ఆయ్ నుంచి రెండో పాట ‘రంగనాయకి’ విడుదల

GA2 పిక్చర్స్, బన్నీవాస్, విద్యా కొప్పినీడి, నార్నే నితిన్, అంజి కంచిపల్లి కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఫన్ ఎంటర్‌టైనర్ ‘ఆయ్’ నుంచి రెండో పాట ‘రంగనాయకి’ విడుదల

ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రాలను అందించిన ప్రతిష్టాత్మక సంస్థ GA2 పిక్చర్స్ బ్యానర్ ప్రొడక్షన్ నెం.9గా రూపొందుతోన్న చిత్రం ‘ఆయ్’. ఎనర్జిటిక్ హీరో నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటిస్తున్నారు. అంజి కె.మ‌ణిపుత్ర‌ ఈ చిత్రంతో దర్శకుడిగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. టాలెంటెడ్ యంగ్ ప్రొడ్యూసర్స్ బన్నీ, విద్యా కొప్పినీడి ఈ ఫన్ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు.

ఆయ్ సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలను చిత్ర యూనిట్ పక్కా ప్లానింగ్ ప్రకారం చేసుకుంటూ వస్తుంది. టైటిల్ రివీల్ సహా సినిమా కంటెంట్‌కు సంబంధించిన వీడియోలు, పోస్ట‌ర్స్‌, సాంగ్స్ అన్నింటికీ ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న వ‌చ్చింది. ఈ క్ర‌మంలో శ‌నివారం మేక‌ర్స్ ఈ మూవీ నుంచి ‘రంగనాయకి’ అనే మాస్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. రీసెంట్‌గా విడుద‌లైన ఈ సాంగ్ ప్రోమోతో పాట‌పై మంచి హైప్ క్రియేట్ అయ్యింది. తాజాగా విడుద‌లైన లిరిక‌ల్ సాంగ్ ప్రేక్ష‌కుల‌ను మ‌రింతంగా ఆక‌ట్టుకుంటోంది. మాస్ బీట్‌తో ఉన్న ఈ పాట‌ను వింటుంటే స్టెప్స్ వేయాల‌నిపించేలా ఉంది.

ప్ర‌స్తుతం సూప‌ర్ హిట్ పాట‌ల‌కు కేరాఫ్‌గా మారిన రామ్ మిర్యాల ఈ చిత్రానికి సంగీతాన్ని అందించ‌టం విశేషం. సురేష్ బనిశెట్టి రాసిన ఈ పాటను మోస్ట్ హ్యాపెనింగ్ సింగర్ అనురాగ్ కులకర్ణి ఆలపించారు. భాను మాస్టర్ నృత్య రీతుల‌ను స‌మ‌కూర్చారు. సెట్స్‌, ఆర్టిస్టుల డ్రెస్సింగ్ చాలా కల‌ర్‌ఫుల్‌గా ఉంది. న‌య‌న్ సారిక కూడా ఈ పాట‌లో క‌నిపించింది.

నితిన్‌, న‌య‌న్ సారిక జోడి సిల్వ‌ర్ స్క్రీన్‌పై చూడ చ‌క్క‌గా ఉంది. ఈ సాంగ్‌ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంద‌న‌టంలో సందేహం లేదు.
‘ఆయ్’ సినిమాను ప్రారంభం నుంచి సరికొత్తగా ప్రమోట్ చేస్తున్నారు. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇది టీమ్‌లో మరింత కాన్ఫిడెన్స్‌ను నింపుతోంది. ఈ డిఫరెంట్ ప్రమోషనల్ యాక్టివిటీస్ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రూపొందుతోన్న ఈ సినిమాకు కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్‌గా, సమీర్ కళ్యాణి సినిమాటోగ్రాఫర్‌గా, రామ్ మిర్యాల సంగీత దర్శకుడిగా వర్క్ చేశారు. త్వ‌ర‌లోనే సినిమాను విడుద‌ల చేయ‌టానికి మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు.

GA2 పిక్చర్స్:

ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, డైనమిక్ యంగ్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ కలయికలో GA2 పిక్చర్స్ కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలను అందిస్తూ వస్తున్నారు. భలే భలే మగాడివోయ్, గీతా గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజూ పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి హిట్ చిత్రాలు ఈ బ్యానర్‌లో రూపొందాయి.

నటీనటులు: నార్నే నితిన్, నయన్ సారిక తదితరులు

సాంకేతిక వర్గం:

బ్యానర్ – GA2 పిక్చర్స్, సమర్పణ – అల్లు అరవింద్, నిర్మాతలు – బన్నీ వాస్, విద్యా కొప్పినీడి, డైరెక్టర్ – అంజి కె.మ‌ణిపుత్ర‌, సహ నిర్మాతలు – భాను ప్రతాప్, రియాజ్ చౌదరి, సినిమాటోగ్రఫీ – సమీర్ కళ్యాణి, సంగీతం – రామ్ మిర్యాల, ఎడిటర్ – కోదాటి పవన్ కళ్యాణ్
ఆర్ట్ డైరెక్టర్ – కిరణ్ కుమార్ మన్నె, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – అజయ్ గద్దె, కాస్ట్యూమ్స్ – సుష్మిత, శిల్ప, కో డైరెక్టర్ – రామ నరేష్ నున్న
పి.ఆర్.ఒ – వంశీ కాకా, మార్కెటింగ్ – విష్ణు తేజ్ పుట్ట, పోస్టర్స్ – అనిల్, భాను.

Tfja Team

Recent Posts

సమంత యాక్షన్ కామెడీ ఫ్యామిలీ డ్రామా ‘మా ఇంటి బంగారం’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘తస్సాదియ్యా’ విడుదల.. మే 15న మూవీ గ్రాండ్ రిలీజ్

ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మా ఇంటి…

23 hours ago

‘లెనిన్‌’ నుంచి సెకండ్ సాంగ్ ‘ఎట్టా ఎట్టా’ రిలీజ్‌

యంగ్ అండ్ డైన‌మిక్ హీరో అఖిల్ అక్కినేని లేటెస్ట్ మూవీ ‘లెనిన్‌’ శరవేగంగా రూపొందుతోంది. ఈ సినిమాపై మంచి అంచ‌నాలు…

23 hours ago

మలయాళంలో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన “పళ్లిచట్టంబి” తెలుగులోనూ ఆ సక్సెస్ రిపీట్ చేస్తుంది – మూవీ ప్రొడ్యూసర్స్ చాణక్య, చైతన్య, చరణ్

మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటించిన భారీ బడ్జెట్ మూవీ "పళ్లిచట్టంబి". ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ ఫిలింస్,…

23 hours ago

‘సైయారా’ కాంబోలో మరో క్రేజీ ప్రాజెక్ట్

గ‌త ఏడాది బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ‘సైయారా’ కాంబో మ‌ళ్లీ మ‌న ముందుకు రావ‌టానికి స‌మాయ‌త్త‌మ‌వుతోంది. సైయారా అద్భుత విజయంతో…

2 days ago

ఎమ్మెస్ రాజు దర్శకత్వంలోతెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో‘అగధ’

ఎమ్మెస్ రాజు అంటే ఒక బ్రాండ్. సుమంత్ ఆర్ట్స్ పతాకంపై ఆయన నిర్మించిన "శత్రువు, దేవి, మనసంతా నువ్వే, ఒక్కడు,…

2 days ago

మీర్జాపురంరాణి కృష్ణవేణి ఈ తరానికి స్ఫూర్తి -ఎం.వెంకయ్య నాయుడు

అలనాటి నటి, గాయని, నిర్మాత కృష్ణవేణమ్మ జీవితాన్ని గ్రంధస్తం చెయ్యడం ఎంతో సంతోషంగా ఉందని, ఆమె జీవితం నేటి తరానికి…

2 days ago