ఆది సాయి కుమార్ ‘ఈగో రాజా’ నుంచి ‘రౌడీ రాకాసి’ అంటూ సాగే లవ్ సాంగ్ రిలీజ్

‘శంబాల’ బ్లాక్ బస్టర్ తర్వాత ఆది సాయికుమార్ డిఫరెంట్ సబ్జెక్ట్‌లతో ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే ‘ఈగో రాజా’ అంటూ ఆడియెన్స్‌ని పలకరించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎస్‌జిఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై జి. సురేష్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు గురు శరవణన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రంతో ఆది కోలీవుడ్‌లోకి అరంగేట్రం చేస్తున్నారు.

ఆది సాయికుమార్, సతీష్, శరణ్య రామచంద్రన్, ఆద్య ప్రసాద్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. విభిన్నమైన కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాలో నటీనటుల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

ఇక ఇప్పటి వరకు వదిలిన పోస్టర్‌లు, పాటలు అన్నీ కూడా ఆడియెన్స్‌లో మంచి బజ్‌ను క్రియేట్ చేస్తున్నాయి.

రా అండ్ రస్టిక్ లుక్‌లో ఆది అందరినీ ఆకట్టుకోబోతోన్నారు. తాజాగా ‘ఈగో రాజా’ నుంచి ‘రౌడీ రాకాసి’ అంటూ సాగే ఓ క్యూట్ లవ్ సాంగ్‌ను విడుదల చేశారు. ఇక ఇందులో ఆది స్టెప్పులు, హీరో హీరోయిన్ ట్రాక్, పాటను చిత్రీకరించిన తీరు ఎంతో అందంగా ఉంది. లుంగీలో ఆది వేసిన హుక్ స్టెప్పులు ఇన్స్టంట్‌గా వైరల్ అయ్యేలా కనిపిస్తోంది. ఈ పాటకు సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం, గిబ్రాన్ వైబోధ అందించిన బాణీ, శిభి శ్రీనివాసన్ గాత్రం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి.

ఈ సినిమాకి మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ, గిబ్రాన్ సంగీతం స్పెషల్ అట్రాక్షన్ కానుంది. దురైరాజ్ ఆర్ట్ డైరెక్షన్ అందిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.

నటీనటులు : ఆది సాయికుమార్, సతీష్, శరణ్య రామచంద్రన్, ఆద్య ప్రసాద్ తదితరులు.

సాంకేతిక బృందం:

బ్యానర్: SGS ప్రొడక్షన్స్
నిర్మాత: జి. సురేష్
రచన, దర్శకత్వం: గురు శరవణన్
సంగీతం: ఘిబ్రాన్ వైభోద
ఛాయాగ్రహణం: మనోజ్ పరమహంస
ఎడిటింగ్: మేఘనాథన్
పీఆర్ఓ: సాయి సతీష్

TFJA

Recent Posts

‘పొలిమేర 3’ నుంచి యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ‘విరావి’ ఫస్ట్ లుక్ విడుదలతెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలకు సిద్ధమవుతున్న ‘పొలిమేర 3..!

మిస్టిక్ థ్రిల్లర్ ఫ్రాంచైజీలో ప్రేక్షకులను ఆకట్టుకున్న 'పొలిమేర' సిరీస్ నుంచి మూడో చిత్రంగా వస్తున్న 'పొలిమేర 3'పై అంచనాలు పెరుగుతున్నాయి.…

2 hours ago

మళ్లీ విద్యార్థినిగా మారిన మంచు లక్ష్మి! హార్వర్డ్ మెడికల్ స్కూల్‌లో ఏం నేర్చుకుంటున్నారు?

మంచు లక్ష్మిని అర్థం చేసుకున్నామనుకునేలోపే, ఆమె మరో కొత్త ఆశ్చర్యానికి తెరతీస్తారు! ఇటీవల ఆమె సోషల్ మీడియాలో కొన్ని ఆసక్తికరమైన…

2 hours ago

‘ఆలోచన’ సినిమా ఈనెల 27న విడుదల..!

పి.ఎస్.జె. ఫిలిమ్స్ అండ్ కో బ్యానర్ మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో సురేందర్ చాచా తెరకెక్కించిన చిత్రం…

2 hours ago

సుమ చిత్ర ఆర్ట్స్ సమర్పణలో సుమయా రెడ్డి నుంచి రాబోతోన్న ప్రొడక్షన్ నెం. 2.. త్వరలోనే టైటిల్ అనౌన్స్మెంట్..!

సుమ చిత్ర ఆర్ట్స్ సమర్పణలో సుమయా రెడ్డి స్వీయ నిర్మాణంలో నటిస్తున్న రెండో ప్రాజెక్ట్‌ని త్వరలోనే ప్రకటించనున్నారు. ‘డియర్ ఉమ’…

2 hours ago

దీపావళి సందర్భంగా కార్తీక్ జయంతి ‘రాయవలస’ నుంచి పవర్ ఫుల్ పోస్టర్..!

రేసన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపి కృష్ణ జయంతి నిర్మించిన ‘రాయవలస’ చిత్రానికి రాధిక జయంతి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో…

8 hours ago

“కిల్లర్” మూవీ కోటి రూపాయల కాంటెస్ట్ లో ఎవరూ విన్ కాలేదు, దగ్గరగా ఆన్సర్ చెప్పిన 10 మందికి లక్ష రూపాయల చొప్పున బహుమతి ఇస్తున్నాం – యాక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ పూర్వాజ్..!

ఇటీవలే థియేట్రికల్ రిలీజ్ కు వచ్చి ప్రేక్షకులు థ్రిల్లింగ్ సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇచ్చింది "కిల్లర్" మూవీ. ఈ సినిమాకు చేసిన…

2 days ago