బిచ్చగాడు 2 నుండి బికిలి సాంగ్ రిలీజ్.

Must Read

వైవిధ్యమైన సినిమాలతో తమిళ్ లో తనదైన శైలిలో రాణిస్తోన్న హీరో విజయ్ ఆంటోనీ. గతంలో నకిలీ, డాక్టర్ సలీమ్ చిత్రాలతో ఆకట్టుకున్న విజయ్ ఆంటోనీ.. బిచ్చగాడు మూవీతో తెలుగులోనూ స్టార్డమ్ తెచ్చుకున్నాడు. ఈ మూవీ అతనికి తిరుగులేని మార్కెట్ ను ఇచ్చింది. ప్రస్తుతం బిచ్చగాడుకు సీక్వెల్ గా మరో సినిమాతో వస్తున్నాడు విజయ్. ఈ చిత్రాన్ని తనే నిర్మిస్తూ డైరెక్ట్ చేస్తున్నాడు. దర్శకత్వంతో పాటు సంగీతం, ఎడిటింగ్ బాధ్యతలు కూడా తనే నిర్వర్తిస్తున్నాడు. బిచ్చగాడు2 అనే టైటిల్ తో పాటు బికిలి అనే టైటిల్ కూడా పెట్టాడు విజయ్ ఆంటోనీ. అయితే ఈ బికిలి అనే పదానికి అర్థం ఏంటీ అంటూ కొన్నాళ్లుగా చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. వారి కన్ఫ్యూజన్ ను క్లియర్ చేస్తూ.. బికిలీ అనే పదానికి అర్థం చెబుతూ.. లేటెస్ట్ ఈ మూవీ నుంచి లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు.
పాటలో మొదట బికిలీ అంటే ఏంటీ అనేదానికి వివరణ ఇస్తూ  ‘‘నమస్కారం.. నేను విజయ్ ఆంటోనీని మాట్లాడుతున్నాను. నేను బాగా ఆలోచించి ఆలోచించి.. ఏదో నా వల్ల అయిన ఒక కొత్త చెడ్డ పదాన్ని కనిపెట్టాను. చెడ్డపదం అంటే మీరనుకుంటున్నట్టు.. మాట్లాడ్డానికి అసహ్యంగా ఉండే పదం కాదు. వినేవాళ్లకు అది అసహ్యంగా ఉండే పదం. నేను కనిపెట్టిన ఆ కొత్త పదం పేరు బికిలీ. పేదవాళ్ల పేదరికాన్ని ఉపయోగించుకుని తన దగ్గరున్న ధనబలంతో వాళ్ల పొట్టను కొట్టి వాళ్లను బానిసలుగా మార్చి డబ్బుందన్న అహంకారంతో తిరిగేవాడే బికిలీ. మనలో చాలామంది ఎంత కష్టపడి పనిచేసినా ముందుకెళ్లలేక తలపట్టుకుని డిప్రెషన్ లోకి వెళ్లడానికి కారణం.. ఈ బికిలీలే. వాళ్లను మనం ఏం చేయలేకపోయినా.. బికిలీ అనే పదంతో పిలవొచ్చు. ఈ రోజు నుంచి నేను కనిపెట్టిన ఈ బికిలీ పదం.. భారతదేశంలో వాడకంలోకి వస్తుంది..’’ అంటూ విజయ్ ఆంటోనీ చెప్పిన మాటలతో మొదలైన వీడియో సాంగ్..  ‘వీళ్లే బికిలి బికిలి బిలి బిలి.. బికిలి బికిలి బిలి బిలి…’ అంటూ మొదలై.. మూవీ థీమ్ ను తెలియజేస్తూ.. కొందరికి హీరో ఎందుకు బికిలీ అనే పేరు పెట్టాడు అనే వివరణ ఇచ్చే సాహిత్యంతో మాంటేజ్ సాంగ్ గా సాగుతోంది. ‘లేనివాళ్లను తొక్కిపెట్టి నమ్మి వస్తే ముంచివేసి చెవిలోనా పెట్టెరా పువ్వులు, పక్కనుండి గొయ్యి తీసి నిద్రపుచ్చి గొంతు కోసి ఏడిపించే నవ్వేరా  నవ్వులు.. పేరు గొప్ప ఊరు దిబ్బ’ అంటూ అర్థవంతమైన సాహిత్యంతో సాగే ఈ గీతాన్ని కంపోజ్ చేసి, పాడటమే కాదు.. రాసింది కూడా విజయ్ ఆంటోనీయే కావడం విశేషం.
బిచ్చగాడు విడుదలైన అన్ని భాషల్లోనూ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దీంతో రెండో భాగంపైనా భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలను అందుకోవడానికి త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు  రాబోతోంది. ఇప్పటికైతే గతంలో విడుదలైన థీమ్ సాంగ్ తో పాటు ఈ బికిలీ పాటతో ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేసింది బిచ్చగాడు2 మూవీ.
ఈ వేసవి బరిలోనే విడుదల కాబోతోన్న ఈ చిత్రంలో
దేవ్ గిల్,  హరీష్ పెరడి, జాన్ విజయ్, రాధా రవి, మన్సూర్ అలీ ఖాన్, వైజీ మహేంద్రన్, రాజా కృష్ణమూర్తి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
సినిమాటోగ్రఫీ – విజయ్ మిల్టన్, ఓం ప్రకాష్, నిర్మాత – ఫాతిమా విజయ్ ఆంటోనీ, పిఆర్వో– జిఎస్కే మీడియా, బ్యానర్ – విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్, రచన, సంగీతం, ఎడిటింగ్, దర్శకత్వం – విజయ్ ఆంటోనీ

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News