విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ‘కన్నప్ప’ సినిమా భారీ ఎత్తున రూపొందుతోన్న సంగతి తెలిసిందే. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ బ్యానర్లో మోహన్ బాబు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ప్రతీ సోమవారం కన్నప్ప నుంచి ఒక అప్డేట్ వస్తోంది. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్‌లు, రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సోమవారం శివుడిగా నటించిన అక్షయ్ కుమార్ పాత్రకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు.
శివుడిగా అక్షయ్ కుమార్ పాత్ర ఎలా ఉండబోతోందో ఈ పోస్టర్‌తో చూపించారు. శివ తాండవం చేస్తున్నట్టుగా ఈ పోస్టర్‌లో కనిపిస్తోంది. ఇలాంటి ఓ అద్భుతమైన సినిమాలో భాగమైనందుకు ఆనందంగా ఉందని, శివుని ఆశీస్సులతో ఆడియెన్స్ ముందుకు ఏప్రిల్ 25న రాబోతోన్నామంటూ అక్షయ్ కుమార్ తన సోషల్ మీడియాలో రిలీజ్ చేసిన ఈ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది.
కన్నప్ప చిత్రంలో మోహన్ లాల్, ప్రభాస్, మోహన్ బాబు, శరత్ కుమార్, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్, ప్రీతి ముకుందన్ ఇలా ఎంతో మంది భారీ తారాగణం నటించింది. ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 25న ఈ చిత్రాన్ని సమ్మర్ కానుకగా భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు.
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…
టాలీవుడ్ ఫేవరేట్ ద్వయం సత్య, దర్శకుడు రితేష్ రానా 'జెట్లీ'తో అలరించబోతున్నారు. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ) హేమలత…
మీడియా నేపథ్యంతో రూపొందుతున్న థ్రిల్లర్ చిత్రం “ది బ్రేకింగ్ న్యూస్” తాజాగా ఫస్ట్ లుక్ మరియు టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో ప్రేక్షకుల…
ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మా ఇంటి…
యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని లేటెస్ట్ మూవీ ‘లెనిన్’ శరవేగంగా రూపొందుతోంది. ఈ సినిమాపై మంచి అంచనాలు…
మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటించిన భారీ బడ్జెట్ మూవీ "పళ్లిచట్టంబి". ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ ఫిలింస్,…