శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నం.2 గా శివాజీ లయ లు హీరో హీరోయిన్లుగా ఓ సరికొత్త క్రైమ్ కామెడీ థ్రిల్లర్ రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమా తో సుధీర్ శ్రీరామ్ అనే దర్శకుడు తెలుగు చిత్ర పరిశ్రమ కి పరిచయం కాబోతున్నారు. ఈ సినిమా కి నిర్మాత కూడా శివాజీ కావడం మరో విశేషం. ఈ చిత్రానికి సంబందించిన పూజ కార్యక్రమాలు ఇటీవలే నిర్వహించారు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు క్లాప్ కొట్టగా, శివాజీ కుమారుడు రిక్కీ కెమెరా స్విచ్ ఆన్ చేసారు. నిర్మాతలు బెక్కెం వేణుగోపాల్, దిల్ రాజు మరియు దర్శకులు బోయపాటి శ్రీను చేతుల మీదుగా స్క్రిప్ట్ ని అందుకోగా, ఫస్ట్ డైరెక్షన్ బోయపాటి శ్రీను చేసారు.
ఇంతకు ముందు శివాజీ లయ జంటగా కలిసి నటించిన సినిమాలు ‘మిస్సమ్మ’, ‘టాటా బిర్లా మధ్యలో లైలా’, మరియు ‘అదిరిందయ్యా చంద్రం’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించడమే కాకుండా ఇద్దరికీ హిట్ పెయిర్ అనే ట్యాగ్ ని కూడా అందించాయి. మళ్ళీ వీరిరువురు జంటగా నటించనుండటం తో, అటు పరిశ్రమ లో ఇటు ప్రేక్షకుల్లో యెనలేని ఆసక్తి నెలకొంది.
ఈ నెల 20 నుండి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమా కి సంబందించిన పూర్తి వివరాలు త్వరలో వెలువడనున్నాయి!
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…