ఎల్ఎ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద హేమంత్ కుమార్, అయానా, గోపీక సురేష్ ప్రధాన పాత్రల్లో విజయ్ ఎన్ తెరకెక్కించిన చిత్రం ‘ఆల్ఫా’. ఉప శీర్షిక మెన్ లవ్ వెంజన్స్. ఈ సినిమాని హేమంత్ కుమార్, ఆనంద్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 20న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ మూవీని తెలుగులో రవిశంకర్, మంజునాథ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు సముద్ర ముఖ్య అతిథిగా విచ్చేశారు.
‘అంతా ఆ దేవుడి అనుగ్రహంతో జరుగుతుంది అంటే.. మరి ఆ రాక్షసులు’ అనే డైలాగ్‌తో ట్రైలర్‌ను ఓపెన్ చేశారు. ఇక వెంటవెంటనే చూపించిన యాక్షన్ సీక్వెన్స్, రౌడీ గ్యాంగ్, మాఫియా సీన్లు అన్నీ అదిరిపోయాయి. ‘నేను బరిలోకి కొత్తగా వచ్చాను.. ఆటకు కాదు’ అనే హీరో డైలాగ్ మాసీగా ఉంది. మధ్యలో హీరో, హీరోయిన్ ట్రాక్.. రొమాంటిక్ సీన్లు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. ‘నాకు పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అంతా మా నాన్నే’ అనే డైలాగ్‌తో ఇందులో ఫాదర్ సెంటిమెంట్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఎలా ఉండబోతోన్నాయో చెప్పేశారు. ఇక చివర్లో షర్ట్ లెస్ సీన్, సిక్స్ ప్యాక్ చూపించిన తీరు మాస్ ఆడియెన్స్‌కి నచ్చేలా ఉన్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా అన్ని రకాల అంశాలను జోడించి ఈ మూవీని తీసినట్టుగా ట్రైలర్ చెబుతోంది. ట్రైలర్ రిలీజ్ చేసిన అనంతరం ఈ కార్యక్రమంలో..
హీరో హేమంత్ కుమార్ మాట్లాడుతూ .. ‘నాకు తెలుగు సినిమాలంటే చాలా ఇష్టం. తెలుగు సినిమాలు ఎక్కువగా చూడటం వల్లే నాకు అంతో ఇంతో తెలుగు వచ్చింది. మా కోసం వచ్చిన సముద్ర గారికి థాంక్స్. రవిశంకర్ సార్ కన్నడలో మా కంటెంట్ చూసి నచ్చి ఈ చిత్రాన్ని తీసుకున్నారు. సినిమాలోని కంటెంట్ మీదున్న నమ్మకంతోనే ఈ మూవీని తెలుగులో భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు. నాలాంటి కొత్త వాళ్ల చిత్రాల్ని ఇలా ఎంకరేజ్ చేయడం ఆనందంగా ఉంది. ప్రేక్షకులు పెట్టే డబ్బులకు సరిపోయే ఎంటర్టైన్మెంట్‌ను మేం అందిస్తాం. మా చిత్రంలోని కంటెంట్ బాగుంటుంది. ఎంతో నిజాయితీగా సినిమాని తీశాం. కన్నడలో మాకు మంచి స్పందన వస్తోంది. ఇక్కడ కూడా మాకు మంచి ఆదరణ దక్కుతుందని భావిస్తున్నాను’ అని అన్నారు.
ప్రముఖ దర్శకుడు సముద్ర మాట్లాడుతూ .. ‘‘ఆల్ఫా’ ట్రైలర్ అద్భుతంగా ఉంది. హీరో చాలా హ్యాండ్సమ్‌లా ఉన్నారు. కన్నడ నుంచి వస్తున్న హీరోలంతా ఇక్కడ సక్సెస్ కొడుతున్నారు. యశ్, రిషబ్ శెట్టిలా హేమంత్ కూడా పెద్ద విజయాన్ని అందుకోవాలి. హీరో హీరోయిన్లు చక్కగా నటించారు. ‘కేజీయఫ్’, ‘కాంతార’ స్థాయిలో ‘ఆల్ఫా’ని ఆడియెన్స్ ఆదరించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
అయానా మాట్లాడుతూ .. ‘‘ఆల్ఫా’ చిత్రంలో నేను పోలీస్ ఆఫీసర్‌గా నటించాను. అది నాకు ఛాలెంజింగ్‌గా అనిపించింది. మా సినిమా అద్భుతంగా ఉంటుంది. ట్రైలర్ అందరికీ నచ్చి ఉంటుందని భావిస్తున్నాం. మూవీని చూసిన ప్రతీ ఒక్కరికీ కచ్చితంగా నచ్చుతుంది’ అని అన్నారు.
