‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47’ ప్రచారానికి శ్రీకారం..*‘చిట్టిబాబు‘గా విక్టరీ వెంకటేష్ పాత్ర పరిచయం

విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక కుటుంబ కథా చిత్రం “ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47 (AK47)” ప్రచార కార్యక్రమాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా చిత్రంలోని ప్రధాన పాత్రలను ఒక్కొక్కటిగా పరిచయం చేస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నారు. తొలి పాత్రగా విక్టరీ వెంకటేష్ పోషిస్తున్న ‘చిట్టిబాబు’ పాత్రను పరిచయం చేయగా, అనంతరం శ్రీనిధి శెట్టి, యువినా పార్థవి, రాజా ప్రజ్వల్ పాత్రలను పరిచయం చేయనున్నారు. ఈ నలుగురి పాత్రలు ఈ ఆత్మీయ కుటుంబ కథకు హృదయంగా నిలవనున్నాయి.

ఈ చిత్రంలో వెంకటేష్ చిట్టిబాబు పాత్రలో అలరించనున్నారు. కుటుంబాన్ని ప్రేమతో, ఆప్యాయతతో, బాధ్యతతో ఒకే తాటిపై నడిపించే కుటుంబ పెద్దగా ఆయన పాత్ర ఆకట్టుకోనుంది. విడుదలైన పాత్ర పరిచయ వీడియోలో వెంకటేష్‌తో పాటు శ్రీనిధి శెట్టి, నారా రోహిత్ కనిపిస్తూ, నవ్వులు, భావోద్వేగాలు, కుటుంబ అనుబంధాలతో నిండిన చిత్ర ప్రపంచాన్ని అందంగా పరిచయం చేశారు.

సహజమైన నటన, అద్భుతమైన కామెడీ టైమింగ్, కుటుంబ కథా చిత్రాల్లో తనదైన ముద్ర వేసిన వెంకటేష్ మరోసారి అన్ని వయసుల ప్రేక్షకులను అలరించే పాత్రతో రాబోతున్నారు. చిట్టిబాబు పాత్ర ఆయన కెరీర్‌లో మరో చిరస్మరణీయమైన పాత్రగా నిలిచేలా కనిపిస్తోంది. ఆనందం, అనుబంధాలు, కుటుంబ విలువలకు ప్రతిరూపంగా ఈ పాత్ర ఉండబోతోంది.

తొలి పాత్ర పరిచయంతోనే చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక వరుసగా రానున్న ఇతర పాత్రల పరిచయాలు కూడా ‘ఆదర్శ కుటుంబం’ ప్రపంచాన్ని మరింత ఆసక్తికరంగా ప్రేక్షకులకు చేరువ చేయనున్నాయి.

ప్రఖ్యాత ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్‘
పతాకంపై ప్రముఖ నిర్మాత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ప్రతిష్టాత్మకoగానిర్మిస్తున్న “ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47” చిత్రం 2026 అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కానుంది.

ఈ చిత్రానికి ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా, రవి కె. చంద్రన్ సినిమాటోగ్రఫీ, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, కెవిన్ కుమార్ యాక్షన్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా సంపూర్ణ పండుగ వినోద చిత్రంగా “ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47” ప్రేక్షకుల ముందుకు రానుంది.

TFJA

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

5 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

5 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

5 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago