Categories: FeaturedUncategorized

‘మెయిన్ వాపస్ ఆవుంగా’ విజయోత్సవం – ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపిన ఇమ్తియాజ్ అలీ

హిందీ చిత్రం ‘మెయిన్ వాపస్ ఆవుంగా’ దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. విడుదలై ఆరు వారాలు పూర్తయినా ఈ సినిమా ఇంకా మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది. ప్రస్తుతం భారతదేశంలో 450కు పైగా షోలతో పాటు విదేశాల్లోని 10 దేశాల్లో కూడా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాల నుంచి గట్టి పోటీ ఉన్నప్పటికీ ఈ సినిమా తన ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగిస్తోంది.

ఈ ఏడాది హిందీ చిత్రాల్లో అత్యంత భారీ విదేశీ విడుదలల్లో ఒకటిగా నిలిచిన ఈ సినిమా, 59 దేశాల్లో 804 స్క్రీన్‌లపై విడుదలైంది. హిందీ రాష్ట్రాలతో పాటు హైదరాబాద్, బెంగళూరు, కోల్‌కతా వంటి నగరాల్లో కూడా ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించడం విశేషం. సినిమాకు వస్తున్న అద్భుతమైన స్పందన నేపథ్యంలో దర్శకుడు ఇమ్తియాజ్ అలీ హైదరాబాద్‌కు వచ్చి ప్రేక్షకులను కలుసుకున్నారు. తమ సినిమాను ఇంతగా ఆదరించి విజయవంతం చేసినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

తన భావోద్వేగ కథలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ఇమ్తియాజ్ అలీ, ‘మెయిన్ వాపస్ ఆవుంగా’కు లభిస్తున్న ప్రేమకు ఆనందం వ్యక్తం చేశారు. మొదట నెమ్మదిగా ప్రారంభమైన ఈ సినిమా, ప్రేక్షకుల నోటి మాట ప్రచారంతో ఇప్పుడు ఈ ఏడాది అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ముఖ్యంగా యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులను కూడా ఈ సినిమా భావోద్వేగ కథ, అద్భుత నటన, హృదయానికి హత్తుకునే సన్నివేశాలతో ఆకట్టుకుంది.

హైదరాబాద్ పర్యటనలో ఇమ్తియాజ్ అలీ అభిమానులతో మాట్లాడి వారి ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రేక్షకుల సానుకూల స్పందన వల్లే థియేటర్లలో షోలు పెరిగాయని, భారత్‌తో పాటు విదేశాల్లో కూడా సినిమా విజయవంతంగా కొనసాగుతోందని పేర్కొన్నారు.

ఇమ్తియాజ్ అలీ శైలిలో ప్రేమ, భావోద్వేగాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో దిల్‌జిత్ దోసాంజ్, నసీరుద్దీన్ షా, శర్వరి, వేదాంగ్ రైనా ప్రధాన పాత్రల్లో నటించారు. బిర్లా స్టూడియోస్, అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్తో కలిసి మోహిత్ చౌదరి, శిబాసిష్ సర్కార్ నిర్మించిన ఈ చిత్రాన్ని బిర్లా స్టూడియోస్ వరల్డ్‌వైడ్ విడుదల చేసింది. ఈ సినిమా సంగీతాన్ని టిప్స్ మ్యూజిక్ అందించింది. ప్రస్తుతం ఈ చిత్రం విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శితమవుతోంది.

TFJA

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

2 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

2 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

2 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago