మాస్ కా దాస్ విశ్వక్సేన్ అప్ కమింగ్ యూత్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘లైలా’. రామ్ నారాయణ్ దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించిన ఈ మూవీ ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. సోను మోడల్, లైలాగా విశ్వక్సేన్ రెండు డిఫరెంట్ లుక్స్ బజ్ క్రియేట్ చేశాయి. మొదటి సింగిల్ కూడా అద్భుతమైన స్పందనను వచ్చింది. ఈ రోజు మేకర్స్ లైలా ఇచిపాడ్ టీజర్‌ను విడుదల చేశారు.
ఈ టీజర్ విశ్వక్సేన్ పాత్ర డ్యుయాలిటీని ఎక్సయిటింగ్ గా ప్రజెంట్ చేస్తోంది. ఇందులో అతను సోను మోడల్, లైలా కనిపించారు, ఇద్దరు డిఫరెంట్ పెర్శనాలిటీస్ గా ప్రేక్షకులను నవ్వించి ఆశ్చర్యపరుస్తారు.
సోను మోడల్ క్యారెక్టర్ కు సిటీలో ఒక బ్యూటీ పార్లర్ వుంది, ఆ ప్రాంతంలోని మహిళలతో అతను మాట్లాడటం అక్కడ మగవాళ్ళకి నచ్చదు. సోను చరిస్మా అతన్ని మరిన్ని ఇబ్బందుల్లోకి నెట్టివేస్తుందనే సమయంలో విధి ఊహించని మలుపు తీసుకుంటుంది, ఇది అతను లైలాగా మారడానికి దారితీస్తుంది.
విశ్వక్‌సేన్ రెండు పాత్రల అద్భుతంగా పోషించారు. సోను క్యారెక్టర్ లో ఎనర్జీ అదిరింది. లైలాగా కట్టిపడేశారు. దర్శకుడు రామ్ నారాయణ్ ఫ్రెష్ స్టొరీ టెల్లింగ్ ప్రత్యేకంగా నిలిచింది.
రిచర్డ్ ప్రసాద్ ఛాయాగ్రహణం స్టైలిష్ షాట్‌లతో టీజర్ విజువల్ ఎట్రాక్షన్ ని పెంచుతుంది. లియోన్ జేమ్స్ నేపథ్య సంగీతం ఎనర్జీని పెంచుతుంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మాణ విలువలు గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ని అందిస్తున్నాయి. స్క్రీన్‌ప్లేను వాసుదేవ మూర్తి రూపొందించగా, బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్ పనిచేస్తున్నారు.
టీజర్ ఎక్సయిట్మెంట్ ని క్రియేట్ చేయడంతో పాటు, క్యురియాయాసిటీ పెంచింది. ఆకాంక్ష శర్మ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం రొమాన్స్, యాక్షన్, కామెడీ పర్ఫెక్ట్ బ్లెండ్ గా వుంటుంది.
నటీనటులు: విశ్వక్సేన్, ఆకాంక్ష శర్మ
సాంకేతిక సిబ్బంది:
బ్యానర్: షైన్ స్క్రీన్స్
నిర్మాత: సాహు గారపాటి
దర్శకత్వం: రామ్ నారాయణ్
రైటర్: వాసుదేవ మూర్తి
సంగీతం: లియోన్ జేమ్స్
సినిమాటోగ్రాఫర్: రిచర్డ్ ప్రసాద్
ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో
తెలుగు భీజాక్షరాల్లో ‘హ్రీం’ అనే అక్షరానికి ఎంతో ఉన్నతమైన విలువలతో కూడిన అర్థం ఉంది. ‘హ్రీం’ అనే ఒక్క భీజాక్షరంలో…
సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న సినిమా "కపుల్ ఫ్రెండ్లీ". ఈ చిత్రంలో మానస వారణాసి హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ…
ఇటీవల లిటిల్‌హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి, ఈషా వంటి బ్లాక్‌బస్టర్స్ చిత్రాలను అందించిన బన్నీవాస్, వంశీ నందిపాటిల సక్సెస్‌ఫుల్ ద్వయం…
నితిన్ హీరోగా వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై రూపొందనున్న యూనిక్ సైఫై ఎంటర్‌టైనర్.. వైవిధ్యమైన సినిమాలు, పాత్రలతో…
తానా సాహిత్య విభాగం - తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో మరియు అనకాపల్లి సిరివెన్నెల…
కేవలం ఐదు రోజుల్లో రూ.100.2 కోట్ల గ్రాస్ సాధించిన 'అనగనగా ఒక రాజు'నవీన్ పొలిశెట్టి కెరీర్లోనే అతిపెద్ద విజయంయూఎస్‌లో హ్యాట్రిక్…