దోనేపూడి చక్రపాణి సమర్పణలో చిత్రాలయం స్టూడియోపై గుణి మంచికంటి దర్శకుడిగా వేణు దోనేపూడి నిర్మించిన చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’. పూర్తిగా మేఘాలయలో చిత్రీకరించిన తెలుగు క్రైమ్-కామెడీ ‘బా బా బ్లాక్ షీప్’ 2026 అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీలో నటించిన ఉపేంద్ర లిమాయే, అక్షయ్ లగుసాని, విష్ణు ఓయి, రాజా రవీంద్ర, జార్జ్ మరియన్, టీనూ ఆనంద్, కశ్యప్, కార్తికేయ దేవ్, సమ్రీధీ ఆర్యల్, మాల్వీ మల్హోత్రా, విస్మయ శ్రీ, కశ్యప్ తదితరులకు మంచి గుర్తింపు లభించింది. ఈ క్రమంలో నిర్మాత వేణు దోనేపూడి మీడియాతో చిత్రానికి సంబంధించిన విశేషాల్ని పంచుకున్నారు. ఆయన చెప్పిన సంగతులివే..
మీ నేపథ్యం గురించి చెప్పండి?
మా తాత గారు థియేటర్ నడిపించేవారు. మా నాన్న గారు థియేటర్‌ను కొన్నేళ్ల క్రితమే క్లోజ్ చేశారు. సినీ రంగంతో మా ఫ్యామిలీకి పరిచయం ఉంది. 90వ దశకంలో యూఎస్‌లో ఆటో మొబైల్ బిజినెస్ చేశాను. అక్కడే డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ కూడా చేశాను. యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, సింగపూర్ ఇలా అన్ని దేశాల్లో సినిమాల్ని డిస్ట్రిబ్యూట్ చేశాను. 2008లో నేను ఇండియాకి వచ్చాను. నాగేశ్వరరావు గారిని నేను తాతగారు అని పిలిచేవాడ్ని. అన్నపూర్ణ బ్యానర్‌తోనే ఇండస్ట్రీకి పరిచయమవ్వు అని నాగేశ్వరరావు గారు అన్నారు. అప్పుడు ‘మనం’ చిత్రంతో ఆయన బిజీగా ఉన్నారు. నేను కూడా ‘మనం’ సినిమాలో వెనకాల ఎక్కడో కనిపిస్తాను. మా తాతగారి కల నిజం చేసేందుకు నేను రైటింగ్ కూడా స్టార్ట్ చేశాను.
‘విశ్వం’తో ఏం నేర్చుకున్నారు?
‘మనం’ తర్వాత గోపీ మోహన్ గారు, శ్రీను వైట్ల గారు పరిచయం అయ్యారు. అలా ‘విశ్వం’ జర్నీ మొదలైంది. అతి మంచితనం పనికి రాదు అని ఆ ప్రయాణంలో తెలిసింది. కో ప్రొడ్యూసర్స్‌గా వచ్చిన వారు ఒరిజినల్ ప్రొడ్యూసర్స్‌గా ప్రవర్తించారు. షూటింగ్ పూర్తికాక ముందే అన్ని రకాల బిజినెస్‌లు క్లోజ్ అయ్యాయి. కానీ ఆ తర్వాత సమస్యలు వచ్చాయి. లీగల్ చర్యలు తీసుకున్నాం. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతోంది.
ఇంత నేపథ్యం ఉండి కూడా ఆలస్యంగా ఇండస్ట్రీలోకి ఎందుకు వచ్చారు?
ఇండస్ట్రీ ఎలా ఉంటుంది.. ఇక్కడి పరిస్థితులు ఏంటి? అన్నది మా ఫ్యామిలీకి తెలుసు. అవసరమా? అని అందరూ నన్ను ఆపారు. సినిమాల వల్ల కూడా గౌరవం వస్తుంది కదా అని నేను ఇండస్ట్రీలోకి వచ్చాను. ఫిల్మ్ ఛాంబర్ వల్ల ‘విశ్వం’ విషయంలో కాస్త సేఫ్ అయ్యాను.
‘బా బా బ్లాక్ షీప్’ ఎలా మొదలైంది?
‘విశ్వం’ తర్వాత ‘రామం’ మొదలు పెట్టాం. ఆ ప్రయాణంలోనే గుణి పరిచయం అయ్యారు. జెన్ జీ ఆడియెన్స్‌కి తగ్గ కథను చేయాలని అనుకున్నాను. గుణి కూడా అలాంటి కథనే అద్భుతంగా చెప్పారు. 42 రోజుల్లో చేస్తానని గుణి చెప్పారు. కానీ నాకు మాత్రం ఈ కథను 30 రోజుల్లో తీయొచ్చని అనుకున్నాను. అయితే చివరకు 28 రోజుల్లోనే షూట్ పూర్తయింది.
