▪️ భావోద్వేగ కథతో ప్రేక్షకుల ముందుకు రానున్న ‘తీరం’
హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో శ్రీ భవానీ క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న భావోద్వేగ ప్రధాన చిత్రం ‘తీరం’ టైటిల్ సాంగ్‌ను ఘనంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొని చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ‘పుష్ప’ ఫేమ్ నటుడు జగదీష్, ఫన్ బకెట్ మహేష్ విట్ట, నటుడు రాజ్‌కుమార్ కసిరెడ్డి, దర్శకుడు ప్రసాద్, జబర్దస్త్ సద్దాం, నటుడు కుమానన్ తదితరులు హాజరై టైటిల్ సాంగ్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా దర్శకుడు వంశీ మునగాల మాట్లాడుతూ, ‘తీరం’ ప్రతి ఒక్కరి హృదయాలను తాకేలా భావోద్వేగభరితమైన కథతో రూపొందుతోందన్నారు. చిత్రీకరణ విజయవంతంగా పూర్తై ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ఈ ప్రయాణంలో తనకు అండగా నిలిచిన నిర్మాత, సాంకేతిక నిపుణులు, నటీనటులు, చిత్ర యూనిట్ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించేలా సినిమాను అత్యంత నాణ్యతతో రూపొందిస్తున్నామని, ప్రతి ఒక్కరి సహకారంతో ఈ సినిమా అందంగా రూపుదిద్దుకుంటోందని చెప్పారు.
నిర్మాత ఉపేందర్ గంగావెల్లి మాట్లాడుతూ, దర్శకుడు వంశీ మునగాల కథ వినిపించిన వెంటనే ఎంతో నచ్చిందన్నారు. కథపై నమ్మకంతోనే ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చానని తెలిపారు. సినిమా నిర్మాణం తుది దశకు చేరుకుందని, విడుదల తేదీతో పాటు ఇతర విశేషాలను త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని చెప్పారు. చిత్ర బృందం ఎంతో అంకితభావంతో పనిచేసిందని, ప్రేక్షకులకు తప్పకుండా మంచి సినిమా అందిస్తామనే నమ్మకం వ్యక్తం చేశారు.
హీరో ప్రభు మాట్లాడుతూ, షార్ట్ ఫిల్మ్స్‌తో తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించి ఇప్పుడు ఫీచర్ ఫిల్మ్‌లో హీరోగా నటించే అవకాశం రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. దర్శకుడు, నిర్మాత తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా కష్టపడి నటించానని చెప్పారు. ప్రేక్షకుల ఆశీర్వాదాలు కోరారు.
నటుడు జగదీష్ మాట్లాడుతూ, ‘తీరం’ అనే టైటిల్ చాలా అర్థవంతంగా ఉందన్నారు. ఈ సినిమా కూడా విజయ తీరానికి చేరాలని ఆకాంక్షిస్తూ చిత్ర బృందంలోని ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలిపారు.
చిత్ర హీరోయిన్ హరిప్రియా మాట్లాడుతూ, ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన దర్శకుడు వంశీ మునగాల, నిర్మాత ఉపేందర్ గంగావెల్లికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. చిత్రీకరణ సమయంలో యూనిట్ సభ్యులందరూ ఎంతో సహకరించారని, ఈ సినిమా తన కెరీర్‌లో ప్రత్యేక చిత్రంగా నిలుస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
నటుడు రమణ మాట్లాడుతూ, జీవితంలో ఎంత కష్టపడితే గానీ తీరం చేరలేమని, అదే సందేశాన్ని ఈ సినిమా కూడా ప్రతిబింబిస్తుందన్నారు. ఈ చిత్రంలోని ప్రతి కళాకారుడు తన పాత్రను ఎంతో సహజంగా జీవించాడని, దర్శకుడు వంశీ మునగాల సమన్వయంతో సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారని ప్రశంసించారు.
సంగీత దర్శకుడు సాధ్విక్ సన్స్ మాట్లాడుతూ, ఈ చిత్రానికి సంగీతం అందించే అవకాశం ఇచ్చిన దర్శకుడు, నిర్మాతకు కృతజ్ఞతలు తెలిపారు. టైటిల్ సాంగ్‌ను ప్రేక్షకులు ఆదరిస్తున్నందుకు ఆనందంగా ఉందని, సినిమాలోని మిగిలిన పాటలు, నేపథ్య సంగీతం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఫన్ బకెట్ నటులు ఫణి, మహేష్ మాట్లాడుతూ, చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలియజేస్తూ ‘తీరం’ ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.
కో-డైరెక్టర్, క్రియేటివ్ హెడ్ & ఎడిటర్ విజయ్ శెట్టి మాట్లాడుతూ, ఈ చిత్రంలో పనిచేసే అవకాశం కల్పించిన దర్శకుడు వంశీ మునగాల గారికి ధన్యవాదాలు తెలిపారు. ప్రతి విభాగం సమన్వయంతో పనిచేయడం వల్ల సినిమా ఎంతో అద్భుతంగా వచ్చిందని చెప్పారు.
టైటిల్ సాంగ్ విడుదలతో ‘తీరం’ చిత్రంపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొంది. భావోద్వేగాలకు పెద్దపీట వేస్తూ రూపొందుతున్న ఈ సినిమా విడుదల తేదీతో పాటు ఇతర విశేషాలను చిత్ర బృందం త్వరలోనే ప్రకటించనుంది.
నటీనటులు
ప్రభు, హరిప్రియా, వైశాలి, నిరుడి శ్రీనివాస్, సంధ్య, కిట్టయ్య, శిరీష తదితరులు.
సాంకేతిక నిపుణులు
బ్యానర్: శ్రీ భవానీ క్రియేషన్స్
నిర్మాత: ఉపేందర్ గంగావెల్లి
దర్శకుడు: వంశీ మునగాల
సంగీత దర్శకుడు: సాధ్విక్ సన్స్
కో-డైరెక్టర్, క్రియేటివ్ హెడ్ & ఎడిటర్: విజయ్ శెట్టి
సినిమాటోగ్రఫీ: అబ్దుల్ వాలి
వీఎఫ్‌ఎక్స్: అభిలాష్ కన్నయగారి
డీఐ: మిథున్ కుమార్ జానా
సౌండ్ డిజైన్: వంశీ జేడీ
v‘మా రాముడు అందరివాడు’ దమ్మున్న సినిమా : హీరో శ్రీరామ్ ‘మా రాముడు అందరివాడు’ చిత్రంలోని ఫాదర్ అండ్ సన్…
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…