మా నాన్న సూపర్ హీరో’ షూటింగ్ పూర్తి

సుధీర్ బాబు, అభిలాష్ రెడ్డి కంకర, వి సెల్యులాయిడ్స్, CAM ఎంటర్‌టైన్‌మెంట్స్ ‘మా నాన్న సూపర్ హీరో’ షూటింగ్ పూర్తి

సుధీర్ బాబు హీరోగా లూజర్ సిరీస్ ఫేమ్ అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో చేస్తున్న యూనిక్ కంటెంట్ మూవీ ‘మా నాన్న సూపర్ హీరో’. CAM ఎంటర్‌టైన్‌మెంట్‌ తో కలిసి వి సెల్యులాయిడ్స్ బ్యానర్‌ పై సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మా నాన్న సూపర్ హీరో షూటింగ్ పూర్తి అయిన సందర్భం గా చిత్ర యూనిట్ తో ఉన్న సెల్ఫీస్ ,వీడియో హీరో సుధీర్ బాబు తన సామజిక మాధ్యమం లో షేర్ చేశారు.

మా నాన్న సూపర్ హీరో పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. షూటింగ్ పార్ట్ పూర్తి కావడంతో మేకర్స్ త్వరలో ప్రమోషన్స్ గ్రాండ్ గా ప్రారంభించనున్నారు. 

ఫాదర్స్ డే సందర్భంగా మనసుని హత్తుకునే పోస్టర్ ద్వారా సినిమా టైటిల్‌ ను అనౌన్స్ చేశారు. ఈ చిత్రం తండ్రి కొడుకు మధ్య అనుబంధానికి నిజమైన అర్ధం చెబుతూ మనసుల్ని కదిలించే ఓ అద్భుతమైన ప్రయాణంగా ఉండబోతున్నట్టు  టైటిల్ పోస్టర్ సూచిస్తూ  సినిమాపై ఆసక్తిని పెంచింది.

ఈ సినిమాలో సుధీర్ బాబు సరసన ఆర్ణ హీరోయిన్ గా నటిస్తోంది. సాయి చంద్, సాయాజీ షిండే, రాజు సుందరం, శశాంక్, ఆమని, అన్నీ ముఖ్య తారాగణం. 

సమీర్ కళ్యాణి సినిమాటోగ్రఫీ, జై క్రిష్ సంగీతం అందిస్తున్నారు. అనిల్ కుమార్ పి ఎడిటర్ కాగా, ఝాన్సీ గోజాల ప్రొడక్షన్ డిజైనర్. మహేశ్వర్ రెడ్డి గోజాల ఈ చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్.

దర్శకుడు అభిలాష్ రెడ్డి కంకరతో పాటు ఎంవీఎస్ భరద్వాజ్, శ్రవణ్ మాదాల ఈ చిత్రానికి రైటర్స్. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న రాజు సుందరం మాస్టర్‌ కొరియోగ్రాఫర్‌ గా కూడా పని చేస్తున్నారు.

త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని నిర్మాతలు అనౌన్స్ చేస్తారు.

తారాగణం: సుధీర్ బాబు, ఆర్ణ, సాయి చంద్, సాయాజీ షిండే, రాజు సుందరం, శశాంక్, ఆమని, అన్నీ

సాంకేతిక విభాగం:
బ్యానర్: వి సెల్యులాయిడ్స్
అసోషియేషన్ : CAM ఎంటర్‌టైన్‌మెంట్
దర్శకత్వం: అభిలాష్ రెడ్డి కంకర
నిర్మాత: సునీల్ బలుసు
డీవోపీ: సమీర్ కళ్యాణి
సంగీత దర్శకుడు: జై క్రిష్
ఎడిటర్: అనిల్ కుమార్ పి
క్రియేటివ్ ప్రొడ్యూసర్: మహేశ్వర్ రెడ్డి గోజాల
ప్రొడక్షన్ డిజైనర్: ఝాన్సీ గోజాలా
కాస్ట్యూమ్ డిజైనర్: రజిని
కొరియోగ్రఫీ: రాజు సుందరం
రైటర్స్:  ఎంవీఎస్ భరద్వాజ్, శ్రవణ్ మాదాల, అభిలాష్ రెడ్డి కంకర
పీఆర్వో: వంశీ-శేఖర్

Tfja Team

Recent Posts

సమంత యాక్షన్ కామెడీ ఫ్యామిలీ డ్రామా ‘మా ఇంటి బంగారం’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘తస్సాదియ్యా’ విడుదల.. మే 15న మూవీ గ్రాండ్ రిలీజ్

ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మా ఇంటి…

20 hours ago

‘లెనిన్‌’ నుంచి సెకండ్ సాంగ్ ‘ఎట్టా ఎట్టా’ రిలీజ్‌

యంగ్ అండ్ డైన‌మిక్ హీరో అఖిల్ అక్కినేని లేటెస్ట్ మూవీ ‘లెనిన్‌’ శరవేగంగా రూపొందుతోంది. ఈ సినిమాపై మంచి అంచ‌నాలు…

20 hours ago

మలయాళంలో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన “పళ్లిచట్టంబి” తెలుగులోనూ ఆ సక్సెస్ రిపీట్ చేస్తుంది – మూవీ ప్రొడ్యూసర్స్ చాణక్య, చైతన్య, చరణ్

మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటించిన భారీ బడ్జెట్ మూవీ "పళ్లిచట్టంబి". ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ ఫిలింస్,…

20 hours ago

‘సైయారా’ కాంబోలో మరో క్రేజీ ప్రాజెక్ట్

గ‌త ఏడాది బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ‘సైయారా’ కాంబో మ‌ళ్లీ మ‌న ముందుకు రావ‌టానికి స‌మాయ‌త్త‌మ‌వుతోంది. సైయారా అద్భుత విజయంతో…

2 days ago

ఎమ్మెస్ రాజు దర్శకత్వంలోతెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో‘అగధ’

ఎమ్మెస్ రాజు అంటే ఒక బ్రాండ్. సుమంత్ ఆర్ట్స్ పతాకంపై ఆయన నిర్మించిన "శత్రువు, దేవి, మనసంతా నువ్వే, ఒక్కడు,…

2 days ago

మీర్జాపురంరాణి కృష్ణవేణి ఈ తరానికి స్ఫూర్తి -ఎం.వెంకయ్య నాయుడు

అలనాటి నటి, గాయని, నిర్మాత కృష్ణవేణమ్మ జీవితాన్ని గ్రంధస్తం చెయ్యడం ఎంతో సంతోషంగా ఉందని, ఆమె జీవితం నేటి తరానికి…

2 days ago