గోపికా సురేష్ మాట్లాడుతూ .. ‘‘ఆల్ఫా’ ఈవెంట్‌కు వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మా ట్రైలర్ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. ఆకాంక్ష అనే పాత్రలో నేను నటించాను. మహిళలందరికీ ఆ పాత్ర ఎంతో నచ్చుతుంది. బ్యూటీ విత్ బ్రెయిన్ అన్నట్టుగా నా కారెక్టర్ ఉంటుంది. ఫిబ్రవరి 20న మా సినిమా రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.
డిస్ట్రిబ్యూటర్ రవిశంకర్ మాట్లాడుతూ .. ‘‘ఆల్పా’ కన్నడ ట్రైలర్ చూసి ఈ మూవీని నేను తీసుకున్నాను. హీరో పర్ఫామెన్స్ చూసి షాక్ అయ్యాను. టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్నీ చూశాను. అద్భుతంగా అనిపించాయి. హీరోగా హేమంత్ పేరు ఇకపై ఎక్కువగా వినిపిస్తుంది. ఇలా కష్టపడే హీరోలు చాలా అరుదుగా వస్తుంటారు. ఫిబ్రవరి 20న మా సినిమా రాబోతోంది. ఇకపై భారీ ఈవెంట్‌లతో పెద్ద స్థాయిలో ప్రమోషన్స్ చేస్తామ’ని అన్నారు.
రాయల్ రిడ్జ్ స్పాన్సర్ శ్రీనివాస్ మాట్లాడుతూ .. ‘‘ఆల్ఫా’ ట్రైలర్ బాగుంది. హీరో ఎంతో అనుభవం ఉన్న వాడిలా నటించారు. ఈ చిత్రం పెద్ద హిట్ అయి అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
నటీనటులు : హేమంత్ కుమార్, అయానా, గోపికా సురేష్, అచ్యుత్ కుమార్, బాలు నాగేంద్ర, కార్తీక్ మహేష్, రమేష్ ఇందిర, గిరిరాజ్, రఘు శివమొగ్గ, వినయ్ బిడప్ప తదితరులు
సాంకేతిక బృందం
బ్యానర్ : ఎల్ఎ ప్రొడక్షన్స్
నిర్మాత: ఆనంద్ కుమార్
దర్శకత్వం : విజయ్ ఎన్
సంగీతం : జె అనూప్ సీలిన్
DOP : కార్తీక్ S
ఎడిటర్ : దీపు ఎస్ కుమార్
ఆర్ట్ : అమర్
డైలాగ్స్ : మస్తీ
సాహిత్యం : నాగార్జున శర్మ
యాక్షన్ : ఎ విజయ్, వినోద్, అర్జున్ రాజ్, యోగానంద్
పీఆర్వో :మాడూరి మధు, ఏలూరు శీను
నేటి సినిమాల్లో హారర్ జోనర్ అంటే కేవలం దెయ్యం పగ తీర్చుకోవడం అనే మూస ధోరణి కనిపిస్తుంది. కానీ, దానికి…
ప్రముఖ నిర్మాత శ్రీ ఎమ్.ఎస్.రాజు తన సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్ పై ప్రతిష్టాత్మకంగా నిర్మించిన " మనసంతా నువ్వే "…
ఆర్ కె ఫిలిమ్స్, సిగ్ధ క్రియేషన్స్ బ్యానర్‌లో డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ దర్శక నిర్మాతగా బిఎస్ రెడ్డి సమర్పణలో ఢీ,…
శివ కంఠంనేని, ధన్య బాలకృష్ణ, ఎస్తేర్, సుప్రిత, హరీష్ ప్రధాన తారాగణంగా తెరకెక్కిన సినిమా "అమరావతికి ఆహ్వానం". ఈ మూవీలో…
నేస్తం ఫౌండేషన్ మరియు తెలుగు సినిమా వేదిక సంస్థలు తెలుగు సినిమా పుట్టినరోజు వేడుకలను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో…
శ్రీమతి. చింతా వరలక్ష్మీ సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద చింతా వినీష రెడ్డి, చింతా గోపాల కృష్ణా…