ప్రముఖ దర్శకులు వేణు ఉడుగుల చేతుల మీదుగా “స్టువర్టుపురం స్టూడెంట్స్” ట్రైలర్ విడుదల

బిగ్ బాస్ ఫేమ్ దివి యాక్షన్ అండ్ డాన్స్ హైలెట్ గా తెరకెక్కిన చిత్రం

శివ సాయి ప్రొడక్షన్స్ పతాక పై డి. నిరీక్షణ సమర్పణలో, నిఖిల్, దివి ప్రధాన పాత్రలో డి. రామకృష్ణ దర్శకత్వంలో నిర్మాతలు ప్రవీణ్ కుమార్ శ్రీనివాస్ రెడ్డి నిర్మిస్తున్న ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ “స్టువర్టుపురం స్టూడెంట్స్.” 80% షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. కాగా ఈ చిత్ర ట్రైలర్ ను ప్రముఖ దర్శకులు వేణు ఉడుగుల లాంచ్ చేశారు. ట్రైలర్ తో పాటు ఆయన సాంగును కూడా విడుదల చేశారు.
ఈ సందర్భంగా వేణు ఉడుగుల మాట్లాడుతూ “స్టువర్టుపురం స్టూడెంట్స్ ట్రైలర్ చూశాను .అలాగే సాంగ్స్ కూడా చూశాను. చాలా బాగున్నాయి.ఈ సాంగ్, ఈ ట్రైలర్ నా చేతుల మీదుగా రిలీజ్ చేయటం సంతోషంగా ఉంది. ట్రైలర్ చాలా బాగుంది . ఎస్పెషల్లీఈ చిత్రంలో దివి చేసిన యాక్టింగ్ కూడా చాలా ఇన్నోవేటివ్ గా ఉంది. అలాగే డైరెక్టర్ ఆర్కే గారు ఈ చిత్రాన్ని చాలా లావిష్ గా తెరకెక్కించారని అనిపిస్తుంది .ఈ సినిమా డెఫినెట్ గా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అని అన్నారు.
చిత్ర దర్శకుడు రామకృష్ణ మాట్లాడుతూ” మా సినిమా ట్రైలర్ విడుదల కోసం అడిగిన వెంటనే కాదనకుండా తన ఆఫీస్ కు పిలిపించుకుని మా ట్రైలర్ను సాంగ్ ను ఆవిష్కరించిన దర్శకులు వేణు ఉడుగుల గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా మా టెక్నికల్ టీమ్ ఎంతో సహకరించి నన్ను ముందుకు నడిపినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమా 80% పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్నాము. సినిమాని అతి త్వరలో మీ ముందుకు తీసుకొస్తున్నామని ఆశిస్తున్నాను. అని అన్నారు.
బిగ్ బాస్ ఫేమ్ హీరో నిఖిల్ మాట్లాడుతూ స్టువర్టుపురం స్టూడెంట్స్ నాకు ఒక ప్రత్యేకమైన సినిమా, నన్ను డైరెక్టర్ రామకృష్ణ గారు ఒక కమర్షియల్ హీరోగా నిలబెట్టేందుకు బాగా కష్టపడ్డారు. డెఫినిట్గా ఈ చిత్రం నాకు మంచి కమర్షియల్ హీరోగా గుర్తింపునిస్తుంది .దీనికి కారకుడైన మా డైరెక్టర్ ఆర్కే గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అన్నారు.

హీరోయిన్ దివి మాట్లాడుతూ మేము అడిగిన వెంటనే ఎంతో రెస్పెక్ట్ ఇచ్చి మా ట్రైలరు సాంగ్ ని రిలీజ్ చేసిన వేణు ఉడుగుల గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.ఈ సినిమా విషయానికి వస్తే నేను చాలా లక్కీ అని చెప్పాలి, మా డైరెక్టర్ గారు చాలా బాగా కథ రాసుకొని ఈ సినిమాను చాలా డిఫరెంట్ గా తెరకెక్కించారు. నాకు ఈ సినిమాలో ఓ సాంగ్ ఉంది ఆ సాంగ్లో నేను భరతనాట్యం చేస్తాను , బెల్లియు డాన్స్ చేస్తాను ,అలా డిఫరెంట్ వే లో ఉంటుందా సాంగ్. అలాగే నాకంటే ఈ సినిమాకలో నిఖిల్ ఎక్కువ స్కోపు ఉన్న క్యారెక్టర్ చేశారు.డెఫినెట్గా ఈ సినిమా మా అందరికీ మంచి నేమ్ తెస్తుందని ఆశిస్తున్నాను. అని అన్నారు .

నిఖిల్, దివి , శ్రావణ్ ,హైపర్ ఆది, రమణారెడ్డి, వేణు సమీరా , అఖిల్,తదితరులు నటించిన ఈ చిత్రానికి

లిరిక్స్: కె .కల్పన మాణిక్ ,
ఎడిటర్: అర్రం రామకృష్ణ ,
డిఓపి: ఎం మురళీకృష్ణ ,
మ్యూజిక్ :ఎస్.ఎస్. వెంకటేష్ ,
పి ఆర్ ఓ: బి వీరబాబు,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మణికుమార్ పి ,భాస్కర్రాజు సి
ప్రొడ్యూసర్ :ప్రవీణ్ కుమార్, బి. శ్రీనివాసరెడ్డి
కథ, స్క్రీన్ ప్లే ,దర్శకత్వం: డి .రామకృష్ణ.

TFJA

Recent Posts

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

2 days ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

2 days ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

2 days ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

2 days ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

2 days ago

పాన్ ఇండియా సినిమాలు తీస్తున్న డైరెక్టర్లందరికీ ఇది ఒక పాఠం — ఇరుముడి చూసి నేర్చుకోవాల్సిన సమయం వచ్చింది!

ఇరుముడి సినిమా కలెక్షన్స్ చూస్తుంటే అసలు నమ్మశక్యం కాని విధంగా ఉన్నాయి. సినిమా చరిత్రలో ఇలాంటి కలెక్షన్స్, ఇలాంటి జనసందోహం…

4 days ago