారికి థాంక్స్. ఈ సినిమాకు కథే హీరో. హారర్ సినిమా చూడటమే ఓ చాలెంజింగ్. నటించడం ఇంకా పెద్ద చాలెంజ్. తారక్‌తో నాకు మంచి అనుబంధం ఉంది. మేం చాలా క్లోజ్‌గా ఉంటాం. ఈ సినిమాకు వాయిస్ ఓవర్ కావాలని అడిగిన వెంటనే ఇచ్చారు. నా కోసం, నిర్మాత బాపి గారి కోసం, సుకుమార్ గారి కోసం వెంటనే ఓకే చెప్పారు. ఇప్పుడు సినిమాను చూసే విధానం మారింది కాబట్టి. మంచి సినిమాను పాన్ ఇండియాగా రిలీజ్ చేద్దామని అనుకున్నాం. ఓ ఫిక్షన్ స్టోరీ అందరికీ రీచ్ అవుతుందని పాన్ ఇండియాలో రిలీజ్ చేస్తున్నాం.
సంయుక్త మీనన్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో నేను నందిని అనే పాత్రను పోషించాను. రెండేళ్ల క్రితం నాకు ఈ స్టోరీని వినిపించారు. నాకు ఈ పాత్ర ఎంతగానో నచ్చింది. నందిని పాత్ర కోసం నా ప్రాణం పెట్టేశాను. ప్రతీ పాత్రను ఎంతో డీటైలింగ్‌గా చూపించారు. షూటింగ్ ఫస్ట్ రోజు ఎంతో నెర్వస్‌గా ఫీల్ అయ్యాను. ఈ పాత్ర కోసం చెప్పులు వేసుకోకుండా నటించాను. ఇలాంటి పాత్ర దక్కడం గొప్ప అదృష్టం. ఇంత మంచి పాత్ర ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్’ అని అన్నారు.
కార్తిక్ దండు మాట్లాడుతూ.. ‘ఈ సినిమా కథను 2018లో రాశాను. రంగస్థలం షూటింగ్‌లో ఉన్న సుకుమార్ గారికి ఈ కథను చెప్పాను. కరోనా వల్ల సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది. కానీ కరోనా గ్యాప్‌లో కథను ఎక్కడా మార్చలేదు. యాక్సిడెంట్ తరువాత తేజ్ గారిలో తెలియని ఓ భయం ఉండేది. సెట్‌లో ఫస్ట్ డే రోజు తేజ్ గారు మాటలు సరిగ్గా రావడం లేదని, దాని ద్వారా వేరే వాళ్లకు ఏమైనా ఇబ్బంది అవుతుందా? అనే భయంలో ఉండేవారు. కానీ నాలుగో రోజు వచ్చి అదరగొట్టేశారు. టెక్నీషియన్స్ అందరికీ రుణపడి ఉంటాను. టీం అంతా కూడా ఎంజాయ్ చేస్తూ సినిమాను చేశాం. ఈ సినిమాను ఎంజాయ్ చేస్తూ చేశామ’ అని అన్నారు.
నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాకు టెక్నీషియన్స్ మెయిన్ ఇంపార్టెంట్. ఇది మంచి సినిమా అవుతుందని ఆశిస్తున్నాను. నేను ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు చేశాను. ఎప్పుడూ కథను నమ్మే సినిమాలు చేశాను. ఇది యూనివర్సల్ సబ్జెక్ట్. అందుకే పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ చేస్తున్నామ’ని అన్నారు.
నటుడు సాయిచంద్ మాట్లాడుతూ.. ‘నేను ఇంత వరకు ఇలాంటి పాత్రను పోషించలేదు. పూజారిలా పూర్తి ఆధ్యాత్మిక భావనలో ఉన్న పాత్రను చేయడంతో నాపై ఎంతో ప్రభావాన్ని చూపించింది. విరూపాక్ష పూర్తి విభిన్నమైన సినిమా. ఈ సినిమాకు మంచి టీం కుదిరింది. ప్రతీ రోజూ ఎంతో అద్భుతంగా అనిపించింది. సాయి తేజ్‌తో నాకు చిన్నప్పటి నుంచి అనుబంధం ఉంది. సాయి తేజ్ బ్రదర్ వైష్ణవ్‌తో ఉప్పెన, కొండపొలం సినిమాలు చేశాను. సాయి తేజ్ చాలా మంచి వ్యక్తి. దర్శకుడు కార్తిక్ ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిలా సినిమాను తీశారు’ అని అన్నారు.
