‘కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు.. మహా పురుషులవుతారు’ అని చెప్పే ఇన్‌స్పైరింగ్ పర్సనాలిటీస్ ఎందరో.. అలాంటి వారిలో ఒకరు విజయ్ శంకేశ్వర్. ఆయన జీవన ప్రయాణం, సాధించిన విజయాలను గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సామాన్యుడిగా తన జీవితాన్ని ప్రారంభించి ఓ పెద్ద లాజిస్టిక్ కంపెనీకి అధినేతగా ఎదిగి ఎందరికో ఆదర్శప్రాయుడిగా నిలిచిన విజయ్ శంకేశ్వర్‌ది. ఆయన జీవితాన్ని ‘విజయానంద్’ అనే పేరుతో సినిమాగా రూపొందిస్తున్నారు. ఇండియాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బయోపిక్‌గా ప్రేక్షకులను సినిమా అలరించనుంది.
దేశంలో అతి పెద్ద లాజిస్టిక్ కంపెనీల్లో ఒకటైన వీఆర్ఎల్‌కు సంబంధించిన వీఆర్ఎల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఇప్పటికే లాజిస్టిక్ రంగంతో పాటు మీడియా సహా పలు రంగాల్లో తనదైన స్థానాన్ని దక్కించుకుంది. ఇప్పుడు వి.ఆర్.ఎల్ ఫిల్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌తో సినీ రంగంలోకి అడుగు పెడుతున్నారు. ఈ బ్యానర్‌లో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ ‘విజయానంద్’. డిసెంబర్ 9న భారీ స్థాయిలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలవుతుంది.
ఆనంద్ శంకేశ్వర్ సమర్పణ..వి.ఆర్.ఎల్ ఫిల్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రిషికా శర్మ దర్శకత్వంలో ఆనంద్ శంకేశ్వర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విజయ్ శంకేశ్వర్ తన తండ్రిపై ఆధారపడకుండా తన సొంత తెలివి తేటలతో లారీల వ్యాపారంలోకి ఎలా ప్రవేశించారు. అటు నుంచి ఆయన క్రమ క్రమంగా ఎలా ఎదుగుతూ వచ్చారనే సినిమా కథాంశం. ఆల్ రెడీ రిలీజైన టీజర్‌కు చాలా మంచి స్పందన వచ్చింది. అలాగే రీసెంట్‌గా బెంగుళూరులో రిలీజైన సాంగ్ ‘ఆగి చూసే నా కన్నులే’ సాంగ్‌ను విడుదల చేయగా సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది.
కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు.. మహా పురుషులవుతారు అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ విజయ్ శంకేశ్వర్. ఆయన జీవితం సినిమా రూపంలో వస్తుందంటే వఇది కచ్చితంగా చాలా మందికి స్ఫూర్తిని కలిగిస్తుందనటంలో సందేహం లేదు. రిషికా శర్మ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. విజయ్ శంకేశ్వర్ పాత్రలో నిహాల్ నటించారు. ఆనంత్ నాగ్, వినయ ప్రసాద్, వి.రవిచంద్రన్, ప్రకాష్ బెలవాడి, అనీష్ కురివిల్లా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సౌతిండియన్ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. కీర్తన్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు.
ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…
డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…
వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు.…
చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ 'మన శంకర వర ప్రసాద్ గారు' తో…
రాకింగ్ స్టార్ యష్ సెన్సేషనల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’లో మెల్లిసా పాత్రలో రుక్మిణి…