గ్రాండ్‌గా జరిగిన ‘MRP – నీకెంత నాకెంత’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. జూలై 17న రిలీజ్

యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘MRP – నీకెంత నాకెంత’ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రచార కంటెంట్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. కామెడీ, యాక్షన్, ఎమోషన్స్‌తో కూడిన వినోదాత్మక చిత్రంగా ‘MRP – నీకెంత నాకెంత’ ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్ర బృందం తెలిపింది.ఈ చిత్రంలో నరేష్ అగస్త్య హీరోగా నటించగా, డోనల్ బిష్ట్ కథానాయికగా అలరించనున్నారు. అలాగే వెన్నెల కిషోర్, సుదర్శన్, కసిరెడ్డి రాజ్‌కుమార్, హర్ష వర్ధన్, చైతన్య జొన్నలగడ్డ, పృథ్వీ రాజ్, గగన్ విహారి, నంద గోపాల్, స్నేహా సింగ్ తదితరులు కీలక పాత్రల్లో నటించి సినిమాకు మరింత బలం చేకూర్చారు.శ్రవణ్ జేష్ఠ నిర్మాతగా, దర్శకుడిగా తెరకెక్కించిన ఈ చిత్రానికి రాకేష్ కొలాంచి సినిమాటోగ్రఫీ అందించగా, అజయ్ అరసాడ సంగీతాన్ని సమకూర్చారు. మార్థాండ్ కె. వెంకటేష్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. పంచజన్య ఫీచర్స్ సమర్పణలో రూపొందిన ఈ చిత్ర సంగీతాన్ని ఆదిత్య మ్యూజిక్ విడుదల చేస్తోంది.ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. వినోదానికి కొత్త నిర్వచనం చెప్పేలా రూపొందిన ‘MRP – నీకెంత నాకెంత’ చిత్రం జూలై 17న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.

దర్శక నిర్మాత శ్రవణ్ జేష్ఠ మాట్లాడుతూ:
“మా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు విచ్చేసి మాకు అండగా నిలిచిన మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మా సినిమా టీజర్, లిరికల్ వీడియో సాంగ్స్‌కు ప్రేక్షకుల నుంచి ఎంతో మంచి స్పందన రావడం చాలా ఆనందంగా ఉంది.ఈ సినిమాను పూర్తి చేయడానికి తమ సమయం, కృషిని అంకితం చేసిన మా నటీనటులు, సాంకేతిక నిపుణులు, మొత్తం చిత్ర బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు. అందరి సహకారంతోనే ఈ సినిమా ఇంత అందంగా రూపొందింది.
ఇప్పుడు మా సినిమా జూలై 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రేక్షకులందరూ థియేటర్లకు వచ్చి ‘MRP – నీకెంత నాకెంత’ చిత్రాన్ని ఆదరించి, మా కష్టానికి మంచి ఫలితాన్ని అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.”

హీరో నరేష్ అగస్త్య మాట్లాడుతూ:
“మా ‘MRP – నీకెంత నాకెంత’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు విచ్చేసి మాకు అండగా నిలిచిన మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన మా దర్శక నిర్మాత శ్రావణ్ జేస్తా గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.
ఈ సినిమా షూటింగ్ మొత్తం నాకు ఎంతో ఆనందంగా సాగింది. కసిరెడ్డి రాజ్‌కుమార్, వెన్నెల కిషోర్, గగన్ విహారితో పాటు మా చిత్రంలోని ప్రతి నటుడు, సాంకేతిక నిపుణుడితో కలిసి పనిచేయడం ఒక అద్భుతమైన అనుభవం. అందరూ ఎంతో సహకారంతో, స్నేహపూర్వక వాతావరణంలో ఈ సినిమాను పూర్తి చేశాం.
ఇప్పటివరకు విడుదలైన మా సినిమా ప్రచార కంటెంట్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రావడం చాలా సంతోషంగా ఉంది. జూలై 17న విడుదల కానున్న ‘MRP – నీకెంత నాకెంత’ చిత్రాన్ని థియేటర్లలో చూసి ప్రేక్షకులందరూ ఆదరిస్తారని, మా కష్టాన్ని తప్పకుండా అభినందిస్తారని ఆశిస్తున్నాను.”

