Uncategorized

‘ఉత్సవం’ కు హార్ట్ ఫుల్ సక్సెస్ ఇచ్చిన ఆడియన్స్ కి థాంక్ యూ

దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా లీడ్ రోల్స్ లో అర్జున్ సాయి రచన, దర్శకత్వం వహించిన హార్ట్ ఫుల్ ఎంటర్ టైనర్ ‘ఉత్సవం’. హార్న్‌బిల్‌ పిక్చర్స్‌పై సురేష్‌ పాటిల్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రకాష్ రాజ్ , నాజర్, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషించారు. సెప్టెంబర్ 13 ప్రేక్షుకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అందరినీ అలరించి హార్ట్ ఫుల్ బ్లాక్ బస్టర్ సాధించి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ నేపధ్యంలో మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా యూనిట్ సురభి నాటక రంగం కళాకారులను సత్కరించారు.

సక్సెస్ మీట్ లో హీరో దిలీప్ ప్రకాష్ మాట్లాడుతూ..అందరికీ నమస్కారం. ముందుగా మీడియాకి థాంక్ యూ. మీడియా చాలా సపోర్ట్ చేసింది. వారి సపోర్ట్ నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది. సినిమాకి చాలా మంచి రివ్యూస్ ఇచ్చారు. మొన్న కావలి, సూలూరు పేట సెంటర్స్ లో సినిమా హౌస్ ఫుల్ అయ్యింది. అన్ని చోట్ల నుంచి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. రేపటి నుంచి సక్సెస్ టూర్ చేస్తున్నాం. మంచి సినిమా ఇది. తప్పకుండా మీ అందరి సపోర్ట్ కావాలి’ అన్నారు.

యాక్టర్ అలీ మాట్లాడుతూ.. నాటక రంగం నుంచి వచ్చిన నటులు ఎంతోమంది పరిశ్రమలో ఎదిగారు. సురభి నాటక రంగం వారికి ప్రత్యేక ధన్యవాదాలు. నాటకం చాలా గొప్పది. ఈ పాయింట్ ని తీసుకొని ఉత్సవం చేయడం చాలా ఆనందంగా వుంది. చాలా మంది నటీనటులతో కలసి పని చేయడం మంచి అనుభూతిని ఇచ్చింది. ఇలాంటి మంచి సినిమాని ప్రేక్షకులు ప్రోత్సహించాలలి. సినిమాని ఇంకా పెద్ద సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను’ అన్నారు.

డైరెక్టర్ అర్జున్ సాయి మాట్లాడుతూ.. అన్ని కళల్లో నాటకం గొప్ప కళ. అలాంటి నాటకాన్ని బ్యాక్ డ్రాప్ తీసుకొని నా మొదటి సినిమా చేయడం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. ఇందులో మంచి లవ్ స్టొరీ వుంది. ఫ్యామిలీ డ్రామా వుంది. ప్రకాష్ రాజ్, నాజర్, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం గారు లాంటి గొప్ప నటులు వున్నారు. ఈ సినిమా చూసిన వారంతా మంచి సినిమా గొప్ప ప్రయత్నం అని అభినందిస్తున్నారు. ఈ సినిమాని థియేటర్స్ లో చూసి మంచి అనుభూతిని పొందుతారని కోరుకుంటున్నాను’ అన్నారు.

నిర్మాత సురేష్ పాటిల్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. అర్జున్ సాయి చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. ఇందులో లవ్ స్టొరీ వుంది ఫ్యామిలీ వుంది. పెద్ద కళాకారులు వున్నారు. సినిమాకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.  ప్రేక్షకుకు సపోర్ట్ వుంటే మరిన్ని సినిమాలు చేస్తాను. తప్పకుండా అందరూ సినిమా చూసి  మమ్మల్ని ఆశీర్వదించలాని కోరుకుంటున్నాను.

రైటర్ రమణ గోపిశెట్టి మాట్లాడుతూ.. ఉత్సవం సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. చాలా అభినందనలు వస్తున్నాయి. కళని అభిమానించేఅందరినీ సినిమా నచ్చింది. ఇందులో అద్భుతమైన లవ్ స్టొరీ వుంది. దర్శకుడు హార్ట్ ఫుల్ గా సినిమా తీశారు. సినిమా హార్ట్ ఫుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మాటల రచయితగా నాకూ మంచి పేరు వచ్చింది. ఈ సినిమా అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్ యూ’ అన్నారు.

యాక్టర్ వెంకట గిరిధర్ మాట్లాడుతూ… నాటకాన్ని బ్రతికించాలనే గొప్ప ఉద్దేశంతో దర్శకుడు ఈ సినిమా చేశారు. నాటకం సినిమాకి అమ్మలాంటింది. దర్శకుడు అద్భుతంగా ఈ సినిమాని తీశారు. నిర్మాత చాలా సపోర్ట్ చేశారు. దిలీప్ తన తొలి సినిమాకి ఇలాంటి నేపధ్యం ఎంచుకోవడం అభినందనీయం. మీ అందరూ సినిమాని సపోర్ట్ చేయాలి’ అని కోరారు.

యాక్టర్ అభినయ కృష్ణ మాట్లాడుతూ.. ఉత్సవం సినిమాకి చాలా మంచి పేరు వస్తోంది. నిజంగా ఉత్సవంలా వుంది. మాన్ కల్చర్, నాటకం గురించి చాలా అద్భుతంగా చూపించారు. దిలీప్ చాలా నేచురల్ గా పెర్ఫామ్ చేశాడు. ఈ సినిమాని అందరూ థియేటర్స్ లో చూడాలి. ఈ సినిమాని మరింత ప్రోత్సహించాలని కోరారు. సురభి నాటక రంగ కళాకారులు, సినిమా యూనిట్ అంతా పాల్గొన్న ఈ సక్సెస్ మీట్ గ్రాండ్ గా జరిగింది.

Tfja Team

Recent Posts

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ…

8 hours ago

ఫిబ్రవరి 6, 2026న‌ ‘యుఫోరియా’ గ్రాండ్ రిలీజ్‌

బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమ‌తి రాగిణి గుణ స‌మ‌ర్ప‌ణ‌లో గుణ…

4 days ago

కోయంబత్తూరులోని ఈ యోగ కేంద్రం వద్దనున్న లింగ భైరవి సన్నిధిలో, పవిత్రమైన ‘భూత శుద్ధి వివాహం’ చేసుకున్న సమంత ప్రభు, రాజ్ నిడిమోరు

ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…

4 days ago

తల్లి చేతుల మీదుగా అవార్డులను అందుకున్న మధుర క్షణాల్ని గుర్తు చేసుకున్న సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్

సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…

3 weeks ago

“రాజు వెడ్స్ రాంబాయి” మీ హృదయాన్ని తాకే అందమైన ప్రేమ కథ – ట్రైలర్ లాంఛ్ లో హీరో అడివి శేష్

అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…

3 weeks ago

‘దేవగుడి’ రియల్ స్టోరి.. కచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది – టీజర్ లాంచ్ వేడుకలో హీరో శ్రీకాంత్

కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…

3 weeks ago