‘కమిటీ కుర్రోళ్ళు’ ఆడియెన్స్ తప్పకుండా ఆదరిస్తారు సిద్దు జొన్నలగడ్డ

నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాకు య‌దు వంశీ ద‌ర్శ‌కుడు. అంతా కొత్త వారితో చేస్తున్న ఈ చిత్రం ఇప్పటికీ అందరిలోనూ అంచనాలు పెంచేసింది. ఇది వరకు రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా శుక్రవారం నాడు ఈ చిత్రం నుంచి ట్రైలర్‌ను యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ రిలీజ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన కార్యక్రమంలో..

సిద్దు జొన్నలగడ్డ మాట్లాడుతూ.. ‘నన్ను పిలిచి ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగమయ్యేలా చేసిన నిహారిక గారికి థాంక్స్. ఇది చిన్న చిత్రం కాదని అర్థమైంది. అసలు చిన్న సినిమా, పెద్ద సినిమా అనేది ఉండదు. ఓ సినిమాకు తక్కువ ఖర్చు పెడతాం.. ఎక్కువ ఖర్చు పెడతామంతే. ఇది చాలా పెద్ద బడ్జెట్‌తో తీసిన పెద్ద సినిమాలా కనిపిస్తోంది. విజువల్స్ బాగున్నాయి. ఇలా కొత్త వారితో ఇంత మంచిగా చిత్రాన్ని తీయడం అంటే మామూలు విషయం కాదు. యదు గారికి ఇది మొదటి సినిమాలా అనిపించడం లేదు. సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ ఆల్ ది బెస్ట్. నిహారిక గారు మల్టీ టాలెంటెడ్. నటిస్తున్నారు.. నిర్మిస్తున్నారు.. షోలు చేస్తున్నారు. ఆమెకు ఈ చిత్రం పెద్ద హిట్ అయి భారీ లాభాల్ని తెచ్చి పెట్టాలి. ఇలాంటి మంచి చిత్రాలు వస్తే ఆడియెన్స్ తప్పకుండా ఆదరిస్తారు.. పెద్ద హిట్ చేస్తారు’ అని అన్నారు.

నిహారిక కొణిదెల మాట్లాడుతూ.. ‘షూటింగ్ ఉన్నా కూడా పిలిచిన వెంటనే వచ్చిన సిద్దు గారికి థాంక్స్. మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రమేష్ గారు లేకపోతే సినిమా ఇక్కడి వరకు వచ్చేది కాదు. టీం అంతా కలిసి కష్టపడి సినిమా చేశాం. మూవీకి పని చేసిన ప్రతీ ఒక్కరూ బెస్ట్ ఇచ్చారు. అందరికీ థాంక్స్. కమిటీ కుర్రోళ్ళు అంతా కూడా మూడేళ్లు సినిమా కోసం పని చేస్తూనే ఉన్నారు. అందరూ వారి వారి పాత్రలకు ప్రాణం పోశారు. ఆగస్ట్ 9న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.

ద‌ర్శ‌కుడు య‌దు వంశీ మాట్లాడుతూ.. ‘మా ఈవెంట్‌కు వచ్చిన సిద్దు గారికి థాంక్స్. మా సినిమాలో నటించిన 11 మంది కూడా సిద్దు గారిలానే ఎంతో కష్టపడుతుంటారు. మా టెక్నికల్ టీం సపోర్ట్ వల్లే సినిమాను ఇంత బాగా తీయగలిగాను. సినిమా చూస్తే చాలా రీఫ్రెష్‌గా, నోస్టాల్జిక్‌గా అనిపిస్తుంది. నిహారిక గారు, ఫణి గారు లేకపోతే మూవీని ఇంత బాగా తీసేవాళ్లం కాదు. రమేష్ గారు మాకు ఎంతో అండగా నిలిచారు. మేం మంచి చిత్రాన్ని తీశాం. ఆగస్ట్ 9న మా సినిమా థియేటర్లోకి రానుంది. అందరూ చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.

నిర్మాత ఫణి అడపాక మాట్లాడుతూ.. ‘మా కమిటీ కుర్రోళ్లు టీంకు కంగ్రాట్స్. చాలా మంచి చిత్రాన్ని తీశాం. సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ కంగ్రాట్స్. మా ఈవెంట్‌కు వచ్చిన సిద్దు గారికి థాంక్స్. ఎమోషనల్ క్యారీ అయ్యేట్టుగా.. అనుకున్నది అనుకున్నట్టుగా యదు సినిమాను తీశారు. ఆగస్ట్ 9న మా చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రమేష్ మాట్లాడుతూ.. ‘ట్రైలర్ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. సినిమా కూడా అందరికీ నచ్చుతుంది. యదు గారు మంచి సినిమాను తీశారు. విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో మంచి యూత్ ఫుల్ సినిమాను తీశారు. ఇలాంటి సినిమాకు సిద్దు గారిలాంటి హీరో గెస్టుగా రావడం ఆనందంగా ఉంది. ఆగస్ట్ 9న మా చిత్రం రాబోతోంది. చూసి అందరూ సక్సెస్ చేయాలి’ అని అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ దేవ్ మాట్లాడుతూ.. ‘మా ట్రైలర్‌ను రిలీజ్ చేసిన సిద్దు గారికి థాంక్స్. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా దర్శక, నిర్మాతలకు థాంక్స్. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన సాంగ్స్ అందరికీ నచ్చాయి. ట్రైలర్ కూడా అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను. ఇంత మంచి సినిమాకు పని చేయడం ఆనందంగా ఉంది. ఆగస్ట్ 9న మా చిత్రం రాబోతోంది. అందరూ చూడండి.. అందరికీ నచ్చుతుంది’ అని అన్నారు.

కెమెరామెన్ రాజు మాట్లాడుతూ.. ‘మా సినిమా ట్రైలర్‌ లాంచ్ ఈవెంట్‌కు గెస్టుగా వచ్చిన సిద్దు గారికి థాంక్స్. యదు గారు మంచి కథను రాశారు. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. నా విజువల్స్‌ను మ్యూజిక్ డైరెక్టర్ మరో లెవెల్‌కు తీసుకెళ్లారు. ఆగస్ట్ 9న మా చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

Tfja Team

Recent Posts

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘గోపాల గోపాల’ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

14 hours ago

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

5 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

5 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

1 week ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago