పద్మశ్రీ పురస్కార గ్రహీత, కళా ప్రపూర్ణ డా.మంచు మోహన్ బాబు గారు మే 4 2026 శిల్పకళా వేదికలో తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం ఘనంగా నిర్వహించిన దాసరి జన్మదిన వేడుకలు

ప్రెస్ నోట్ Date: 26/07/2026
పద్మశ్రీ పురస్కార గ్రహీత, కళా ప్రపూర్ణ డా. మంచు మోహన్ బాబు గారు మే 4 2026 శిల్పకళా వేదికలో తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం ఘనంగా నిర్వహించిన డా. దాసరి జన్మదిన వేడుకలు మరియు డైరెక్టర్సడే ఫంక్షన్ లో తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం నుండి ప్రతి ఏడూ ఒక పేద సభ్యుని కుమారుడు లేదా కుమార్తెకు తిరుపతిలోని తన ఎమ్.బి. యూనివర్శిటీలో ఉచిత విద్యనందిస్తానని హామీ ఇచ్చిన విషయం విదితమే. అందులో భాగంగా 2026-27 విద్యా సంవత్సరం నుండి తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘంలో సభ్యుడైన (మెంబర్షిప్ నెం. 2267) శ్రీ ఎలిపే శ్రీనివాసరావు అను ‘సహకార దర్శకుని కుమార్తె చి. ఎలిపే దేదీప్య సిరి కి ఆరవ తరగతి నుండి ఇంటర్మీడియెట్ వరకు ఉచితంగా విద్యనందించే ఏర్పాటు, మరియు ఉచిత హాస్టల్ వసతి కలుగచేశారు. ఈ సందర్భంగా తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం తరఫున అధ్యక్షులు వి.ఎన్.ఆదిత్య, ప్రధాన కార్యదర్శి పి.వి. రామరావు, కోశాధికారి నీలం సాయిరాజేష్ మరియు కార్యవర్గ నిర్వాహక కమిటీ అందరూ డా. మోహన్ బాబు గారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు అందజేశారు. వారి ఈ వితరణ తెలుగు చిత్ర దర్శకుల సంఘంలో సభ్యుల పిల్లలకు అద్భుతమైన భవిష్యత్తుని ఇవ్వనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అదే సందర్భంలో తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం సభ్యుల ట్రస్టుకు మోహన్ బాబుగారు పదిహేను లక్షల రూపాయల విరాళం మెడికల్ ఇన్సురెన్స్ కోసం ప్రకటించడం పట్ల తెలుగు సినీ పరిశ్రమ వర్గాలన్నీ హర్ష ధ్వానాలు పలికాయి.

వి.ఎన్.ఆదిత్య పి.వి. రామా రావు ఎన్. సాయి రాజేష్

అధ్యక్షులు                   ప్రధాన కార్యకార్యదర్శి                    కోశాధికారి
TFJA

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

7 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

8 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

8 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago