నేటి సినిమాల్లో హారర్ జోనర్ అంటే కేవలం దెయ్యం పగ తీర్చుకోవడం అనే మూస ధోరణి కనిపిస్తుంది. కానీ, దానికి “మదర్ సెంటిమెంట్” అనే అరుదైన ఎమోషన్‌ను జోడించి, ఒక యదార్థ సంఘటన ఆధారంగా దర్శకుడు క్రియేటివ్ స్టార్ సుమన్ బాబు తెరకెక్కించిన చిత్రం ‘ఎర్రచీర-ది బిగినింగ్’. బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్, శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై ఎన్‌వీవీ సుబ్బారెడ్డి, సుమన్ బాబు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 6న గ్రాండ్‌గా రిలీజ్ అయింది. మదర్ సెంటిమెంట్, హారర్, యాక్షన్ అంశాలతో రూపొందిన ఈ సినిమాలో ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ ముద్దుల మనవరాలు బేబీ సాయి తేజస్విని కీలక పాత్రలో నటించగా, దర్శకుడు సుమన్ బాబు స్వీయ దర్శకత్వం వహిస్తూ ఒక ముఖ్య పాత్రను కూడా పోషించారు. యాక్టింగ్ క్వీన్ కారుణ్య చౌదరి రెండు డిఫరెంట్ వేరియషన్స్ ఉన్న పాత్రల్లో అద్భుతంగా నటించి మెప్పించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమాకు వస్తున్న అద్భుతమైన ఆదరణకు టీమ్ ఫిదా అవుతోంది. భర్త ప్రేమ కంటే మాతృప్రేమ గొప్పదంటూ చెప్పే అద్భుతమైన మెసేజ్‌తో వచ్చిన తమ చిత్రాన్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పేందుకు మూవీ టీమ్ ఆదివారం థ్యాంక్స్ మీట్ నిర్వహించింది. సినిమాలోని ముద్దు పాటకు థియేటర్లలో వస్తున్న రెస్పాన్స్‌పై టీమ్ హర్షం వ్యక్తం చేసింది. ఆ సందడిని గుర్తు చేసుకుంటూ ముందుగా హీరో సుమన్ బాబు, హీరోయిన్ కారుణ్య చౌదరి ఇద్దరూ ఎంతో సరదాగా ముద్దు పాటకు డ్యాన్స్ చేసి అలరించారు.
అనంతరం ఈ కార్యక్రమంలో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, జయలక్ష్మి ఫిలిమ్స్ అధినేత ద్రోణాదుల వెంకట్రావ్ మాట్లాడుతూ.. ‘‘ఫిబ్రవరి 6న విడులయ్యే అన్ని సినిమాల్లో ఎర్ర చీర ఒకటే థియేటర్లలో బలంగా నిలబడుతుందని ప్రీరిలీజ్ ఈవెంట్‌లో చెప్పాను. ఇప్పుడు అదే జరుగుతోంది. దీనంతటికి కారణం ఒకే ఒక్కడు సుమన్ బాబు. ఆయన ఎంతో కష్టపడి కుటుంబమంతా చూడగలిగే అద్భుతమైన చిత్రాన్ని తీశారు. మంచి ఎమోషన్స్, సెంటిమెంట్ ఉన్న ఈ చిత్రానికి బి,సి సెంటర్స్‌లో ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. అన్ని చోట్లా సినిమాకు మంచి ఆదరణ వస్తోంది. సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు’’ అని చెప్పారు.
యాక్టింగ్ క్వీన్ కారుణ్య చౌదరి మాట్లాడుతూ.. “మా సినిమాను మంచి సక్సెస్ చేసిన ప్రేక్షకులందరికీ చాలా పెద్ద థాంక్స్. మరీ ముఖ్యంగా మహిళలు ఎర్రచీర సినిమాను ఎక్కువగా ఆదరిస్తున్నారు. క్లైమాక్స్ సీన్‌కి ప్రతి ఒక్కరూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. సుమన్ బాబు గారు వన్ మాన్ షో లాగా అన్నీ తానే అయి ఇంత మంచి సినిమా తీశారు. నేను ఇందులో రెండు క్యారెక్టర్స్ చేశాను. అందులో పార్వతి పాత్రను బాగా ఎంజాయ్ చేశా. భర్త ప్రేమ కంటే కుమార్తెపై తల్లి ప్రేమ గొప్పదని చెప్పే ఈ చిత్రాన్ని ఇంకా చూడని వాళ్లు ఎవరైనా ఉంటే వెంటనే థియేటర్లకు వెళ్లి చూడండి.” అన్నారు.
