సుమ చిత్ర ఆర్ట్స్ సమర్పణలో సుమయా రెడ్డి స్వీయ నిర్మాణంలో నటిస్తున్న రెండో ప్రాజెక్ట్‌ని త్వరలోనే ప్రకటించనున్నారు. ‘డియర్ ఉమ’ అంటూ మొదటి సినిమాతోనే నటిగా, నిర్మాతగా, రచయితగా సుమయా రెడ్డి తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. ఇక ఈ రెండో ప్రాజెక్ట్‌కి సంబంధించిన ప్రకటన కూడా త్వరలోనే వెలువడనుంది. ఈ సారి కూడా తన సొంత బ్యానర్లోనే హీరోయిన్గా సుమయా రెడ్డి నటిస్తున్నారు. దీపావళి సందర్భంగా ఈ ప్రొడక్షన్ నెం.2 టైటిల్ అనౌన్స్మెంట్ త్వరలోనే ఉండబోతోందని ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
ఈ పోస్టర్లో సుమయా రెడ్డి చేతి నిండా డబ్బు, బంగారంతో కనిపిస్తున్నారు. ఈ పోస్టర్లో సుమయా రెడ్డిని చూస్తుంటే మహారాణిలా అనిపిస్తున్నారు. కామెడీ, హారర్ జానర్లో ఇది వరకు ఎవ్వరూ టచ్ చేయని పాయింట్‌తో రాబోతోంది అని ప్రీ లుక్ పోస్టర్‌తో హింట్ ఇచ్చారు. ఈ ఒక్క పోస్టర్‌తోనే సినిమాపై అంచనాలు పెంచేశారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన టైటిల్‌తో పాటుగా ఇతర వివరాల్ని కూడా ప్రకటించనున్నారు.
మిస్టిక్ థ్రిల్లర్ ఫ్రాంచైజీలో ప్రేక్షకులను ఆకట్టుకున్న 'పొలిమేర' సిరీస్ నుంచి మూడో చిత్రంగా వస్తున్న 'పొలిమేర 3'పై అంచనాలు పెరుగుతున్నాయి.…
మంచు లక్ష్మిని అర్థం చేసుకున్నామనుకునేలోపే, ఆమె మరో కొత్త ఆశ్చర్యానికి తెరతీస్తారు! ఇటీవల ఆమె సోషల్ మీడియాలో కొన్ని ఆసక్తికరమైన…
పి.ఎస్.జె. ఫిలిమ్స్ అండ్ కో బ్యానర్ మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో సురేందర్ చాచా తెరకెక్కించిన చిత్రం…
‘శంబాల’ బ్లాక్ బస్టర్ తర్వాత ఆది సాయికుమార్ డిఫరెంట్ సబ్జెక్ట్లతో ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే ‘ఈగో రాజా’…
రేసన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపి కృష్ణ జయంతి నిర్మించిన ‘రాయవలస’ చిత్రానికి రాధిక జయంతి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో…
ఇటీవలే థియేట్రికల్ రిలీజ్ కు వచ్చి ప్రేక్షకులు థ్రిల్లింగ్ సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇచ్చింది "కిల్లర్" మూవీ. ఈ సినిమాకు చేసిన…