హీరోయిన్ డోనల్ బిష్ట్ మాట్లాడుతూ:
“‘MRP – నీకెంత నాకెంత’ నా తొలి తెలుగు సినిమా కావడం నాకు ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తోంది. ఈ సినిమాపై వస్తున్న స్పందన చూసి చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. నేను హైదరాబాద్‌కు వచ్చిన ప్రతీసారి ఇక్కడి ప్రేక్షకుల నుంచి లభిస్తున్న ప్రేమ, ఆదరణ చూసి నిజంగా ఎంతో ఆనందంగా, అదృష్టంగా భావిస్తాను.నాకు తెలుగు భాష రాకపోయినా మా కో-స్టార్స్ అందరూ ప్రతి విషయంలో అండగా నిలిచారు. షూటింగ్ సమయంలో వారు ఇచ్చిన సహకారం వల్లే నా పాత్రను మరింత నమ్మకంగా చేయగలిగాను. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.ఇప్పటివరకు విడుదలైన మా సినిమా టీజర్, పాటలు, ఇతర ప్రచార కంటెంట్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. జూలై 17న విడుదల కానున్న మా ‘MRP – నీకెంత నాకెంత’ చిత్రాన్ని అందరూ థియేటర్లలో చూసి ఆదరిస్తారని, మా సినిమా మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాను.”

చిత్ర వివరాలు:

నటీనటులు : నరేష్ అగస్త్య, డోనల్ బిష్ట్, వెన్నెల కిషోర్, సుదర్శన్, కాశిరెడ్డి రాజ్‌కుమార్, హర్ష వర్ధన్, చైతన్య జొన్నలగడ్డ, పృథ్వీ రాజ్, గగన్ విహారి, నంద గోపాల్, స్నేహా సింగ్

నిర్మాత – దర్శకుడు: శ్రవణ్ జేష్ఠ
ఎడిటర్: మార్థాండ్ కె. వెంకటేష్
సంగీతం: అజయ్ అరసాడ
ఛాయాగ్రహణం (డీఓపీ): రాకేష్ కొలాంచి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శ్రీనివాస్ గాదిరాజు
పీఆర్‌వో: కోయ దినేష్

TFJA

Recent Posts

వైభవంగా యూనిక్ పొలిటికల్ ఎంటర్ టైనర్ ‘ధర్మస్థల నియోజకవర్గం’ మూవీ ప్రెస్ మీట్

సెప్టెంబర్ 4న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న ‘ధర్మస్థల నియోజకవర్గం’ సినిమా మూవింగ్ డ్రీమ్స్ ఇండియా…

3 hours ago

“కింగ్డమ్” ఫేమ్ వెంకటేష్.వి.పి. హీరోగా రుద్రాంశ్ సెల్యులాయిడ్ నిర్మాణంలో ధీరజ్ న్యాతి ఆధ్వర్యం లో సురేష్ తేజ్ దర్శకత్వంలో ప్రొడక్షన్ నెం.3 మూవీ అనౌన్స్ మెంట్

"కె ర్యాంప్" వంటి కమర్షియల్ సక్సెస్ తర్వాత రుద్రాంశ్ సెల్యులాయిడ్ సంస్థ మరో కొత్త చిత్రాన్ని నిర్మిస్తోంది. సక్సెస్ ఫుల్…

3 hours ago

కీరవాణి గారి లేథోవిస్ మ్యూజిక్ లేబుల్ నుండి రానున్న మరొక సంచలన గీతం – ఈ నెల 28న విడుదల

ఇండిపెండెంట్ ఆర్టిస్టులను ప్రోత్సహించే తరుణంలో ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి గారు ఇటీవల లేథోవిస్ అనే మ్యూజిక్ లేబుల్ ప్రారంభించడం…

3 hours ago

పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ‘విలేజ్ స్టార్స్’ సినిమా

హైదరాబాద్: తెలుగు తెరపైకి మరో బ్యూటిఫుల్ ఎంటర్టైన్మెంట్ రాబోతొంది. ఎన్‌ఎస్‌వీ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై తెరకెక్కనున్న నూతన చిత్రం ‘విలేజ్ స్టార్స్’…

4 hours ago

కల్ట్ ప్రొడ్యూసర్ SKN గారి చేతుల మీదగా మిస్సింగ్ మేఘన మూవీ టీజర్ లాంచ్*

ఫస్ట్ కాపీ మూవీస్, కేడి & కో బ్యానర్ పై పంచుమర్తి నరేష్ బాబు ప్రొడ్యూసర్ గా, వాచస్పతి దర్శకత్వంలో…

5 hours ago

‘అమీర్ లోగ్’ లాంటి చిత్రం ఇప్పటి వరకు రాలేదు.. ఇది కచ్చితంగా హిట్టు బొమ్మ.. ప్రెస్ మీట్‌లో దర్శకుడు రమణా రెడ్డి సోమ

'అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్' బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మించిన తొలి చిత్రం ‘అమీర్ లోగ్’. ఈ మూవీకి రమణా…

6 hours ago