విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరి ‘మెకానిక్ రాకీ’ నుంచి సాంగ్ ఓ పిల్లా రిలీజ్

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హైలీ యాంటిసిపేటెడ్ మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్ ‘మెకానిక్ రాకీ’తో రాబోతున్నారు. రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రామ్ తాళ్లూరి  SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిర్మిస్తున్నారు. ఫస్ట్ లుక్, ఫస్ట్ గేర్, ఫస్ట్ సింగిల్ ఇలా ప్రతి ప్రమోషనల్ మెటీరియల్‌కు  ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. మ్యూజికల్ ప్రమోషన్లలో భాగంగా మేకర్స్ సెకండ్ సింగిల్- ఓ పిల్ల సాంగ్ ని రిలీజ్ చేశారు.

ఓ పిల్లా పెప్పీ బీట్స్ తో ఇన్స్టంట్ గా లవ్ లో  పడే బ్యూటిఫుల్ నంబర్. ఇటీవలే సరిపోదా శనివారం కోసం బ్లాక్‌బస్టర్ ఆల్బమ్‌ని అందించిన జేక్స్ బెజోయ్ మెకానిక్ రాకీలోని సాంగ్ సిట్యువేషన్ కి పర్ఫెక్ట్ నెంబర్ అందించారు. ఈ పాట రాకీ, ప్రియగా కనిపించిన లీడ్ యాక్టర్స్ లవ్ స్టోరీని అద్భుతంగా ప్రజెంట్ చేసింది.

బి-టెక్ సమయంలో తన ప్రేమను తన అమ్మాయికి ప్రపోజ్ చేసే ఛాన్స్ మిస్ చేసుకున్న హీరో  మళ్లీ ఆమెతో కలిసే అవకాశం రావడంతో ఆనందపడతాడు. కృష్ణ చైతన్య రాసిన లిరిక్స్ హీరో లవ్ పై వున్న ఫీలింగ్స్ ని ప్రజెంట్స్ చేస్తోంది. నకాష్ అజీజ్ ఈ పాటను అద్భుతంగా పాడారు. ఈ పాటలో విశ్వక్ సేన్,  మీనాక్షి  బ్యూటీఫుల్ గా కనిపించారు. విజువల్స్ ప్లజెంట్ గా వున్నాయి.

శ్రద్ధా శ్రీనాథ్ మరో  హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ చిత్రానికి మనోజ్ కటసాని సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అన్వర్ అలీ ఎడిటర్, క్రాంతి ప్రియం ప్రొడక్షన్ డిజైనర్. సత్యం రాజేష్, విద్యాసాగర్ జె ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్.

మెకానిక్ రాకీ అక్టోబర్ 31న దీపావళికి విడుదల కానుంది.

తారాగణం: విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్, నరేష్, వైవా హర్ష, హర్షవర్ధన్, రోడీస్ రఘు రామ్

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: రవితేజ ముళ్లపూడి
నిర్మాత: రామ్ తాళ్లూరి
ప్రొడక్షన్ బ్యానర్: SRT ఎంటర్‌టైన్‌మెంట్స్
సంగీతం: జేక్స్ బిజోయ్
డీవోపీ: మనోజ్ కటసాని
ప్రొడక్షన్ డిజైనర్: క్రాంతి ప్రియం
ఎడిటర్: అన్వర్ అలీ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: సత్యం రాజేష్, విద్యాసాగర్ జె
పీఆర్వో:  వంశీ-శేఖర్

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

15 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

15 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

15 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago