‘ఐ హేట్ మ్యారేజ్ ’ టీజర్‌ విడుదల

సుగి విజయ్, జుప్సీ భద్ర (తొలి పరిచయం) హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘ఐ హేట్ మ్యారేజ్ ’ ఆర్య సినిమా బ్యానర్‌పై మాదం దయానంద్, కార్తిక్ వెంపటి కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంతో పరమేశ్‌ రేణుకుంట్ల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదల చేసిన ‘అప్పుడే పెళ్లా’ అనే లిరికల్‌ వీడియోకు అనూహ్యమైన స్పందన వచ్చింది. సోషల్‌ మీడియాలో ఈ సాంగ్‌ ట్రెండింగ్‌లో నిలిచింది. కాగా తాజాగా ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్‌. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘ప్రేమ, పెళ్లి, కెరీర్‌తో పాటు స్వతంత్రంగా జీవించాలనే నేటి Gen Z తరం ఆలోచనలు, భావజాలాన్ని వాస్తవానికి దగ్గరగా చూపించే ప్రయత్నం ఈ చిత్రం.జీవితంలో యువత ఎదుర్కొనే భావోద్వేగాలు, నిర్ణయాలను సహజంగా ఆవిష్కరించే ప్రయత్నం ఈ చిత్రంలో కనిపించనుంది. ప్రతి యువత ఈ సినిమాలో క్యారెక్టర్స్‌తో కనెక్ట్‌ అవుతారు. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు కొత్త అనుభూతినిచ్చే ఫ్రెష్ కంటెంట్‌ మా చిత్రంలో వుంది’ అన్నారు. హారిక రాజేందర్, సాహితి కృష్ణ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో పృథ్వీరాజ్, రవివర్మ అడ్డూరి,ప్రభావతి, ఆశ్రిత వేముగంటి, లోహిత్ కుమార్,బేబి తమోఘ్న, రాధ రాయసం, లక్ష్మి, జాకీర్, విజయ్ కుమార్, దాసరి పద్మ రేఖ, శ్రీదేవి ఆర్రోజు, మెయిల్ రమేష్, అరుణ్ కుమార్ రెడ్డి, ప్రముఖ నటి ఇందు, అఖండ సుధాకర్ రెడ్డి తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.

సాంకేతిక నిపుణులు:
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: Vijay C Kumar
సంగీతం: Varikuppala Yadagiri
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: Praveen Immadi
ఎడిటింగ్: ఆవుల వెంకటేష్
PRO: మడూరి మధు
ఆర్ట్: మోహన్ జల్లా
అడిషనల్ డైలాగ్స్: శ్రీనివాస్ తేజ
పాటలు: Varikuppala Yadagiri
కొరియోగ్రఫీ: అల్లు చాణక్య, రాజ్ కృష్ణ
ప్రొడక్షన్ కంట్రోలర్: బి. ఎస్. నాగిరెడ్డి
కో-ప్రొడ్యూసర్స్: సంతోష్ రేణికుంట్ల,
కాశీగారి కోదండ రామ శర్మ
ప్రొడ్యూసర్స్:
దయానంద్ మాదం
కార్తిక్ వెంపటి
కథ – మాటలు – స్క్రీన్‌ప్లే – దర్శకత్వం: Parmesh Renukuntla

TFJA

Recent Posts

భారత్‌లో ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ జోరు – అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం..!

మార్వెల్ స్టూడియోస్ ప్రతిష్టాత్మక చిత్రం ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు శుభవార్త. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాపై భారీ అంచనాలు…

1 week ago

రెండు లక్షల మందితో పాట్నాలో అత్యంత భారీ ఎత్తున నిర్మించిన ‘పుష్ప 2’ పాట్నా కార్యక్రమానికి రెండేళ్లు.. 2.6 లక్షల మంది ఆన్‌లైన్ వీక్షకులతో సరికొత్త మైలురాయి..!

2 లక్షలకు పైగా ప్రజలు హాజరవడం, 2.6 లక్షల మంది యూట్యూబ్ వీక్షకులు ఏకకాలంలో వీక్షించడంతో, భారతీయ సినిమా చరిత్రలో…

1 week ago

ఇట్లు అర్జున’ ఆద్యంతం ఆకట్టుకుంది. అనీష్‌కు తొలి సినిమాతోనే ఛాలెంజింగ్ రోల్ రావడం, దాన్ని అద్భుతంగా నిరూపించుకోవడం, ప్రేక్షకుల ఆశీస్సులు పొందడం నిజంగా గొప్ప విషయం..!

‘ఇట్లు అర్జున’ ఆద్యంతం ఆకట్టుకుంది. అనీష్‌కు తొలి సినిమాతోనే ఛాలెంజింగ్ రోల్ రావడం, దాన్ని అద్భుతంగా నిరూపించుకోవడం, ప్రేక్షకుల ఆశీస్సులు…

1 week ago

ఐఎఫ్ఎఫ్ఐ అవార్డుకు జాతీయ స్థాయిలో నామినేట్ అయిన తొలి తెలుగు వెబ్ సిరీస్‌గా ‘మ‌య‌స‌భ‌’ చరిత్ర!

57వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI)లో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన తొలి తెలుగు రాజకీయ వెబ్…

1 week ago

చిత్ర పరిశ్రమకు అండగా మరోసారి మెగాస్టార్ చిరంజీవి..!

AI దుర్వినియోగంపై పటిష్ఠ రక్షణ చర్యలు కోరుతూ వినతిపత్రం - సంబంధిత మంత్రిత్వ శాఖలతో సమన్వయం చేస్తామని కేంద్ర మంత్రి…

1 week ago

డైనమిక్ హీరో శ్రీరామ్ “రామభద్రుడు” సినిమా హైదరాబాద్ ఆడిషన్స్ సూపర్ సక్సెస్, ఈ నెల 28, 29 తేదీల్లో నెల్లూరులో జరగనున్న ఆడిషన్స్..!

"యంగ్ అండ్ డైనమిక్", "మా రాముడు అందరివాడు" వంటి పలు హిట్ చిత్రాల్లో హీరోగా నటించిన డైనమిక్ హీరో శ్రీరామ్…

1 week ago