GA2 బేనర్ నుంచి వచ్చిన ‘ఆయ్’ సినిమాకు ఉత్తమ సంపూర్ణ వినోదాత్మక చిత్రం

Must Read

ద్దర్ అవార్డులు 2024 సంవత్సరానికి గాను మా GA2 బేనర్ నుంచి వచ్చిన ‘ఆయ్’ సినిమాకు ఉత్తమ సంపూర్ణ వినోదాత్మక చిత్రం కేటగిరీలో, ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ సినిమాకు ఉత్తమ సహాయ నటి కేటగిరీలో అవార్డు ప్రకటించిన సందర్భంలో తెలంగాణ ప్రభుత్వానికి, గద్దర్-2024 అవార్డుల జ్యూరీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము.


ఈ రెండు సినిమాలలో నటించిన, పనిచేసిన నటీనటులకు, సాంకేతిక సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేయుచున్నాము. ఆరోగ్యకరమైన వినోదాన్ని ప్రేక్షకులకు అందివ్వడమే ధ్యేయంగా సాగుతున్న మా ప్రయాణానికి పట్టం కట్టిన రెండు రాష్ట్రాల తెలుగు ప్రేక్షకుల ప్రేమకు ఎప్పుడూ సదా రుణపడి ఉంటాము.
ఇట్లు,
మీ GA2 కుటుంబం.

Latest News

‘బకాసుర రెస్టారెంట్‌’ నుంచి అయ్యో ఏమీరా ఈ జీవితం సాంగ్‌ను ఆవిష్కరించిన బ్లాక్‌బస్టర్‌ డైరెక్టర్‌ దర్శకుడు హరీశ్‌ శంకర్‌

పలు విజయవంతమైన చిత్రాలతో మంచి నటుడిగా, కమెడియన్‌గా అందరికి సుపరిచితుడైన ప్రవీణ్‌ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం 'బకాసుర రెస్టారెంట్‌', ఈ చిత్రంలో వైవా హర్ష...

More News