నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల, సుధాకర్ చెరుకూరి, SLV సినిమాస్ ‘ది ప్యారడైజ్’ మునుపెన్నడూ చూడని యాక్షన్ బ్లడ్ బాత్ టీజర్ రిలీజ్

నేచురల్ స్టార్ నాని ప్రతిష్టాత్మక ‘పాన్-వరల్డ్’ చిత్రం ‘ది ప్యారడైజ్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రతి ప్రమోషనల్ కంటెంట్ కి అద్భుతమైన స్పందన లభించింది. పోస్టర్, టైటిల్ గ్లింప్స్‌తో పాటు, చిత్రంలోని మొదటి పాట ‘ఆయా షేర్’ బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. దర్శకుడు శ్రీకాంత్ ఒడెల ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో, ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. SLV సినిమాస్‌ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

ఎంతగానో ఎదురుచూస్తున్న ప్యారడైజ్ టీజర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. “ఇక నుంచి ఈ జాగా ఎవరిది… ఈ దేశం ఎవరిది?” అనే నాని పవర్‌ఫుల్ డైలాగ్‌తో ప్రారంభమైన టీజర్ మొదటి ఫ్రేమ్ నుంచే ప్రేక్షకులను ‘ది ప్యారడైజ్’ ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. హై-వోల్టేజ్ యాక్షన్, రక్తం చిందించే బ్లడ్‌బాత్ సీక్వెన్స్‌లు, ఇంటెన్స్ విజువల్స్‌తో ప్రతి క్షణం గూస్‌బంప్స్ తెప్పించేలా సాగింది.

టీజర్‌లోని ప్రతి ఫ్రేమ్ భారీ స్థాయి విజువల్ గ్రాండియర్‌ను తలపిస్తుంది. ప్రతి షాట్‌లో శ్రీకాంత్ ఓడెల విజన్ గ్రాండ్ గా కనిపించింది. ఇప్పటివరకు తెలుగు తెరపై చూడని ఓ కొత్త ప్రపంచాన్ని ఈ టీజర్ ఆవిష్కరించింది.

నాని తన కెరీర్‌లో ఎన్నడూ కనిపించని రగ్డ్, ఫెరోషియస్ అవతార్‌లో ప్రేక్షకులను సర్ ప్రైజ్. జడలతో కనిపించిన ఆయన లుక్, కళ్లలోని క్రూరత్వం, బాడీ లాంగ్వేజ్, యాక్షన్‌లో చూపించిన ఇంటెన్సిటీ… ఇవన్నీ కలిసి ఆయన కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచే పాత్రను సూచిస్తున్నాయి.

చివర్లో “ఇరుగు దిష్టి… పొరుగు దిష్టి…” అంటూ నాని చెప్పిన డైలాగ్ టీజర్‌కు పర్ఫెక్ట్ క్లైమాక్స్‌లా నిలిచింది. ఆ ఒక్క డైలాగ్‌తోనే థియేటర్లలో విజిల్స్, గూస్‌బంప్స్ ఖాయమనే ఫీలింగ్‌ను కలిగించింది.

దర్శకుడు శ్రీకాంత్ ఓడెల ‘ది ప్యారడైజ్’ ఎంత డీటైల్డ్ ప్రపంచాన్ని సృష్టించారో ఈ టీజర్ స్పష్టంగా తెలియజేస్తోంది. విజువల్ డిజైన్, మేకింగ్, యాక్షన్ స్కేల్… ప్రతి అంశంలో ఆయన మరో మెట్టు ఎక్కినట్లు కనిపిస్తోంది.

మోహన్ బాబు పవర్‌ఫుల్ లుక్‌లో కనిపిస్తూ తనదైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్నారు. ఆయన పలికిన డైలాగ్ టీజర్‌లోని ఇంటెన్సిటీని మరింత పెంచింది.

కాయదు లోహర్, రాఘవ్ జుయాల్ పాత్రలు కూడా టీజర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వారి లుక్స్, స్క్రీన్ ప్రెజెన్స్ కథపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.

అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌ ను మరోస్థాయికి తీసుకెళ్ళింది. థియేటర్లలో ఈ స్కోర్ మరో స్థాయి అనుభూతిని ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. SLV సినిమాస్ నిర్మాణ విలువలు టాప్ క్లాస్ లో వున్నాయి.

టీజర్ లో నాని నెవర్ బిఫోర్ అవతార్, గూస్‌బంప్స్ పుట్టించే విజువల్స్, శ్రీకాంత్ ఓడెల గ్రాండ్ విజన్ కలిసి సినిమాపై అంచనాలను ఆకాశానికెత్తాయి.

పాన్-వరల్డ్ చిత్రంగా తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ సెప్టెంబర్ 24, 2026న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

నటీనటులు: నాని, మోహన్ బాబు, కాయదు లోహర్, రాఘవ్ జుయల్, సోనాలి కులకర్ణి, సంపూర్ణేష్ బాబు

సాంకేతిక బృందం:
రచన, దర్శకత్వం: శ్రీకాంత్ ఓదెల
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
బ్యానర్: SLV సినిమాస్
DOP: సిహెచ్ సాయి
సంగీతం: అనిరుధ్ రవిచందర్
ఎడిటింగ్: నవీన్ నూలి
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో

TFJA

Recent Posts

2027 సంక్రాంతి రిలీజ్ కు వస్తున్న డైరెక్టర్ పా.రంజిత్ భారీ పాన్ ఇండియా యాక్షన్ మూవీ “వేట్టువం”

సరికొత్త కథా నేపథ్యాలతో అద్భుతమైన మేకింగ్ తో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసే దర్శకుడు పా. రంజిత్ "వేట్టువం" టైటిల్ తో…

8 hours ago

మెగాస్టార్ చిరంజీవి క్లాప్‌తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్,#RC17 # RC2Sukku ముహూర్తపు వేడుకతో ఘనంగా ప్రారంభం

మెగాస్టార్ చిరంజీవి క్లాప్‌తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మాస్టర్ స్టోరీటెల్లర్ సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్…

8 hours ago

నవీన్ చంద్ర ‘NC 51’ షూటింగ్ పూర్తి

నటుడు నవీన్ చంద్ర హీరోగా, దర్శకుడు ఆర్.పి. బాల తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం ‘NC 51’ షూటింగ్ పూర్తయింది. ఆర్.పి.…

2 days ago

హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన ‘ఓరి నాయనో’ చిత్రం!

▪️ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టిన ప్రముఖ నిర్మాత వంశీ నందిపాటి.. తొలి సన్నివేశానికి దర్శకత్వం వహించిన డా. అనిల్ విశ్వనాథ్…

2 days ago

“సమ్మర్ హాలిడేస్” సినిమా ట్రైలర్ చూశాక నా బాల్యం గుర్తుకువచ్చింది, ఈ దీపావళికి ఫ్యామిలీతో కలిసి ఈ మూవీ చూడండి – ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో కింగ్ ఆఫ్ ఎంటర్ టైన్ మెంట్ హీరో శ్రీవిష్ణు

నవంబర్ 6న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న "సమ్మర్ హాలిడేస్" కథా బలమున్న చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ సక్సెస్…

4 days ago

‘రుద్రవనం పీఎస్’ ఊహించిన దాని కంటే పెద్ద విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను – గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్

ఎల్లో ఫ్లవర్స్, శ్రీ చక్ర మూవీస్ బ్యానర్ల మీద రమేష్ పుప్పాల, సూర్యకాంతి నిర్మాతలుగా శశిధర్ మున్నంగి తెరకెక్కించిన న్యూ…

4 days ago