శ్రీసింహా కోడూరి ‘ఉస్తాద్’ సినిమాలో ‘చుక్కల్లోంచి…’ లిరికల్ సాంగ్ రిలీజ్…ఆగస్ట్ 12న మూవీ గ్రాండ్ రిలీజ్

‘మత్తువదలరా’ వంటి వైవిధ్య‌మైన క‌థాంశాలున్న సినిమాలు చేస్తూ త‌న‌దైన గుర్తింపు సంపాదించుకుంటున్న యంగ్ హీరో శ్రీసింహా కోడూరి క‌థానాయకుడిగా న‌టించిన లేటెస్ట్ మూవీ ‘ఉస్తాద్’. ఆగస్ట్ 12న గ్రాండ్ రిలీజ్ అవుతుంది. వారాహి చ‌ల‌న‌చిత్రం, క్రిషి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్‌పై ‘ఉస్తాద్‌’ చిత్రాన్ని ఫ‌ణిదీప్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌జినీ కొర్ర‌పాటి, రాకేష్ రెడ్డి గ‌డ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు నిర్మిస్తున్నారు. ఈ మూవీ అనౌన్స్‌మెంట్ నుంచి అంద‌రి అటెన్ష‌న్‌ను సంపాదించుకుంది. రీసెంట్‌గా విడుద‌లైన మూవీ టీజ‌ర్‌, ‘రోజు…’, ‘ఆకాశం అదిరే..’ అనే పాటలు విడుదలై మంచి రెస్పాన్స్‌ను రాబ‌ట్టుకున్నాయి.  

తాజాగా ఈ సినిమా నుంచి ‘చుక్క‌ల్లోంచి..’ అనే లిరిక‌ల్ సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. హీరోయిన్ బ‌స్సులో స్నేహితుల‌తో క‌లిసి ప్ర‌యాణిస్తుంటుంది. ఆ బ్స‌సు అనుకోకుండా ఆగిపోతుంది. దాంతో హీరోయిన్ .. హీరో ఉన్న టెంపో వ్యాన్‌లో ఎక్కుతుంది. అప్పుడు హీరోయిన్‌పై ఉన్న ప్రేమ‌ను ఊహించుకుంటూ పాడే పాటే ‘చుక్కల్లోంచి..’. సాంగ్ చాలా కూల్‌గా, విన‌సొంపుగా ఉంది. అకీవా.బి సంగీత సార‌థ్యంలో రెహ‌మాన్ రాసిన పాట‌ను కార్తీక్ చ‌క్క‌గా అల‌పించారు. 

సినిమా విష‌యానికి వ‌స్తే..  శ్రీసింహ మూడు డిఫ‌రెంట్ షేడ్స్‌లో కనిపించ‌బోతున్నారు. బలగం ఫేమ్ కావ్యా కళ్యాణ్ రామ్ హీరోయిన్. డిఫ‌రెంట్ మూవీస్‌, ప‌రిమిత బ‌డ్జెట్‌ల‌తో రూపొందుతోన్న సినిమాల‌కు అద్భుత‌మైన స్పంద‌న వ‌స్తున్న నేప‌థ్యంలో ఉస్తాద్ నిర్మాత‌లు అదే న‌మ్మ‌కంతో సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు వ‌స్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో గౌత‌మ్ వాసుదేవ్ మీన‌న్‌, అను హాస‌న్‌, రవీంద్ర విజ‌య్‌, వెంక‌టేష్ మ‌హ‌, ర‌వి శివ తేజ‌, సాయికిర‌ణ్ ఏడిద కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. అకీవా. బి సంగీతాన్ని అందిస్తున్నారు. 

