శ్రీ మహా సుబ్రహ్మణ్య వేదవేదాంగ విద్యాపీఠమ్ వస్త్ర పంపిణీ చేసిన నందమూరి మోహన రూపా, నందమూరి శ్రీమంతుని

శ్రీ మహా సుబ్రహ్మణ్య వేదవేదాంగ విద్యాపీఠమ్ వద్ద నందమూరి బసవ రామ తారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ నుండి వస్త్ర పంపిణీ చేయడం జరిగింది. హైదరాబాద్ లోని తొర్రూర్ వద్ద ఉన్న ఈ విద్యాపీఠమ్ వద్ద దసరా నవరాత్రుల సందర్భంగా నందమూరి మోహన రూపా గారు, నందమూరి శ్రీమంతుని గారు చైర్మన్ నందమూరి మోహన కృష్ణ గారి ఆధ్వర్యంలో విద్యాపీఠమ్ లోని పెద్ద వారికి, విద్యార్థులకు అందరికీ తమ స్వహస్తాలతో వస్త్రాలను అందచేసి ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ విద్యాపీఠమ్ లోని విద్యార్థులకు మన భారత దేశపు సంప్రదాయాలు, సంస్కృతి, విలువలు నేర్పిస్తూ భవిష్యత్ తరాలను తీర్చిదిద్దే ఈ గురుకులంలోని వారికి వస్త్రాలను అందచేశారు. ఈ సందర్భంగా నందమూరి మోహన రూపా గారు, నందమూరి శ్రీమంతుని గారు అక్కడ ఉన్న ముత్తైదువులకు నమస్కారం చేసుకోగా వేదపండితులు వారిని ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా అక్కడ ఉండే పండితులు మాట్లాడుతూ… “నందమూరి బసవ రామ తారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా శ్రీ మహా సుబ్రహ్మణ్య వేదవేదాంగ విద్యాపీఠమ్ నందు వస్త్ర పంపిణీ చేసిన శ్రీ నందమూరి మోహన కృష్ణ గారికి, నందమూరి మోహన రూపా గారికి, నందమూరి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇటువంటి మహానుభావుల దాతల సహాయంతో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు లభిస్తున్నాయి. అమ్మవారు వీరిని సహాయం చేయమని పంపినట్లు అనుకుంటున్నాము. మా దాతలు సుఖసంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ అమ్మవారిని ప్రార్థిస్తున్నాము” అన్నారు.

TFJA

Recent Posts

మా నమ్మకం నిజమైంది.. తెలుగునాట ‘జైలర్ 2’ ప్రభంజనంపై సంతోషం వ్యక్తం చేసిన సూర్యదేవర నాగవంశీ

సూపర్ స్టార్ రజనీకాంత్, నెల్సన్ దిలీప్‌కుమార్ కలయికలో రూపొందిన 'జైలర్' చిత్రం 2023లో విడుదలై ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే.…

22 hours ago

‘ఐ హేట్ మ్యారేజ్ ’ టీజర్‌ విడుదల

సుగి విజయ్, జుప్సీ భద్ర (తొలి పరిచయం) హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘ఐ హేట్ మ్యారేజ్ ’ ఆర్య…

22 hours ago

ఇండియన్ సినిమాలో యాక్షన్ హీరో అంటే ఇకపై విజయ్ దేవరకొండ గురించే చెప్పుకుంటారు – సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా

ఇండియన్ సినిమాలో యాక్షన్ హీరో అంటే ఇకపై విజయ్ దేవరకొండ గురించే చెప్పుకుంటారని అన్నారు సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి…

22 hours ago

“రణబాలి” సినిమాలోని జయమ్మ పాత్ర స్పూర్తితో 400 కుటుంబాలకు 3 నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులు అందించిన హీరోయిన్ రశ్మిక

ఏడాది పాటు ఈ సేవా కార్యక్రమం కొనసాగిస్తానని వెల్లడించిన రశ్మిక, రశ్మికను చూసి గర్వపడుతున్నానని స్పందించిన విజయ్ దేవరకొండ సేవా…

3 days ago

ఘనంగా డైనమిక్ హీరో శ్రీరామ్ “రామభద్రుడు” సినిమా షూటింగ్ ప్రారంభం

"యంగ్ అండ్ డైనమిక్", "మా రాముడు అందరివాడు" వంటి పలు హిట్ చిత్రాల్లో హీరోగా నటించిన డైనమిక్ హీరో శ్రీరామ్…

3 days ago

“క్రేజీ కల్యాణం” ఈ పండక్కి ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసే ఒక క్రేజీ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ – హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్

'నవరసరాయ' డా. నరేష్ విజయ కృష్ణ, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, రాజ్ వెడ్స్ రాంబాయి ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి…

3 days ago