మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతుల జీవితంలో జూన్ 20 ఎంతో కీలకం. ఎందుకంటే ఆరోజున క్లీంకార పుట్టుకతో వారు తల్లిదండ్రులుగా జీవితంలో కొత్త అంకాన్ని ప్రారంభించారు. దీనిపై మెగాభిమానులు, కుటుంబ సభ్యులు ఎంతో ఆనందంగా ఉన్నారు. కాగా గురువారం (జూలై 20) రోజున వీరు క్లీంకార ఆగమనానికి సంబంధించిన హృదయానికి హత్తుకునే అందమైన వీడియోను విడుదల చేశారు. యాదృచ్చికంగానే జరిగినప్పటికీ గురువారంతో పాప పుట్టి నెల రోజులే అవుతుంది. గురువారం రోజునే ఉపాసన పుట్టినరోజు కావటం విశేషం. క్లీంకార వన్ మంత్ బర్త్ యానివర్సరీ వీడియోను టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ జోసెఫ్ ప్రతనిక్ డైరెక్ట్ చేసి నిర్మించారు.
ఈ వీడియోలో లెజెండ్రీ యాక్టర్ మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖా కొణిదెలతో పాటు ఉపాసన తల్లిండ్రులు శోభా కామినేని, అనీల్ కామినేని కూడా ఉన్నాయి. కుటుంబ సభ్యులందరూ ఉన్నారు. అందదరిలోనూ ఎగ్జయిట్‌మెంట్, ఆనందం ఉండటాన్నిమనం గమనించవచ్చు. క్లీంకార పుట్టిన తర్వాత కుటుంబ సభ్యులు, అభిమానులు అందరూ పండుగ చేసుకున్నారు. వాటన్నింటినీ వీడియోలో అందంగా చూపించారు.
ఈ భావోద్వేగం గురించి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడుతూ క్లీంకార పుట్టే సమయంలో మా అందరిలోనూ తెలియని టెన్షన్. అంతా సరిగ్గా జరగాలని మేం అందరూ ప్రార్థిస్తున్నాం. అందుకు తగినట్టే అన్నీ అనుకూలంగా మారి సరైన సమయం కుదరటంతో పాప ఈ లోకంలోకి అడుగు పెట్టిందని భావిస్తున్నాను. పాప పుట్టిన ఆ క్షణం మనసుకి ఆహ్లదంగా, చాలా సంతోషంగా అనిపించింది. పాప పుట్టటానికి పట్టిన 9 నెలల సమయం, అప్పుడు జరిగిన ప్రాసెస్ అంతా తలుచుకుని హ్యాపీగా ఫీలయ్యాం అన్నారు.
క్లీంకార రాకకు దారి తీసిన ఆ మరపురాని క్షణాలతో పాటు, పాపకు ఆ పేరు పెట్టటానికి కారణమైన అసలు కథను కూడా వీడియోలో మనం గమనించవచ్చు. భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒడిస్సా ప్రాంతాల్లో నివసిస్తున్న చెంచు జాతి నుంచి స్ఫూర్తిని పొందారు. సదరు చెంచు జాతి ద్రావిడు సంస్కృతిలో భాగం. వారి సంస్కృతిలోని గొప్పతనం, విలువలే పాపకు ఆ పేరు పెట్టటానికి కారణమయ్యాయి.
ఈ సందర్భంగా ఉపాసన కొణిదెల మాట్లాడుతూ మా పాప ద్రావిడ సంస్కృతిలో భాగం కావాలని నేను కోరుకున్నాను. ఆమె పేరుకి ముందు, వెనుక ఎలాంటి ట్యాగులను ఇవ్వకండి. అలాంటి వాటిని వారే స్వయంగా సాధించుకోవాలని నా అభిప్రాయం. పిల్లల పెంపకంలో ఇవెంతో ముఖ్యమైనవి. జీవితంలో ప్రతీ క్షణాన్ని ఆస్వాదించాలి.మనం అందరితో కలిసి సంతోషంగా ఉన్న సమయానికి విలువ ఇవ్వాలని నేను భావిస్తాను అన్నారు.
వారి కుటుంబాలకు సంబంధించిన ప్రత్యేకమైన వీడియోను ప్రజలకు చూపించటం ద్వారా రామ్ చరణ్, ఉపాసనలను నెటిజన్స్ అభినందిస్తున్నారు. అభిమానులు, ప్రేక్షకులు, స్నేహితులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులు చూపిస్తున్న ఈ ప్రేమాభిమానాలపై చరణ్, ఉపాసన కృతజ్ఞతలు తెలియజేశారు.
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…