జీ స్టూడియోస్ అధినేత ఉమేష్ బన్సాల్ తో కలిసిప్రఖ్యాత నిర్మాత ప్రేరణ అరోరా (Ess Kay Gee Entertainment) నిర్మాతగా టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా ఒక భారీ పాన్-ఇండియా చిత్రంను నిర్మించనున్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించిన కథతో, అద్భుతమైన విజువల్స్‌తో ఈ సినిమాను మిథాలజీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కించనున్నారు.
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు కీర్తన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతుండగా, గ్రాండ్ విజువల్స్, వరల్డ్ బిల్డింగ్, హై టెక్నికల్ వాల్యూస్‌తో సినిమాను నిర్మించేలా పనులు ప్రారంభమయ్యాయి. ఈ సినిమా షూటింగ్‌ను సెప్టెంబర్‌లో ప్రారంభించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఇదే సమయంలో హీరోయిన్ ఎంపికపై బాలీవుడ్, టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటీమణుల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. సినిమా టైటిల్, దర్శకుడు, ఇతర నటీనటులు మరియు సాంకేతిక బృంద వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. భక్తి, భావోద్వేగాలు, డ్రామా, హై-వోల్టేజ్ యాక్షన్‌ను సమన్వయం చేస్తూ రూపొందుతున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మేకర్స్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…