Categories: Uncategorized

అస్సాం వరద బాధితులకు నిత్యవసర వస్తువులను పంపిణీ చేసిన నందమూరి బసవరామ తారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్

స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి సతీమణి శ్రీమతి నందమూరి బసవరామ తారకం గారి శతజయంతి సందర్భంగా ప్రారంభించిన నందమూరి బసవరామ తారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అస్సాం వరద బాధితులకు నిత్యవసర వస్తువులు పంపించడం జరిగింది. భారీ వర్షాల వల్ల కలిగి వరదలలో చిక్కుకుని ఎంతో నష్టపోయిన మన దేశంలోని మన రాష్ట్రమేనా అస్సాం రాష్ట్ర ప్రజలకు అండగా నిలబడాలని ఈ ట్రస్ట్ ద్వారా ఇక తెలుగు రాష్ట్రాల నుండి నిత్యవసర వస్తువులను ప్రజల నుండి స్వచ్ఛందంగా స్వీకరించి ఆ నిత్యవసర వస్తువులను నేడు అస్సాం వరద బాధితులకు ఒక ఎన్జీవో సంస్థ (THE EMBRYOS) ద్వారా అందచేయడం జరిగింది. తెలుగు రాష్ట్రాలలోని హైదరాబాద్, విజయవాడ, ఖమ్మంతో పాటు ఇతర దేశాల నుండి కూడా ఈ ట్రస్ట్ ద్వారా సేవ చేసేందుకు ప్రజలు ముందుకు రావడం విశేషం. ఈ సందర్భంగా ఆహారం పదార్థాలు, బట్టలు, త్రాగునీరు వంటి నిత్యవసర వస్తువులను పంపిణీ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా పలు సినిమాలకు నిర్మాత, సినిమాటోగ్రాఫర్ నందమూరి మోహనకృష్ణ గారు మాట్లాడుతూ… “అందరికీ నమస్కారం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు” అని నమ్మే మనందరి అన్నగారు నందమూరి తారక రామారావు గారి మాటలను స్ఫూర్తిగా తీసుకొని మానవత్వంతో ప్రజాసేవ చేస్తూ ముందుకు వెళ్లే దిశగా నందమూరి బసవరామ తారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మన పొరుగు రాష్ట్రమైన అస్సాంలో వరదల వల్ల నష్టపోయిన ప్రజలకు అండగా నిలుస్తూ నిత్యవసర వస్తువులను పంపిణీ చేస్తున్నాము. ఈ ట్రస్ట్ ద్వారా అందరికీ సహాయం చేస్తూ, అండగా ఉండాలని కోరుకుంటున్నాము. THE EMBRYOS అనే సంస్థ ద్వారా ఈ నిత్యవసర సరుకులను అందజేస్తున్నాను. ఇరు తెలుగు రాష్ట్రాల నుండి అనుకున్నదానికంటే ఎక్కువ స్పందన వచ్చింది. భవిష్యత్తులో కూడా ఈ ట్రస్ట్ ప్రజల కోసం మరెన్నో సేవలు చేసేందుకు సిద్ధంగా ఉంది. ఎటువంటి లాభం ఆశించకుండా కేవలం సేవ చేయాలనే సదుద్దేశంతో ఈ ట్రస్ట్ స్థాపించడం జరిగింది. మా తల్లిదండ్రుల స్ఫూర్తితో వారి ఆశయాలకు అనుగుణంగా ఈ సంస్థను ముందుకు నడిపిస్తాము” అన్నారు.

నందమూరి మోహన్ రూపా గారు మాట్లాడుతూ… “పుణ్య దంపతులు నందమూరి తారక రామారావు గారికి, నందమూరి బసవరామ తారకం గారికి నా పాదాభివందనాలు. అస్సాంలో భారీ వరదల వల్ల జీవనాధారం దెబ్బ తిన్న విషయం అందరికీ తెలిసిందే. ఇటువంటి విపత్తుకర పరిస్థితిలో వారికి అండగా నిలబడటం కోసం నందమూరి బసవరామ తారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిత్యవసర వస్తువులను స్వీకరించి వరద బాధితుల కోసం పంపించడం జరుగుతుంది. దీనికోసం వివిధ ప్రాంతాల నుండి ఈ వస్తువులను సేకరించాము. ప్రజలంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ వంతు సాయం చేయడం చూసి చాలా సంతోషించాము. ఈ కార్యక్రమం కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇతర దేశాల నుండి ట్రస్ట్ కు సరుకులను పంపడం చూసి ఆశ్చర్యపోయాము. THE EMBRYOS అనే సంస్థ ద్వారా ఈ వస్తువులను అస్సాం వరద బాధితులకు అందిస్తున్నాము. ఇప్పటికి అందిన సహాయం అంతటిని ఒక ట్రక్కు ద్వారా పంపిస్తున్నాము. ఇంకా రానున్న ఈ నిత్యవసర వస్తువులను ముందు ముందు రానున్న సహాయాన్ని కూడా ఇలాగే త్వరలోనే పంపించి ఆ వివరాలను వెల్లడిస్తాము. ఈ ట్రస్ట్ ద్వారా సహాయం అందిస్తూ వస్తున్న వారి వివరాలను ఇంస్టాగ్రామ్ (NANDAMURI BASAVARAMA TARAKAM NTR CHARITABLE TRUST) ద్వారా వారి వివరాలను వెల్లడిస్తాము” అన్నారు.

నందమూరి సీమంతిని గారు మాట్లాడుతూ… “పుణ్య దంపతులు ఎన్టీ రామారావు గారు, బసవరామ తారకం గారి పేరుతో ట్రస్ట్ ప్రారంభించడం చాలా సంతోషకరం. ఈ ట్రస్ట్ ద్వారా అస్సాం వరద బాధితులకు అండగా నిలిచేందుకు నిత్యవసర వస్తువులు స్వీకరణ ప్రారంభించాము. ఈ కార్యక్రమం ఎంతో అద్భుతంగా విజయం సాధించింది. మా వంతు సాయంగా ప్రారంభించిన ఈ కార్యక్రమానికి ఎంతోమంది అండగా నిలిచారు. నేడు ఈ నిత్యవసర వస్తువులు అంతా అస్సాం పంపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అండగా నిలిచిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను” అంటూ ముగించారు.

TFJA

Recent Posts

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

1 day ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 day ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 day ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 day ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

1 day ago

పాన్ ఇండియా సినిమాలు తీస్తున్న డైరెక్టర్లందరికీ ఇది ఒక పాఠం — ఇరుముడి చూసి నేర్చుకోవాల్సిన సమయం వచ్చింది!

ఇరుముడి సినిమా కలెక్షన్స్ చూస్తుంటే అసలు నమ్మశక్యం కాని విధంగా ఉన్నాయి. సినిమా చరిత్రలో ఇలాంటి కలెక్షన్స్, ఇలాంటి జనసందోహం…

3 days ago