‘ఆలోచన’ సినిమా ఈనెల 27న విడుదల..!

పి.ఎస్.జె. ఫిలిమ్స్ అండ్ కో బ్యానర్ మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో సురేందర్ చాచా తెరకెక్కించిన చిత్రం ‘ఆలోచన’. ఈ మూవీలో G.V.నారాయణ రావు, ప్రసాద్ బాబు, నరసింహరాజు, మహర్షి రాఘవ, జయలలిత, రజన్ హరి, బెన్నీ సుధాకర్ వంటి వారు కీలక పాత్రలో, సుజనా,అనుపమ స్వాతి, మాధవి, అద్వైక జెస్సీ, హసిత, జెన్నీ,ప్రసాద్ రామ్, నరేంద్ర, ముఖ్య పాత్రల్లో నటించారు. దీపావళి సందర్భంగా ‘ఆలోచన’ మూవీ రిలీజ్ డేట్ పోస్టర్‌ను వినూత్నంగా వృద్దాశ్రమంలో వందలాదిమంది సీనియర్ సిటిజన్స్ సమక్షంలో లాంచ్ చేశారు. నవంబర్ 27న ‘ఆలోచన’ మూవీని గ్రాండ్‌గా రిలీజ్ ప్రపంచవ్యాప్తంగా చేయబోతోన్నట్టుగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకులు సురేందర్ చాచా, నిర్మాతలు ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్, సీనియర్ నటి జయలలిత, సుజనా,
అనుపమ స్వాతి, హసిత, సురేష్ కొండేటి పాల్గొన్నారు.

అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో..
ముందుగా సీనియర్ నటి జయలలిత మాట్లాడుతూ .. ‘‘ఆలోచన’ చిత్రంలో సంగీతం టీచర్‌గా శ్యామల అనే పాత్రను పోషించాను. నా భర్తగా అంధుడి పాత్రలో మహర్షి రాఘవ గారు. అంధుడైన ఆయన వయోలిన్ మాస్టర్‌గా ఈ చిత్రంలో కనిపిస్తారు. ‘భజ గోవిందం’ పాట అద్భుతంగా ఉంటుంది. దర్శక, నిర్మాతలు కష్టపడి ఈ సినిమాని చేశారు. ఈ మూవీ నాకు ఎంత సంతృప్తినిచ్చింది. మా ఈ ‘ఆలోచన’ మూవీని అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

నిర్మాత ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ .. ‘దర్శకుడు చాచాతో నాకు ఎన్నో ఏళ్ల నుంచి పరిచయం ఉంది. ఎప్పుడూ ఏదో ఒక కథ గురించి చర్చిస్తూ ఉండేవాళ్లం. అలాంటి టైంలోనే ‘ఆలోచన’ కథను చెప్పాడు. ఆ టైంకి మాకు శ్రీనివాస్ గారు కూడా అండగా నిలిచి చేద్దాము అని అన్నారు. అప్పుడే మొదలయింది.

నిర్మాత గుండబోయిన శ్రీనివాస్ మాట్లాడుతూ .. ‘‘చాచా నాకు చాలా ఏళ్ల నుంచి తెలుసు. ఓ ఆర్ట్ ఫిల్మ్‌గా చేయాలని ‘ఆలోచన’ గురించి చెప్పారు. ఓల్డ్ ఏజ్ పీపుల్స్ చుట్టూ జరిగే ఈ కథ ఎంతో హార్ట్ టచింగ్‌గా ఉంటుంది. ‘ఆలోచన’లోని కాన్సెప్ట్, పాయింట్ నాకెంతో నచ్చింది. సీనియర్ ఆర్టిస్టుల నటన గొప్పగా ఉంటుంది. అందరిలోనూ ఆలోచన రేకెత్తించేలా మా సినిమా ఉంటుంది’ అని అన్నారు.

