”టోవినో థామస్” అజయంతే రందం మోషణం టీజర్ లాంచ్

Must Read

టోవినో థామస్ అజయంతే రందం మోషణం (ఎఆర్ఎం) టీజర్ లాంచ్..  మొదటి పాన్ ఇండియా విడుదలకు సిద్ధమౌతున్న టోవినో థామస్  

తన సూపర్ హీరో మూవీ మిన్నల్ మురళితో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన మలయాళ నటుడు టోవినో థామస్ తన మొదటి పాన్-ఇండియా చిత్రం విడుదలకు సిద్ధంగా వున్నారు. జితిన్ లాల్ దర్శకత్వం వహించిన ‘అజయంతే రందం మోషణం’ (ARM) టీజర్ ఈ రోజు అన్ని సౌత్ లాంగ్వేజెస్, హిందీలో కూడా విడుదలైంది.

పాన్ ఇండియా అప్పీల్‌కు అనుగుణంగా.. ఎఆర్ఎం టీజర్ సోషల్ మీడియాలో గ్రాండ్ లాంచ్ అయ్యింది. మలయాళ చిత్ర పరిశ్రమ నుండి వస్తున్న ఈ పాన్ ఇండియన్ ఫిల్మ్‌ కోసం ఇండియన్ సూపర్ స్టార్స్ హృతిక్ రోషన్, నాని, లోకేష్ కనగరాజ్, ఆర్య, రక్షిత్ శెట్టి , పృథ్వీరాజ్ సుకుమారన్ కలిసి వచ్చారు.

హిందీ టీజర్‌ను హృతిక్ రోషన్ లాంచ్ చేయగా, తెలుగులో నాని, తమిళంలో లోకేష్ కనగరాజ్, ఆర్య, కన్నడలో రక్షిత్ శెట్టి, మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ లాంచ్ చేశారు. ఎఆర్ఎం ని సుజిత్ నంబియార్ రాశారు. మ్యాజిక్ ఫ్రేమ్స్, UGM ప్రొడక్షన్స్ పై  డాక్టర్ జకరియా థామస్, లిస్టిన్ స్టీఫెన్ నిర్మించారు.

ఈ టీజర్ ఇంటర్నెట్‌లో దూసుకుపోతోంది. టొవినో థామస్ పొడుగాటి జట్టుతో రగ్గడ్ అండ్ ఇంటెన్స్ అవతార్‌ లో కనిపించారు. ఒక చిన్న అమ్మాయి తన అమ్మమ్మని దొంగ గురించి కథ అడగడంతో టీజర్ మొదలవుతుంది. ప్రజలు దేవుడిని ప్రార్థించే సమయంలో ఆ దొంగ గురించి ఎందుకు? అని అమ్మమ్మ  మనరాలని మందలిస్తుంది. తరువాతి సన్నివేశంలో.. ఒక గ్రామంలో ఒక సమస్యవుండటం,  గ్రామంలోని ప్రజలు ఏదో అద్భుతం జరుగుతుందా అని ఎదురుచూడటం, తర్వాత వచ్చే సన్నివేశాల్ని ఎక్స్ టార్డినరీగా చూపించారు.  

Tovino’s Ajayante Randam Moshanam begins

టోవినోతో పాటు, కృతి శెట్టి , ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం త్వరలో మల్టీ  లాంగ్వేజెస్ లో విడుదల కానుంది.

దర్శకత్వం : జితిన్ లాల్
రచన: సుజిత్ నంబియార్
నిర్మాత: డా. జచారియా థామస్, లిస్టిన్ స్టీఫెన్
బ్యానర్: మ్యాజిక్ ఫ్రేమ్‌లు & UGM ప్రొడక్షన్స్
సంగీతం & BGM: ధిబు నినాన్ థామస్
ఫోటోగ్రఫీ డైరెక్టర్: జోమోన్ టి జాన్ ISC
ఎడిటర్: షమీర్ మహమ్మద్
పీఆర్వో– వంశీ శేఖర్
డిజిటల్ మార్కెటింగ్: దిలీప్ లెక్కల & తనయ్ సూర్య

Latest News

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు సినీ పరిశ్రమ లో అజాత...

More News