ఆగష్టు 14న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కానున్న ‘విశ్వనాథ్ & సన్స్’

సూర్య – వెంకీ అట్లూరి కలయికలో రూపొందుతోన్న ‘విశ్వనాథ్ & సన్స్’ చిత్రం ఈ స్వాతంత్య్ర దినోత్సవ వారాంతంలో ఒక అద్భుతమైన కుటుంబ వినోదాన్ని అందించడానికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

సూర్య అభిమానులతో పాటు, సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యామిలీ డ్రామా ‘విశ్వనాథ్ & సన్స్’ ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 14న ఘనంగా థియేటర్లలో విడుదల కానుంది. బ్లాక్‌బస్టర్ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. భావోద్వేగాలు, హాస్యం, హృదయాన్ని తాకే కుటుంబ అనుబంధాలతో ఈ సినిమా ప్రేక్షకులకు పూర్తి స్థాయి వినోదాన్ని అందించడానికి సిద్ధమవుతోంది.

టీజర్, టైటిల్ ప్రకటన వెలువడినప్పటి నుంచే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా చిన్నారితో కలిసి సూర్య కనిపించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు ఆయన వింటేజ్ చార్మ్‌ను గుర్తు చేస్తూ కుటుంబ ప్రేక్షకులను తక్షణమే ఆకట్టుకున్నాయి.

‘సార్/వాథి’, ‘లక్కీ భాస్కర్’ వంటి వరుస విజయవంతమైన చిత్రాలను అందించిన దర్శకుడు వెంకీ అట్లూరి, మరోసారి బలమైన కుటుంబ విలువలు, హృద్యమైన కథనం కలిగిన ఒక ఫీల్ గుడ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌ను అందించబోతున్నారు.

ఈ చిత్రంలో మమితా బైజు, రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా, నిమిష్ రవి ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టగా, బంగ్లాన్ కళా దర్శకుడిగా పనిచేస్తున్నారు.

‘విశ్వనాథ్ & సన్స్’ ప్రేక్షకుల మనసులు గెలుచుకొని, ఈ ఏడాది అత్యంత ఆదరణ పొందిన కుటుంబ వినోద చిత్రాలలో ఒకటిగా నిలుస్తుందనే అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి.

తమిళనాడులో ఈ చిత్రాన్ని థింక్ స్టూడియోస్ విడుదల చేయనుండగా, రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.

నటీనటులు & సాంకేతిక బృందం:

తారాగణం: సూర్య, మమితా బైజు, రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్ తదితరులు
రచన, దర్శకత్వం: వెంకీ అట్లూరి
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
సంగీతం: జి.వి. ప్రకాష్ కుమార్
ఛాయాగ్రహణం: నిమిష్ రవి
కూర్పు: నవీన్ నూలి
కళ: బంగ్లాన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: యలమంచిలి గోపాల కృష్ణ (నాని)
ఫైట్ మాస్టర్: వి వెంకట్
నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
పీఆర్ఓ: లక్ష్మివేణుగోపాల్

TFJA

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

8 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

8 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

9 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago