మంచి సినిమా తీశామని గర్వంగా ఫీల్ అవుతున్నాం : అన్నీ మంచి శకునములే టీమ్‌

Must Read

ప్రేక్షకుల స్పందన చూశాక మంచి సినిమా తీశామని గర్వంగా ఫీల్ అవుతున్నాం : అన్నీ మంచి శకునములే టీమ్‌

ప్రముఖ నిర్మాణ సంస్థ స్వప్న సినిమా నిర్మాణంలో దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వంలో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ ప్రధాన పాత్రలలో రూపొందిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్  ‘అన్నీ మంచి శకునములే’. మిత్ర విందా మూవీస్‌ తో కలిసి ప్రియాంక దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మే 18 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలామంది సినిమా సమీక్షలు చదివాక కూడా థియేటర్ కు వెళ్లి చూసి ఎంజాయ్ చేయడం చూస్తుంటే మంచి సినిమా తీశామని గర్వంగా ఉందని చిత్ర యూనిట్ తెలియజేసింది. శనివారం నాడు ప్రసాద్ ల్యాబ్ లో జరిగిన సక్సెస్ మీట్ లో వారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దర్శకురాలు నందినిరెడ్డి మాట్లాడుతూ, ఇప్పుడు థియేటర్‌ కు జనాలు వస్తారా లేదా అనే ఛాలెంజ్‌ మొదట్లో మా ముందుంది. ఎందుకంటే నేను తీసిన అలా మొదలైంది అలానే జరిగింది. కానీ రానురాను మౌత్‌టాక్‌ తో హిట్‌ అయింది. అలాగే అన్నీ మంచి శకునములే చిత్ర కథలోని సన్నివేశాలు, పాతల్రు ఎమోషన్స్‌ మేమంతా ఇష్టపడి ప్రేమించి తీశాం. ఇందులో టిస్ట్‌ లు లేవు. అందుకే మొదట్లో రిస్క్‌ చేస్తున్నామా అని కూడా ఆలోచించాం. కానీ ప్యూర్‌ మానవీయ సంబంధాలతో కూడిన అందమైన కథను చేయడమే రిస్క్‌గా భావించి స్వప్న దత్‌, ప్రియాంక దత్‌ చాలా దైర్యంగాఈ నిర్ణయం తీసుకున్నారు. అందుకే మమ్మల్ని కదిలించిన ఈ కథ ఫ్యామిలీ ఆడియన్స్‌ కూడా రీచ్‌ అవుతుందని నమ్మాము. చాలామంది ఓటీటీకి అలవాటు పడిన ప్రేక్షకులు థియేటర్ కు వస్తారా! అన్నారు. మంచి కంటెంట్‌ వుంటే ఫ్యామిలీస్‌ బయటకు వస్తారు. అదే నమ్మకాన్ని ఈరోజు చూపిస్తున్నారు.

అలా మొదలైంది టైంలో 70 ఏళ్ళ ఆవిడను థియటర్‌ లో చూశాను. ఈ రోజు కూడా 50పైబడిన వారిని మేం థియేటర్‌ లో చూశాను. నేను సినిమా విడుదలకు ముందు క్లయిమాక్స్‌ గురించి ఏదైతే చెప్పానో దానికి ఆడియన్స్‌ బాగా కనెక్ట్‌ అవుతున్నారు. కథ అందరికీ నచ్చాలనే గ్యారంటీ లేదు. నచ్చినవారికి బాగా నచ్చింది. ఇంకా అందరికీ చేరువకావాలంటే కొద్దిగా టైం పడుతుంది. కానీ కొంతమంది రివ్యూలు చదివికాక సినిమాకు వెళ్ళినవారు వున్నారు. సినిమా చూశాక చాలా బాగుందని చెప్పారు కూడా.  మాళవిక క్యారెక్టర్‌ చాలా కుటుంబాలకు కనెక్ట్‌ అయింది.  అలాగే కొన్ని సన్నివేశాలు కనెక్ట్‌అయ్యాయి. అయినా సినిమాలో కొన్ని లోపాలు లేకపోలేదు. వాటిని కాసేపు పక్కన పెడితే ఒక బ్యూటిఫుల్‌ సినిమా ఇది. ఏదైనా వెలితి వుందంటే రచనా పరంగా వుందని చెప్పగలను. క్లయిమాక్స్‌ ఆర్‌.ఆర్‌. లేకుండా రెండు మూడు డైలాగ్స్‌ తో నడపడం చాలా కష్టం. అయినా ఆ విషయంలో సక్సెస్‌ సాధించాం. నా బెస్ట్‌ ఫిలింస్‌ లో ఇది ఒకటి. అన్నీ మంచి శకునములే బ్యూటిఫుల్‌ ఎమోషనల్‌ సినిమా. నేను ఐదు సినిమాలు చేస్తే అందులో కేవలం జబర్‌దస్త్‌ ఒక్కటే ప్లాప్‌ అయింది. కానీ ఈ సినిమా మంచి సినిమా చేశాననే గర్వంగా చెప్పగలను. సినిమా అంటే ఓన్లీ మాస్‌ కాదు. ఫ్యామిలీ అంతా చూడగలిగే సినిమా ఇది అని అన్నారు.

చిత్ర హీరో సంతోష్‌ శోభన్‌ మాట్లాడుతూ, చూసినవారంతా మన సినిమా అంటుంటే చాలా హ్యాపీగా వుంది. ఈ సినిమా చేశాక మా అమ్మగారి మొహం ఆనందంగా కనిపించింది. 20 ఏళ్ళ క్రితం నాన్నగారు తీసిన వర్షం సినిమా చూశాక మా అమ్మ లో సంతోషం చూశాను. మరలా ఈ సినిమాకు అమ్మలో ఆనందం తిరిగి తీసుకువచ్చింది. దానికి కారణం స్వప్న, ప్రియాంక, నందినిరెడ్డి గార్లే. ప్రేక్షకులే నిజాయితీగా మాట్లాడతారు. అంతే నిజాయితీగా సినిమా తీశాం. నటుడిగా ఈ సినిమాకు పేరు వచ్చిందంటే దానికి కారణం దర్శక నిర్మాతలే అని అన్నారు.



మాళవిక నాయర్‌ మాట్లాడుతూ, నా పాత్ర ఆర్య గురించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసివారందరికీ ధన్యవాదాలు. ఇంకా సినిమాను చూడనివారు చూడండి. ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌ అనేది నా జోనర్‌. వాటిని నేను చూస్తూ ఉంటాను. ఈ మూవీలో ఆర్య పాత్ర కూడా చాలా కాంప్లెక్స్‌గా రాశారు. దానికి న్యాయం చేశానని చెప్పగలను. ఇందుకు ప్రియాంక, స్వప్నగారికి థ్యాంక్స్‌. అన్నారు.

ప్రియాంక దత్‌ మాట్లాడుతూ, 2016 నుంచి నిర్మాతగా మా అక్కతో ప్రయాణం, ఎవడే.., మహానటి, జాతిరత్నాలు చేశాను. ఈ సినిమా చేసేటప్పుడు కొన్ని క్యాలిక్లేషన్స్‌ వున్నాయి. మంచి సినిమా తీయాలనేది   మా  కోరిక. మేం తీసుకున్న నిర్ణయం కరెక్ట్‌ అని చెప్పగలను. మిశ్రమ స్పందన వచ్చినా, ఫ్యామిలీ అంతా కూర్చొని చూసే సినిమా ఇదని అనిపించింది. ఆ విషయం నాగి, నేను థియేటర్‌ లో వెళ్లి చూశాక మాకే ఆనందం కలిగింది. ఇలాగ వచ్చినవారందరికీ థ్యాంక్స్‌. ఇంకా చూడనివారు మీ కుటుంబంతో కలిసి చూడండి. ఇంతకుముందు తీసిన సినిమాల్లాగే ఓ మంచి సినిమా తీశామనే నమ్మకముంది అన్నారు.

స్వప్నదత్‌ మాట్లాడుతూ, ఈ సినిమా తీసినందుకు గర్వంగా వుంది. ప్రేమతో చేశాం. సినిమాను చుట్టేయలేదు. థియేటర్‌ కు వెళ్ళి ప్రేక్షకుల రియాక్షన్‌ చూసుకున్నాం. ఈ సినిమా చాలామంది క్రిటిక్స్‌కు నచ్చలేదు.  అయినా ప్రేక్షకులకు నచ్చింది. మా బేనర్‌ లో ఎన్‌.టి.ఆర్‌. నాని, విజయ్‌ నటించి స్టార్స్‌ అయ్యారు. అలాగే సంతోష్‌ కూ ఆ రేంజ్‌ వస్తుందని ఆశిస్తున్నాం. ఇది మంచి సినిమా అని గట్టిగా నమ్మి చేశాం. అందుకే థియేటర్‌ అనుభవం పోగొట్టుకోకండి .అందరూ థియేటర్లోనే చూడండి. నందిని రెడ్డి సినిమాల్లో అన్నీ పాజిటివ్‌ పాత్రలే ఎందుకుంటాయంటే తను చాలా పాజిటివ్‌ గా వుంటుంది. అందుకే మేం ఈనాటి ట్రెండ్‌ లోనూ సినిమా తీసినందుకు గర్వంగా ఫీలవుతున్నామని అన్నారు.

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News