ఆగస్టు 2న ఉషా పరిణయం విడుదల

ఆగస్టు 2న ఉషా పరిణయం విడుదల తెలుగు చిత్రపరిశ్రమలో ప్రముఖ దర్శకుల్లో కె. విజయ్ భాస్కర్ ఒకరు. విజయ్ భాస్కర్ అద్బుతమైన సృజనాత్మకత సామర్థ్యం ఉన్న డైరెక్టర్.ఫ్యామిలి ఎంటర్ టైనర్ చిత్రాలు చేయడంలో ఆయనకు మంచి పేరుంది. విజయ్ భాస్కర్ తీసిన సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. తన దర్శకత్వంలో రూపొందిన నువ్వే కావాలి,మన్మథుడు, మల్లీశ్వరి వంటి ఫ్యామిలి ఎంటర్ టైనర్ చిత్రాలు ప్రేక్షకుల లోబాగా ప్రాచుర్యం పొందాయి. మళ్లీ ఆయన స్వీయ దర్శకత్వంలో మరో సరికొత్త ఫీల్ గుడ్ ఫ్యామిలి ఎంటర్ టైనర్ రాబోతుంది. ఉషా పరిణయం అనే టైటిల్ తో మరో ఫ్యామిలి ఎంటర్ టైనర్ ను విడదలకు సిద్దం చేశారు. లవ్ ఈజ్ బ్యూటిఫుల్ అనేది చిత్రం ఉపశీర్షిక.ఈ చిత్రాన్ని విజయభాస్కర్‌ క్రాఫ్ట్ ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తుంది. విజయ్ భాస్కర్ తన తనయుడు శ్రీ కమల్ ను కథానాయకుడిగా పరిచయం చేస్తున్నాడు.

ఈ చిత్రంలో కథానాయికగా తాన్వి ఆకాంక్ష అనే తెలుగమ్మాయిన పరిచయం కాబోతుంది .ఆగష్టు 2 చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం వెల్లడించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘సరికొత్త ప్రేమ కథతో అన్నీ ఎమోషన్స్ తో ఉండే మంచి లవ్ స్టోరీ ఇది అందరికి నచ్చుతుంది ,ఈ చిత్రం ప్రేమకు నేనిచ్చే డెఫినేషన్ ,ఇదొక మంచి లవ్ స్టోరీ ,సినిమా లవర్స్ కు ఇదొక విందు భోజనంలా ఉంటుందన్నారు.. ఈ చిత్రం ఆగష్టు 2 న ప్రేక్షకుల ముందుకు రానుందని దర్శకుడు వెల్లడించారు.. ఇటీవల విడుదలైన పాటలకు ,టీజర్ కు మంచి స్పందన వచ్చింది `అన్నారు.శ్రీ కమల్ ,తాన్వి ఆకాంక్ష,సూర్య,రవి,శివతేజ, అలీ, వెన్నెల కిశోర్ ,శివాజీ రాజా,ఆమని, సుధ, ఆనంద్, చక్రపాణి, రజిత, బాలకృష్ణ, సూర్య, మధుమణి, ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ లవ్ స్టోరీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకు సంగీతం: ఆర్ ఆర్ ధ్రువన్ ,డీఓపీ: సతీష్ ముత్యాల , ఎడిటింగ్: ఎమ్ ఆర్ వర్మ,దర్శకత్వం- నిర్మాత : కె. విజయ్ భాస్కర్ .

Tfja Team

Recent Posts

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘గోపాల గోపాల’ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

3 hours ago

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

1 week ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago