Uncategorized

“జరీ జరీ పంచె కట్టు’ సాంగ్ గ్రాండ్ లాంచ్ ..

నివృతి’ వైబ్స్ విడుదల చేసిన ‘జరీ జరీ పంచె కట్టు’ సాంగ్ ..

జ్యోతి, ప్రియ, ప్రశాంత్ నిర్మాతలుగా మదిన్ సంగీత సారథ్యంలో వి.జె .శేఖర్ మాస్టర్ నృత్య దర్శకత్వంలో మానస్ నాగులపల్లి, యాంకర్ విష్ణు ప్రియ నర్తించిన ‘జరీ జరీ పంచె కట్టు’ ఫోక్ సాంగ్ ను నివ్రితి వైబ్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విడుదల చేసారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రఘు కుంచె, సుద్దాల అశోక్ తేజ, వి జె శేఖర్ మాస్టర్, సాకేత్, రమణా చారి, ప్రసన్నకుమార్, పద్మిని నాగులపల్లి, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, బిగ్ బాస్ ఫేమ్స్ కాజల్, సన్నీ, తదితరులు హాజరయ్యారు.

మొదటగా
సాకేత్ (సింగర్) మాట్లాడుతూ.. సుద్దాల అశోక్ తేజ గారు రాసిన .”జరీ జరీ పంచె కట్టు” పాటను నేను పాడటం అదృష్టం గా భావిస్తున్నా.. ఈ ఆల్బమ్ సాంగ్స్ అన్నింటినీ యూట్యూబ్ ఛానల్ లో విడుదల చేయడం కోసం ఇంత ఖర్చు పెట్టి నిర్మించిన నిర్మాతలను నేను అభినందిస్తున్నాను అన్నారు.

హీరో మానస్ మాట్లాడుతూ..సుద్దాల అశోక్ తేజ్ గారితో లిరిక్స్ రాయించుకొని, శేఖర్ మాస్టర్ కు మాకు డేట్స్ అడ్జెస్ట్ కాకపోయినా శేఖర్ మాస్టర్ కోరియోగ్రఫీ లోనే ఈ పాట చెయ్యాలని పట్టు బట్టి చేసిన నివ్రితి వైబ్స్ వారికి థాంక్స్ చెప్పాలి. ఒక యు ట్యూబ్ సాంగ్ కు ఇంత ఖర్చు పెట్టి చేశారు చాలా గ్రాండ్ గా తీశారు.. ఈ పాటను చూసిన వారు చాలామంది ఇది మూవీ సాంగ్ అనుకునేలా చిత్ర నిర్మాతలు ఖర్చుకు వెనుకా డకుండా చాలా రిచ్ గా తెరకెక్కించారు . సుద్దాల అశోక్ తేజ్ గారు ఇచ్చిన లిరిక్స్అందరూ హమ్ చేసేలా చాలా ఈజీగా ఉన్నాయి.ఈ పాటకు సింగర్స్ అందరూ ఎంతో డెడికేటెడ్ వర్క్ చేశారు. అలాగే చాలా టాప్ టెక్నిషియన్స్ వర్క్ చేయడం వలనే ఈ సాంగ్ చాలా బాగా వచ్చింది.ఇంకా ఇలాంటి మంచి పాటలు ఎన్నో తీస్తూ నివృతి’ వైబ్స్ కు ఇండస్ట్రీ లో మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

పద్మిని నాగులపల్లి మాట్లాడుతూ.. సుద్దాల అశోక్ తేజ్ రాసిన ఈ పాట చాలా బాగుంది.శేఖర్ మాస్టర్ కోరియోగ్రఫీ లో మానస్, విష్ణు ప్రియల “జరీ జరీ పంచెకట్టు” పాటకు అద్భుతంగా డాన్స్ చేశారు.ఇంకముందు కూడా నివ్రితి వైబ్స్ వారు ఇలాంటి మంచి హిట్ పాటలు తియ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

సన్నీ మాట్లాడుతూ.. మానస్ ను అందరూ హి విల్ బి స్టార్ అంటున్నారు.. బట్ నాకు తెలిసినంత వరకు మానస్ హి ఈజ్ ఎ స్టార్.. ఈ సాంగ్స్ లో తను చేసిన డాన్స్ అదిరిపోయింది.మానస్, విష్ణు ప్రియ ల డాన్స్ చాలా చూడముచ్చటగా ఉంది. వీరిద్దరూ డ్యాన్స్ చేసిన ఈ పాటకు ప్రేక్షకులనుండి మంచి క్రేజ్ వస్తుందని ఆశిస్తున్నా నివ్రితి వైబ్స్ ద్వారా వస్తున్న ఈ పాట బిగ్ హిట్ అవ్వాలి అన్నారు.

కాజల్ మాట్లాడుతూ.. మానస్, విష్ణు ప్రియలు చేసిన సాంగ్ ప్రోమో చాలా వైరల్ అయ్యింది. ఈ ఫుల్ సాంగ్ కొరకు వెయిట్ చేశాను. ఇప్పుడు రిలీజ్ అయిన ఈ పాట ఇంకా బిగ్ హిట్ అవ్వాలి అన్నారు.

మానస్, విష్ణు ప్రియ

సాంకేతిక నిపుణులు :
బ్యానర్ : నివృతి వైబ్స్
నిర్మాతలు : జ్యోతి కున్నూరు
కొరియోగ్రాఫర్ : శేఖర్ మాస్టర్
మ్యూజిక్ : మదీన్ ఎస్. కె
డి. ఓ. పి : సాయి శ్రీ రామ్
లిరిక్స్ : సుద్దాల అశోక్ తేజ
సింగర్స్ : శ్రావణి భార్గవి, సాకేత్ కొమండూరి, స్ఫూర్తి జితేందర్
ఆర్ట్ : రామ్ కుమార్
ప్రొడక్షన్ కంట్రోలర్ : రవీందర్ బెక్కం

పి.ఆర్.ఓ : లక్ష్మీ నివాస్

Tfja Team

Recent Posts

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ…

5 hours ago

ఫిబ్రవరి 6, 2026న‌ ‘యుఫోరియా’ గ్రాండ్ రిలీజ్‌

బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమ‌తి రాగిణి గుణ స‌మ‌ర్ప‌ణ‌లో గుణ…

4 days ago

కోయంబత్తూరులోని ఈ యోగ కేంద్రం వద్దనున్న లింగ భైరవి సన్నిధిలో, పవిత్రమైన ‘భూత శుద్ధి వివాహం’ చేసుకున్న సమంత ప్రభు, రాజ్ నిడిమోరు

ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…

4 days ago

తల్లి చేతుల మీదుగా అవార్డులను అందుకున్న మధుర క్షణాల్ని గుర్తు చేసుకున్న సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్

సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…

3 weeks ago

“రాజు వెడ్స్ రాంబాయి” మీ హృదయాన్ని తాకే అందమైన ప్రేమ కథ – ట్రైలర్ లాంఛ్ లో హీరో అడివి శేష్

అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…

3 weeks ago

‘దేవగుడి’ రియల్ స్టోరి.. కచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది – టీజర్ లాంచ్ వేడుకలో హీరో శ్రీకాంత్

కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…

3 weeks ago