పాన్ ఇండియా యాక్టర్ సునీల్ చేతుల మీదుగా రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ “అదే నీవు అదే నేను” ట్రైలర్ రిలీజ్

–ఈ నెల 31న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న “అదే నీవు అదే నేను” సినిమా

ఇటీవల ప్రకటించిన 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో రెండు అవార్డులు సాధించిన “కమిటీ కుర్రోళ్లు” మూవీ ఫేమ్ త్రినాథ్ వర్మ, యశ్వంత్ పెండ్యాల, “సిద్ధార్థ్ రాయ్” సినిమా ఫేమ్ తన్వీ నేగి, సహర్ కృష్ణన్ హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న సినిమా “అదే నీవు అదే నేను”. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి వీరభద్ర క్రియేషన్స్ బ్యానర్ పై గోవిందు కాండ్రేగుల నిర్మిస్తున్నారు. రొమాంటిక్ థ్రిల్లర్ కథాంశంతో యువ దర్శకుడు కొండల్ రూపొందిస్తున్నారు. “అదే నీవు అదే నేను” సినిమా ఈ నెల 31న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను పాన్ ఇండియా యాక్టర్ సునీల్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చాలా బాగుందని మూవీ టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ సందర్భంగా

సునీల్ మాట్లాడుతూ – “అదే నీవు అదే నేను” సినిమా ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. షాకింగ్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఆకట్టుకున్నాయి. ఈ సినిమా ఈ నెల 31న థియేటర్స్ లోకి వస్తోంది. తప్పకుండా థియేటర్స్ లో చూడండి. కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేయండి. అన్నారు.

నేడు సమాజంలో జరుగుతున్న కొన్ని వాస్తవ ఘటనల ఇన్సిపిరేషన్ తో ఫిక్షనల్ స్టోరీతో దర్శకుడు కొండల్ “అదే నీవు అదే నేను” సినిమాను ఆద్యంతం ఆసక్తికరంగా తెరకెక్కించినట్లు ట్రైలర్ తో తెలుస్తోంది. శ్రీలక్ష్మి వీరభద్ర క్రియేషన్స్ బ్యానర్ ప్రొడక్షన్ వ్యాల్యూస్, సినిమా క్వాలిటీ విషయంలో నిర్మాత గోవిందు కాండ్రేగుల అన్ కాంప్రమైజ్డ్ ప్యాషన్ కనిపిస్తున్నాయి. ఒక గేటెడ్ కమ్యూనిటీలో జరిగే సరికొత్త రొమాంటిక్ థ్రిల్లర్ కథతో అన్ని వర్గాల ప్రేక్షకులకు ఆద్యంతం ఆసక్తిని పంచేలా ఈ సినిమా ఉండబోతోంది. “అదే నీవు అదే నేను” సినిమా విజయంపై మూవీ టీమ్ పూర్తి నమ్మకంతో ఉన్నారు.

నటీనటులు – త్రినాథ్ వర్మ, యశ్వంత్ పెండ్యాల, తన్వి నేగి, సహర్ కృష్ణన్, కల్పలత, సునయన, బిత్తిరి సత్తి, మీర్, సూర్యతేజ, నరేందర్, రమణ భార్గవ్, తదితరులు

టెక్నికల్ టీమ్

ఆర్ట్ డైరెక్టర్ – నార్ని శ్రీనివాస్
లిరిక్స్ – పూర్ణాచారి
డైలాగ్స్ – వై.అమ్మిరాజు
డీవోపీ – నిమ్మల జయపాల్ రెడ్డి
ఎడిటర్ – ఛోటా కె ప్రసాద్
మ్యూజిక్ – కనిష్క
ప్రొడ్యూసర్ – కాండ్రేగుల గోవిందు
స్క్రిప్ట్, డైరెక్షన్ – కొండల్

TFJA

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

7 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

8 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

8 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago