Categories: Uncategorized

మా నమ్మకం నిజమైంది.. తెలుగునాట ‘జైలర్ 2’ ప్రభంజనంపై సంతోషం వ్యక్తం చేసిన సూర్యదేవర నాగవంశీ

సూపర్ స్టార్ రజనీకాంత్, నెల్సన్ దిలీప్‌కుమార్ కలయికలో రూపొందిన ‘జైలర్’ చిత్రం 2023లో విడుదలై ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా ‘జైలర్ 2’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సన్‌ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ అక్టోబర్ 15న థియేటర్లలో అడుగుపెట్టింది. మొదటి షో నుంచే అన్ని వర్గాల నుంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని భారీ వసూళ్లతో దూసుకుపోతోంది.

తెలుగు రాష్ట్రాల పంపిణీ హక్కులను ప్రముఖ నిర్మాత సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ సొంతం చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ‘జైలర్ 2’ భారీ వసూళ్లు సాధిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా నాగవంశీ ప్రెస్ మీట్ నిర్వహించి తన సంతోషాన్ని పంచుకున్నారు. ఈ చిత్రాన్ని నైజాంలో విడుదల చేసిన మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ మైత్రి శశి కూడా ఈ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు.

సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. “మేము నిర్మించిన సినిమా అయినా, పంపిణీ చేసిన సినిమా అయినా డిస్ట్రిబ్యూటర్లకు కమిషన్ వస్తే చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో డిస్ట్రిబ్యూటర్లకు కమిషన్ రావడం అనేది అరుదైపోయింది. ‘జైలర్ 2’ విషయంలో మొదట అందరూ భారీ రేటు పెట్టి తీసుకున్నామని భయపడ్డారు. కానీ, అక్టోబర్ 15 సాయంత్రం షోల వసూళ్లు చూసిన తర్వాత ఖచ్చితంగా కమిషన్ వస్తుందని డిస్ట్రిబ్యూటర్లు చెప్పారు. రజనీకాంత్ గారిని, నెల్సన్ గారిని, అనిరుధ్ గారిని నమ్మి రిస్క్ చేశాము. దానికి ప్రతిఫలం దక్కుతుండటం చాలా చాలా సంతోషంగా ఉంది. ‘జైలర్ 2’ విషయంలో మీడియా ఇచ్చిన మద్దతుని మరచిపోలేము. అందరి నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. మీడియా మద్దతు ఇలాగే కొనసాగుతూ, ‘జైలర్ 2’ రాబోయే రోజుల్లో మరిన్ని భారీ వసూళ్లు సాధించాలని కోరుకుంటున్నాను.” అన్నారు.

మైత్రి శశి మాట్లాడుతూ.. “జైలర్ 2 భారీ వసూళ్లు సాధిస్తుందని ఆశిస్తున్నాము. ప్రతి ఒక్కరూ సినిమా చూసి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సినిమాలోని యాక్షన్, ఎంటర్టైన్మెంట్ అందరికీ నచ్చుతున్నాయి. అనిరుధ్ సంగీతం గొప్పగా ఉంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమా నైజాం రైట్స్ ను మా మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ కి ఇవ్వడం చాలా సంతోషం. ఇందులో మా మిత్రుడు, సోదరుడు నాగార్జున కూడా ఎంతో సహకరించారు. నా అంచనా ప్రకారం విజయదశమి రోజుకే మేము బ్రేక్ ఈవెన్ అయిపోయి లాభాల బాట పడతామనేది నా నమ్మకం. ఈ విజయాన్ని చేకూర్చిన తెలుగు ప్రేక్షకులకు, మా మద్దతుగా నిలిచిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు.” అన్నారు.

TFJA

Recent Posts

‘ఐ హేట్ మ్యారేజ్ ’ టీజర్‌ విడుదల

సుగి విజయ్, జుప్సీ భద్ర (తొలి పరిచయం) హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘ఐ హేట్ మ్యారేజ్ ’ ఆర్య…

2 hours ago

ఇండియన్ సినిమాలో యాక్షన్ హీరో అంటే ఇకపై విజయ్ దేవరకొండ గురించే చెప్పుకుంటారు – సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా

ఇండియన్ సినిమాలో యాక్షన్ హీరో అంటే ఇకపై విజయ్ దేవరకొండ గురించే చెప్పుకుంటారని అన్నారు సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి…

2 hours ago

“రణబాలి” సినిమాలోని జయమ్మ పాత్ర స్పూర్తితో 400 కుటుంబాలకు 3 నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులు అందించిన హీరోయిన్ రశ్మిక

ఏడాది పాటు ఈ సేవా కార్యక్రమం కొనసాగిస్తానని వెల్లడించిన రశ్మిక, రశ్మికను చూసి గర్వపడుతున్నానని స్పందించిన విజయ్ దేవరకొండ సేవా…

2 days ago

ఘనంగా డైనమిక్ హీరో శ్రీరామ్ “రామభద్రుడు” సినిమా షూటింగ్ ప్రారంభం

"యంగ్ అండ్ డైనమిక్", "మా రాముడు అందరివాడు" వంటి పలు హిట్ చిత్రాల్లో హీరోగా నటించిన డైనమిక్ హీరో శ్రీరామ్…

2 days ago

“క్రేజీ కల్యాణం” ఈ పండక్కి ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసే ఒక క్రేజీ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ – హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్

'నవరసరాయ' డా. నరేష్ విజయ కృష్ణ, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, రాజ్ వెడ్స్ రాంబాయి ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి…

2 days ago

డ్యూ డేట్‌లో పవర్‌ఫుల్‌ లాయర్‌ పాత్రలో విలక్షణ నటుడు సునీల్‌

లోమేష్‌ పుడిపెద్ది హీరోగా, జయశ్రీ‌ హీరోయిన్‌గా, ప్రణీత పట్నాయక్, విజ్ఞానిలు ముఖ్యపాత్రల్లో రూపొందుతున్న చిత్రం 'డ్యూ డేట్‌' వరిష్‌ స్టూడియోస్‌…

2 days ago