దర్శకుడు సురేందర్ చాచా మాట్లాడుతూ .. ‘‘ఆలోచన’ చిత్రంలో సీనియర్ ఆర్టిస్టులంతా గొప్పగా నటించారు. అందరూ తమ తమ పాత్రల్లో జీవించారు. అందరూ పోటీ పడి మరీ నటించారు. ఈ కథను ముందుగా నారాయణ రావు గారికే వినిపించాను. ఆ టైంలో ఆయన కనీసం లేవలేని స్థితిలో ఉన్నారు. స్క్రిప్ట్ ఇక్కడే పెట్టు.. రెండ్రోజుల తర్వాత ఫోన్ చేస్తా అని ఆయన అన్నారు. కథ అద్భుతంగా ఉందని పొగిడారు. ఆయనే ఒక్కో ఆర్టిస్టుకి ఫోన్ చేసి మరీ చెప్పారు. ఈ విషయం లో ప్రదీప్, శ్రీనివాస్ నాకు ఎంతో సహకరించారు. నవంబర్ 27న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

నటీనటులు : G.V నారాయణ రావు, ప్రసాద్ బాబు, నరసింహరాజు, మహర్షి రాఘవ, జయలలిత, రజన్ హరి, బెన్నీ సుధాకర్ తదితరులు

టెక్నికల్ టీం
బ్యానర్ : పి.ఎస్.జె. ఫిలిమ్స్ అండ్ కో
నిర్మాత : ప్రదీప్ కుమార్, శ్రీనివాస్ గుండబోయిన
దర్శకుడు : సురేందర్ చాచా
కెమెరామెన్ : టి. సురేంద్ర రెడ్డి
సంగీత దర్శకుడు : వియాన్
ఎడిటర్ : ఆర్.ఎల్. వర్మ
ఆర్ట్ డైరెక్టర్ : గిరీష్ దేవాంగ్
రిలీజ్ : ఎస్. కె. పిక్చర్స్.
పి ఆర్ ఓ : శ్రీధర్ శ్రీ, ప్రసాద్ – ధీరజ్.

TFJA

Recent Posts

‘పొలిమేర 3’ నుంచి యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ‘విరావి’ ఫస్ట్ లుక్ విడుదలతెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలకు సిద్ధమవుతున్న ‘పొలిమేర 3..!

మిస్టిక్ థ్రిల్లర్ ఫ్రాంచైజీలో ప్రేక్షకులను ఆకట్టుకున్న 'పొలిమేర' సిరీస్ నుంచి మూడో చిత్రంగా వస్తున్న 'పొలిమేర 3'పై అంచనాలు పెరుగుతున్నాయి.…

2 hours ago

మళ్లీ విద్యార్థినిగా మారిన మంచు లక్ష్మి! హార్వర్డ్ మెడికల్ స్కూల్‌లో ఏం నేర్చుకుంటున్నారు?

మంచు లక్ష్మిని అర్థం చేసుకున్నామనుకునేలోపే, ఆమె మరో కొత్త ఆశ్చర్యానికి తెరతీస్తారు! ఇటీవల ఆమె సోషల్ మీడియాలో కొన్ని ఆసక్తికరమైన…

2 hours ago

సుమ చిత్ర ఆర్ట్స్ సమర్పణలో సుమయా రెడ్డి నుంచి రాబోతోన్న ప్రొడక్షన్ నెం. 2.. త్వరలోనే టైటిల్ అనౌన్స్మెంట్..!

సుమ చిత్ర ఆర్ట్స్ సమర్పణలో సుమయా రెడ్డి స్వీయ నిర్మాణంలో నటిస్తున్న రెండో ప్రాజెక్ట్‌ని త్వరలోనే ప్రకటించనున్నారు. ‘డియర్ ఉమ’…

2 hours ago

ఆది సాయి కుమార్ ‘ఈగో రాజా’ నుంచి ‘రౌడీ రాకాసి’ అంటూ సాగే లవ్ సాంగ్ రిలీజ్

‘శంబాల’ బ్లాక్ బస్టర్ తర్వాత ఆది సాయికుమార్ డిఫరెంట్ సబ్జెక్ట్‌లతో ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే ‘ఈగో రాజా’…

2 hours ago

దీపావళి సందర్భంగా కార్తీక్ జయంతి ‘రాయవలస’ నుంచి పవర్ ఫుల్ పోస్టర్..!

రేసన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపి కృష్ణ జయంతి నిర్మించిన ‘రాయవలస’ చిత్రానికి రాధిక జయంతి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో…

8 hours ago

“కిల్లర్” మూవీ కోటి రూపాయల కాంటెస్ట్ లో ఎవరూ విన్ కాలేదు, దగ్గరగా ఆన్సర్ చెప్పిన 10 మందికి లక్ష రూపాయల చొప్పున బహుమతి ఇస్తున్నాం – యాక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ పూర్వాజ్..!

ఇటీవలే థియేట్రికల్ రిలీజ్ కు వచ్చి ప్రేక్షకులు థ్రిల్లింగ్ సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇచ్చింది "కిల్లర్" మూవీ. ఈ సినిమాకు చేసిన…

2 days ago