మేఘాలయ బ్యాక్ డ్రాప్‌లోనే ఎందుకు చేశారు?
నేను ట్రావెలింగ్ ఎక్కువగా చేస్తుంటాను. ఈ కథ విన్న వెంటనే నార్త్ ఈస్ట్ ఏరియాలో షూట్ చేస్తే బాగుంటుందని అనుకున్నాను. అక్కడి ప్రభుత్వంతో సంప్రదించాం. పర్మిషన్స్ వెంటనే లభించాయి. మా టీంని పంపించాం. రెక్కీ నిర్వహించారు. ఆ తర్వాత సీఎం సంగ్మా గారితో మాట్లాడాం. అక్కడ సినిమా పర్మిషన్ల కోసం ప్రత్యేకంగా పాలసీ కూడా లేదు. ఆ పాలసీ డ్రాఫ్టింగ్‌లో నేను కూడా మెంబర్ అయ్యాను. స్విట్జర్లాండ్‌కు ధీటుగా మన మేఘాలయ ఉంటుంది.
మేఘాలయలో ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి?
అక్కడి ప్రభుత్వం మాకు అన్ని రకాలుగా సహకరించింది. కానీ అక్కడ మాత్రం మన స్టైల్లో ఫుడ్ దొరకదు. పాలు, పెరుగు, చేపలు కూడా మన దగ్గరి నుంచి అక్కడికి ట్రాన్స్‌పోర్ట్ అవుతుంటాయి. అక్కడికి వెళ్లిన మొదటి వారం ఫుడ్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. కానీ ఇప్పుడు అన్ని సమస్యల్ని పరిష్కరించాం. మా తర్వాత షూట్ చేసిన వాళ్లందరికీ సదుపాయాలు అందుబాటులోనే ఉంటున్నాయి.
‘బా బా బ్లాక్ షీప్’ రిజల్ట్ పట్ల సంతోషంగా ఉన్నారా?
రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 150కి పైగా థియేటర్లు, నార్త్‌లో వంద థియేటర్లు, ఓవర్సీస్‌లోనూ రిలీజ్ చేశాం. ఆడియెన్స్ నుంచి మాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్ని చోట్లా బ్రేక్ ఈవెన్ అయింది. మా సినిమా ఓటీటీ డీల్ కూడా ముగిసింది. నవంబర్ 6 నుంచి అమెజాన్‌లో వస్తుంది. ముప్పై రోజులు నా టీంలోని అందరికీ జీతం ఇచ్చాను. యూనియన్ లెక్కల కంటే ఎక్కువే అందరికీ పే చేశాను.
మీ తదుపరి చిత్రాల గురించి చెప్పండి?
‘రామం’ నా డ్రీమ్ ప్రాజెక్ట్. అద్భుతమైన కథతో సినిమాను భారీ ఎత్తున నిర్మిస్తున్నాం. మూల కథను వీఎన్ ఆదిత్య గారు ఇచ్చారు. భారీ బడ్జెట్ చిత్రాన్ని కూడా కంట్రోల్డ్ బడ్జెట్‌లో చేయొచ్చని ‘రామం’తో నిరూపిస్తాను. ‘గాంధీతాతచెట్టు’ దర్శకురాలితో ఓ ప్రేమ కథా చిత్రాన్ని చేస్తున్నాను. మరో రెండు సినిమాల్ని పెద్ద హీరోలతో చేస్తున్నాను. వాటికి సంబంధించిన ప్రకటన త్వరలోనే వస్తుంది.
కృష్ణ కమల్ , మహి హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న రూరల్ కామెడీ డ్రామా ‘జో జో’. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న…
నటిగా సూపర్ హిట్ సినిమాల్లో నటించిన అనన్య నాగళ్ల నూతనంగా హిడి పేరుతో కేవలం మహిళలకు ఉపయోగపడేలా క్లోతింగ్ బిజినెస్…
▪️ ఆదిత్య మ్యూజిక్ ద్వారా అధికారికంగా విడుదల ▪️ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్.. సెలబ్రిటీలనూ ఆకట్టుకుంటున్న సాంగ్ హైదరాబాద్:…
సినీ రంగంలో పవన్ కళ్యాణ్ 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఆయనకు హృదయపూర్వక…
డిఫరెంట్ కాన్సెప్ట్, కంటెంట్ బేస్డ్ చిత్రాలతో ఆకట్టుకునే విజయ్ ఆంటోని ప్రస్తుతం ‘నాన్న కుట్టి’ అంటూ ఆడియెన్స్ ముందుకు రానున్నారు.…
‘శంబాల’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత నిర్మాతలు మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు దర్శకుడు యుగంధర్ ముని కలిసి మళ్లీ…