విజయ్ ఆంటోనీని స్టార్ హీరోగా మార్చిన “బిచ్చగాడు” చిత్రానికి సీక్వెల్ గా రాబోతున్న “బిచ్చగాడు 2” రిలీజ్ డేట్ ఈరోజు ప్రకటించారు.
మొదటి పార్ట్ 144 రోజుల బ్లాక్ బస్టర్ అవ్వడంతో భారీ అంచనాల మధ్య సీక్వెల్ ని సమ్మర్ లో ఏప్రిల్ 14 న విడుదల చేయనున్నారు.
ఈ సినిమాను విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ పై ఫాతిమా విజయ్ ఆంటోనీ నిర్మిస్తుండగా విజయ్ ఆంటోనీ కథ, దర్శకత్వంతో పాటు సంగీతం, ఎడిటింగ్ బాధ్యతలూ నిర్వహిస్తున్నారు.
బ్రెయిన్ ట్రాన్స్ ప్లాంటేషన్ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కావ్య థాపర్ నాయికగా నటిస్తుంది. రిలీజ్ డేట్ తో పాటు విడుదల చేసిన థీమ్ సాంగ్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి రేపింది.
నటీ నటులు:
దేవ్ గిల్, హరీష్ పెరడి, జాన్ విజయ్, రాధా రవి, మన్సూర్ అలీ ఖాన్, వైజీ మహేంద్రన్, రాజా కృష్ణమూర్తి తదితరులు.
సినిమాటోగ్రఫీ – విజయ్ మిల్టన్ ఓం ప్రకాష్
నిర్మాత – ఫాతిమా విజయ్ ఆంటోనీ
బ్యానర్ – విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్
రచన, సంగీతం, ఎడిటింగ్, దర్శకత్వం – విజయ్ ఆంటోనీ.