న‌టీన‌టులు:

శ్రీసింహా కోడూరి, కావ్యా క‌ళ్యాణ్ రామ్‌, గౌత‌మ్ వాసుదేవ్ మీన‌న్‌, అను హాస‌న్‌, ర‌వీంద్ర విజ‌య్‌, వెంక‌టేష్ మ‌హ. ర‌వి శివ తేజ‌, సాయి కిర‌ణ ఏడిద‌ తదిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

సాయి కొర్ర‌పాటి ప్రొడ‌క్ష‌న్‌

బ్యాన‌ర్స్‌:  వారాహి చ‌ల‌న‌చిత్రం, క్రిషి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్

నిర్మాత‌లు:  ర‌జినీ కొర్ర‌పాటి, రాకేష్ రెడ్డి గ‌డ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు

ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం:  ఫ‌ణిదీప్‌

సినిమాటోగ్ర‌ఫీ:  ప‌వ‌న్ కుమార్ పప్పుల

మ్యూజిక్‌:  అకీవా.బి

ఎడిట‌ర్‌:  కార్తీక్ క‌ట్స్‌

ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: అర‌వింద్ ములె

సౌండ్ డిజైన్‌: అశ్విన్ రాజ‌శేఖ‌ర్‌

కాస్ట్యూమ్స్‌:  ప్రియాంక వీర‌బోయిన

Tfja Team

Recent Posts

నిర్మాత రమేష్ వర్మ ‘కొక్కొరొకో’ గ్లింప్స్ విడుదల.. విజువల్స్‌తో ఆక‌ట్టుకుంటోన్న శీను – పార్వతీల అందమైన ప్రేమకథ.. త్వ‌ర‌లోనే గ్రాండ్ రిలీజ్‌..!

యంగ్ టాలెంట్‌ను గుర్తించి ప్రోత్సహించడంలో ముందుండే ప్రముఖ దర్శకుడు రమేష్ వర్మ.. కొత్త దర్శకులకు అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఆర్‌.వి…

6 hours ago

‘ఇంకా ఏం అనుకోలేదు!’ చిత్రం అందరికీ రిలేట్ అయ్యేలా ఉంటుంది – సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వంశీ నందిపాటి..!

వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్స్, ఈటీవీ విన్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘ఇంకా ఏం అనుకోలేదు!’. వంశీ నందిపాటి నిర్మాతగా కన్ను…

6 hours ago

‘పొలిమేర 3’ నుంచి యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ‘విరావి’ ఫస్ట్ లుక్ విడుదలతెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలకు సిద్ధమవుతున్న ‘పొలిమేర 3..!

మిస్టిక్ థ్రిల్లర్ ఫ్రాంచైజీలో ప్రేక్షకులను ఆకట్టుకున్న 'పొలిమేర' సిరీస్ నుంచి మూడో చిత్రంగా వస్తున్న 'పొలిమేర 3'పై అంచనాలు పెరుగుతున్నాయి.…

1 day ago

మళ్లీ విద్యార్థినిగా మారిన మంచు లక్ష్మి! హార్వర్డ్ మెడికల్ స్కూల్‌లో ఏం నేర్చుకుంటున్నారు?

మంచు లక్ష్మిని అర్థం చేసుకున్నామనుకునేలోపే, ఆమె మరో కొత్త ఆశ్చర్యానికి తెరతీస్తారు! ఇటీవల ఆమె సోషల్ మీడియాలో కొన్ని ఆసక్తికరమైన…

1 day ago

‘ఆలోచన’ సినిమా ఈనెల 27న విడుదల..!

పి.ఎస్.జె. ఫిలిమ్స్ అండ్ కో బ్యానర్ మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో సురేందర్ చాచా తెరకెక్కించిన చిత్రం…

1 day ago

సుమ చిత్ర ఆర్ట్స్ సమర్పణలో సుమయా రెడ్డి నుంచి రాబోతోన్న ప్రొడక్షన్ నెం. 2.. త్వరలోనే టైటిల్ అనౌన్స్మెంట్..!

సుమ చిత్ర ఆర్ట్స్ సమర్పణలో సుమయా రెడ్డి స్వీయ నిర్మాణంలో నటిస్తున్న రెండో ప్రాజెక్ట్‌ని త్వరలోనే ప్రకటించనున్నారు. ‘డియర్ ఉమ’…

1 day ago