సునిల్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో అబ్బాయి రాజు అనే పాత్రను పోషించాను. ఏజ్‌కు తగ్గ పాత్రలు చేయడం సులభం. కానీ ఏజ్‌కు మించిన పాత్రలు చేయాలంటే చాలా కష్టమని పుష్ప సినిమా చేశాక తెలిసింది’ అని అన్నారు.
బ్రహ్మాజీ మాట్లాడుతూ.. ‘సినిమా అంతా కూడా చాలా సీరియస్‌గా, ఎంతో ఇంటెన్సిటీతో చేశాం. ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో ఇది ది బెస్ట్‌గా నిలుస్తుంది. ఇందులో నటీనటులుగా మేం చేసింది పదిశాతమే. కానీ టెక్నికల్ టీం మాత్రం చాలా కష్టపడింది. ఇది టెక్నీషియన్స్ మూవీ అని చూశాక ఆడియెన్స్‌కు తెలుస్తుంది. ఇందులో ఒక డిఫరెంట్ పాత్రను పోషించాను. సాయి ధరమ్ తేజ్ చాలా మంచి వ్యక్తి. నిజాయితీ పరుడు. సంస్కారవంతుడు. ఇష్టపడుతూ కష్టపడి ఈ సినిమాను చేశామని’ అన్నారు.
శ్యామల మాట్లాడుతూ.. ‘నేను ఈ టైం కోసం చాలా ఎదురుచూశాను. కథ చెప్పిన తరువాత ఎప్పుడు నటిస్తానా? అని చాలా వెయిట్ చేశాను. ఈ సినిమాలో నేను పార్వతక్క పాత్రను పోషించాను. అందరికీ సాయం చేసే పాత్రలా తల్లో నాలుకలా అనిపిస్తాను. నాకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. శ్యాం గారు నన్ను ఎంతో అద్భుతంగా చూపించారు’ అని అన్నారు.
అభినవ్ మాట్లాడుతూ.. ‘ఆడియెన్స్ ఇప్పటి వరకు టీజర్ మాత్రమే చూశారు. అసలు సినిమా ఏప్రిల్ 21న చూడబోతోన్నారు. మా దర్శకుడు కార్తీక్ అద్భుతంగా తెరకెక్కించాడు. ఫస్ట్ టైం ఇలాంటి భారీ సబ్జెక్ట్‌ను తీయడం మామూలు విషయం కాదు. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్’ అని అన్నారు.
అజయ్ మాట్లాడుతూ.. ‘విరూపాక్షతో ఆడియెన్స్ కొత్త ప్రపంచంలోకి వెళ్తారు. ఎంతో మిస్టీరియస్‌గా ఉంటుంది. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది. కార్తీక్ ఈ సినిమా కోసం పెట్టిన శ్రమ ఏంటో అందరూ ఏప్రిల్ 21న చూడబోతోన్నారు. మొదటి ఇరవై నిమిషాల్లోనే విరూపాక్ష ప్రపంచంలోకి వెళ్తారు’ అని అన్నారు.
కెమెరామెన్ శ్యాందత్ మాట్లాడుతూ.. ‘ఇది నాకు ఎంతో ప్రత్యేకమైన సినిమా. ప్రతీ ఒక్కరూ ఈ సినిమాను కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు’ అని అన్నారు.
ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర మాట్లాడుతూ.. ‘ఆర్టిస్ట్‌లకు పేరు వచ్చే సినిమాలు చాలా ఉంటాయి. కానీ టెక్నీషియన్లకు పేరు వచ్చే సినిమాలు కొన్నే ఉంటాయి. ఈ సినిమాకు ఎంతో కష్టపడి పని చేశాం. ఈ సినిమా స్టోరీని ఓ బుక్కులా ఇచ్చారు. ఎంతో డీటైలింగ్‌గా కథను నాకు నెరేట్ చేశారు. నిర్మాత గారు మాకు ఎంతో సహకరించారు. స్క్రిప్ట్ డిమాండ్ మేరకే స్క్రిప్ట్‌లు వేశామ’ని అన్నారు.
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…