దర్శకుడు, నటుడు, నిర్మాత సుమన్ బాబు మాట్లాడుతూ.. “నా సినిమా ప్రమోషన్స్‌కి వచ్చి నన్ను ఎంతగానో సపోర్ట్ చేసిన సినీ ప్రముఖులందరికి పేరు పేరున థాంక్స్. సినిమా ఇంత బాగా రావడానికి కారణం అయిన నా సినిమా టీమ్ అందరికీ కృతజ్ఞతలు. సినిమాను అన్ని థియేటర్స్‌లో ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నేను ఓ థియేటర్‌కి వెళ్లి చూస్తే ఆడియన్స్ డాన్స్‌లు చేస్తున్నారు. 250కిపైగా థియేటర్స్‌లో మా ఎర్రచీర సినిమా విజయవంతంగా ఆడుతోంది. ప్రతి ఒక్కరూ థియేటర్‌లోనే సినిమా చూసి ఆ ఫీల్‌ను ఎంజాయ్ చేయండి. మరో మూడు నెలల్లో ఇంకో సినిమాతో మీ ముందుకు రాబోతున్నా. డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ థాంక్స్ చెబుతున్నా. ఎర్ర చీర కన్నడ వెర్షన్ మార్చి 19న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నా. ఇక నుంచి గ్యాప్ తీసుకోను. ప్రతి 6 నెలలకు ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తా. కంటెంట్ ఉన్న సినిమా తీస్తే తప్పకుండా ఆదరిస్తారని నిరూపించి ఎర్రచీరను ఘన విజయం చేసిన ప్రేక్షక దేవుళ్లందరికీ కృతజ్జతలు. సినిమా క్లైమాక్స్ పరమశివుడిపై ఉంది కాబట్టి.. సెకెండ్ వీక్‌లో శివరాత్రి సందర్భంగా మరిన్ని థియేటర్లు పెంచుతాం. వంద థియేటర్లకు పైగా పెంచి శివరాత్రి సెలబ్రేషన్స్‌ను ఎర్రచీర సినిమా చూస్తూ ప్రేక్షకులు జరుపుకునేలా చేస్తాం. అందరూ తప్పకుండా థియేటర్లలో ఎర్రచీర సినిమా చూసి బిగ్ స్క్రీన్‌పై ఆ పరమశివుడి దర్శనం చేసుకుని ఆ దేవదేవుడి కృపకు పాత్రులు కావాలని కోరుతున్నా” అన్నారు.
ప్రెస్‌మీట్ అనంతరం హీరోయిన్ కారుణ్య చౌదరి పుట్టినరోజు సందర్భంగా మూవీ టీమ్ ఘనంగా ఆమె బర్త్ డేను సెలబ్రేట్ చేసింది. కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకను నిర్వహించారు. కారుణ్య చౌదరికి సుమన్ బాబు కేక్ తినిపించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. తన నెక్ట్స్ మూవీలో కూడా ఓ ఇంపార్టెంట్ క్యారెక్టర్‌కు కారుణ్యను అనుకుంటున్నట్లు చెప్పారు. స్క్రిప్ట్ ఫైనల్ అయ్యాక వివరాలను ప్రకటిస్తానని చెప్పారు. ప్రతి ఆర్టిస్ట్‌ను ఎంతో కేరింగ్‌గా చూసుకునే సుమన్ బాబు లాంటి డైరెక్టర్‌తో కలిసి పని చేయడం తన అదృష్టమని కారుణ్య ఈ సందర్భంగా వెల్లడించారు.
v‘మా రాముడు అందరివాడు’ దమ్మున్న సినిమా : హీరో శ్రీరామ్ ‘మా రాముడు అందరివాడు’ చిత్రంలోని ఫాదర్ అండ్ సన్…
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…