రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ లీడ్ రోల్స్‌లో ‘అర్జున ఫల్గుణ’ ఫేమ్ తేజ మార్ని తెరకెక్కించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’. శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలకపాత్రలలో నటించిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించారు. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని నవంబర్ 24న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలయ్యేందుకు ముస్తాబైంది. ఈ సినిమాను సెన్సార్ చేసిన అధికారులు U/A సర్టిఫికేట్‌తో పాటు.. ఉత్కంఠను కలిగించే కథనంతో వస్తున్న ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు చిత్రయూనిట్‌ను అభినందించారు.
ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేయగా.. సెన్సార్ అధికారులు కూడా సినిమాపై ప్రశంసలు కురిపించడంతో చిత్రబృందం సినిమా సక్సెస్‌పై ధీమాగా ఉంది. ప్రస్తుతం ఎన్నికల సీజన్ నడుస్తుండటం, ఇందులో అందుకు సంబంధించిన పాయింట్ ఉండటం సినిమాకు మరింత ప్లస్ అవుతుందని యూనిట్ భావిస్తోంది.
పాటలు, టీజర్, కూడా అదే నిరూపించాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని నవంబర్ 24న గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నామని, ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఈ సినిమా ఇస్తుందని ఈ సందర్భంగా మేకర్స్ తెలిపారు.
ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…
డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…
వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు.…
చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ 'మన శంకర వర ప్రసాద్ గారు' తో…
రాకింగ్ స్టార్ యష్ సెన్సేషనల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’లో మెల్లిసా పాత్రలో రుక్మిణి…