‘యమకింకరుడు’ ట్రైలర్‌ విడుదల చేసిన “రాక్షసుడు” నిర్మాత కె.ఎస్. రామారావు!

(తెలుగులో మొదటి AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సినిమాగా ‘యమ కింకరుడు’)

ప్రముఖ నిర్మాత, దర్శకుడు తుమ్మలపల్లి రామసత్యనారాయణ టైటిల్ పాత్ర పోషిస్తూ, దర్శకత్వం వహించి నిర్మిస్తున్న వినూత్న చిత్రం ‘యమ కింకరుడు’. తెలుగు సినీ చరిత్రలోనే మొదటిసారిగా AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సాంకేతికతతో రూపుదిద్దుకున్న చిత్రంగా ఇది చరిత్ర సృష్టించనుంది. ఈ చిత్రంలో వర్సటైల్ యాక్టర్ సుమన్ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రం ట్రైలర్‌ను ప్రముఖ సీనియర్ నిర్మాత కె.ఎస్. రామారావు విడుదల చేశారు. ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉందంటూ చిత్ర యూనిట్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ: “తెలుగు ఇండస్ట్రీలో కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో రామసత్యనారాయణ ఎప్పుడూ ముందుంటారు. AI సాంకేతికతతో తెలుగులో మొదటి సినిమా తీయడం అభినందనీయం. ట్రైలర్ చాలా వినూత్నంగా, ఆసక్తికరంగా ఉంది. సుమన్ పాత్ర సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. ఈ ప్రయోగం పెద్ద విజయం సాధించి, చిత్ర బృందానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను” అనిఅన్నారు!!

హీరో, దర్శకుడు, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ: “మా ‘యమ కింకరుడు’ ట్రైలర్‌ను విడుదల చేసి మమ్మల్ని ఆశీర్వదించిన కె.ఎస్. రామారావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. తెలుగులో తొలి AI చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుండటం మాకు ఎంతో గర్వకారణం. సుమన్ గారు ఈ ప్రాజెక్ట్‌లో భాగమవ్వడం సినిమా స్థాయిని పెంచింది. సాంకేతికంగా, కథాపరంగా ప్రేక్షకులకు ఇది ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుంది. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం” అని అన్నారు!!

నటీనటులు:
తుమ్మలపల్లి రామసత్యనారాయణ, సుమన్ తదితరులు….

సాంకేతికవర్గం:
పి.ఆర్.ఓ: ధీరజ అప్పాజీ
సాంకేతికత: AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)
కథ, కథనం, నిర్మాణం, దర్శకత్వం: తుమ్మలపల్లి రామసత్యనారాయణ!!

TFJA

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

4 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

5 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

5 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago