కిరణ్ అబ్బవరం హీరోగా రూపొందిన ‘క’ చిత్రం ఎంతటి సన్సేషనల్ బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రంగా నిలిచిందో అందరికి తెలిసిందే. ఇప్పుడు ‘క’ చిత్రాన్ని నిర్మించిన మేకర్స్ మరో డిఫరెంట్ అండ్ న్యూ ఏజ్ కాన్సెప్ట్ ఫిల్మ్‌తో రాబోతున్నారు. శ్రీ చక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై శ్రీమతి చింతా వరలక్ష్మీ సమర్పణలో చింతా వినీషా రెడ్డి, చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి వినయ్ రత్నం దర్శకుడు. వంశి తుమ్మల, సంధ్య వశిష్ట హీరో, హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ చిత్రం టైటిల్ గ్లింప్స్‌ను సోమవారం కథానాయకుడు కార్తీకేయ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర బృందానికి శుభాకాంక్షలు అందజేశాడు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ” యంగ్‌స్టర్స్ అంతా కలిసి చేసిన ఫ్రెష్ ఫీల్ వున్న చిత్రమిది. మెల్లకన్ను ఉన్న యువకుడు ఇన్‌సెక్యూర్‌తో కళ్ళద్డాలు పెట్టుకుని లైఫ్‌ని మేనేజ్ చేస్తుంటాడు. అలాంటి అబ్బాయి లవ్‌లో పడితే ఏం జరుగుతుంది అనే ఓ ఫన్ డ్రామా చుట్టు జరిగే కథ ఇది. బ్యూటిఫుల్ విలేజ్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రతి పాత్ర, ప్రతి సన్నివేశం ఎంతో సహజంగా ఉంటుంది. చిత్రంలో అన్ని ఎమోషన్స్ ఉంటాయి. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు పూర్తి సంతృప్తినిచ్చే చిత్రమిది’ అన్నారు. వంశీ తుమ్మల, సంధ్య వశిష్ట, కల్పలత గార్లపాటి, తులసి, కిట్టయ్య, గోపీనాథ్ (గోపీ హ్యాపీ), శివకుమార్ మట్ట, అరుణ్‌కుమార్, శంకర్, నాయుడు ఫణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి
రచన & దర్శకత్వం- వినయ్ రత్నం,
నిర్మాత – చింతా వినీషా రెడ్డి,
చింతా గోపాలకృష్ణ రెడ్డి
సహ నిర్మాత- చింతా రాజశేఖర్ రెడ్డి
సినిమాటోగ్రాఫర్- అక్షయ్ రామ్ పొడిశెట్టి
ఎడిటర్-అన్వర్ అలీ
సంగీతం-చందు & రవి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్
షేక్ రజాక్
T.కార్తీక్ రెడ్డి
సింక్ సౌండ్ & డిజైన్ – V స్వప్నిక్ రావ్
ఆర్ట్ డైరెక్టర్ – విష్ణు వర్ధన్ పుల్ల
సౌండ్ మిక్సింగ్ – విష్ణు సుజాతన్
కో-రైటర్ – రామ్ చరణ్ సత్తిరాజు
లైన్ ప్రొడ్యూసర్ – అఖిలేష్ రేలంగి
ప్రొడక్షన్ మేనేజర్ – శ్రావణ్ కుమార్ కుంపట్ల
కాస్ట్యూమ్ డిజైనర్ – తేజస్విని
కలరిస్ట్ – K విష్ణువర్ధన్
VFX – రిషి మామిడాల
పబ్లిసిటీ డిజైన్స్ – RC DESIGNS
మార్కెటింగ్ – హౌస్ఫుల్
పిఆర్ఓ – ఏలూరు శ్రీను, మాడూరి మధు
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…