‘జో జో’ కాష‌న్ 1.. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌నున్న రూర‌ల్ కామెడీ డ్రామా.

కృష్ణ క‌మ‌ల్ , మ‌హి హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న రూర‌ల్ కామెడీ డ్రామా ‘జో జో’. రాయ‌ల‌సీమ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు దేవ‌క‌ట్టా స‌మ‌ర్ప‌ణ‌లో కిర‌ణ్ జ‌య్ కుమార్ ద‌ర్శ‌కుడిగా రూపొందుతోంది. విజ‌యం బ్యాన‌ర్‌పై విజ‌య్ కృష్ణ లింగ‌మ‌నేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వైవిధ్య‌మైన చిత్రాల‌కు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్న ఈ క్ర‌మంలో ‘జో జో’ సినిమా ఆడియెన్స్‌ను అల‌రించ‌టానికి సిద్ధ‌మైంది. సోమ‌వారం కాష‌న్ 1 పేరుతో ఈ సినిమా కంటెంట్ ఏంట‌నే విష‌యాన్ని తెలియ‌జేస్తూ ఓ వీడియో గ్లింప్స్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు.

రాయ‌ల‌సీమ‌లోని జొన్న‌గిరి నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న సినిమా. వ‌ర్షాలు ప‌డిన‌ప్పుడు అక్క‌డ వ‌జ్రాలు దొరుకుతాయ‌నే వార్త‌లు మ‌నం వినే ఉంటాం. ఆ పాయింట్‌ను ఆధారంగా చేసుకుని రూర‌ల్ ల‌వ్ స్టోరీగా కామెడీ ట‌చ్‌తో మేక‌ర్స్ ‘జో జో’ సినిమాను మ‌న ముందుకు తీసుకొస్తున్నారు. ఈ కాష‌న్ వీడియో గ‌మ‌నిస్తే.. మ‌నోభావాల బ్యాచ్ దూరంగా ఉండండి అనే క్యాప్ష‌న్‌తోనే ఇది మొద‌ల‌వుతుంది. వ‌ర్షం ప‌డిన త‌ర్వాత పొలంలో హీరో హీరోయిన్‌తో పాటు కొంద‌రు వ‌జ్రాల‌ను వెతుకుతుంటారు. హీరోయిన్‌కు ఓ రాయి దొర‌కుతుంది. ఆమెను ప్రేమించే హీరో ఆమె ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి మాట్లాడే ప్ర‌య‌త్నం చేస్తాడు. అయితే ఆమె అత‌డ్ని ఓ బూతు మాట‌తో నోరు మూయించేస్తుంది. ఆ మాట విని హీరోతో పాటు.. అక్క‌డున్న హీరో ఫ్రెండ్ కూడా షాక‌వుతాడు. అయితే హీరో దాన్ని కూడా మోటు స‌ర‌సం అంటూ క‌వ‌ర్ చేయ‌టం.. చూస్తే న‌వ్వు తెప్పిస్తుంది.

రా ర‌స్టిక్ రొమాంటిక్ మూవీ త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. కాష‌న్ వ‌న్ వీడియోతో సినిమాపై మేక‌ర్స్ క్యూరియాసిటీ క్రియేట్ చేశారు. మ‌రిన్ని వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తామని టీమ్ తెలియ‌జేసింది.

న‌టీన‌టులు:
కృష్ణ క‌మ‌ల్‌, మ‌హి, మ‌క‌రంద్ దేశ్‌పాండే, ఫ‌ణీంద్ర దేవ‌ర‌ప‌ల్లి, భాష‌, రాజు, స‌తీష్ దేవ‌ట్టె, శ‌ర‌త్, ప్ర‌భావ‌తి త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

స‌మ‌ర్ప‌ణ‌: దేవ‌క‌ట్టా
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: కిర‌ణ్ జయ్ కుమార్‌
నిర్మాత: విజ‌య్ కృష్ణ లింగ‌మ‌నేని
నిర్మాణ సంస్థ‌: విజ‌యం
మ్యూజిక్‌: మ‌హేష్ శంక‌ర్‌
స్టోరి, స్క్రీన్ ప్లే, డైలాగ్స్‌: కిర‌ణ్ జ‌య్ కుమార్‌
సినిమాటోగ్ర‌ఫీ: రోహిత్ కుమార్‌
ఎడిట‌ర్‌: మాధ‌వ్ కుమార్ గుళ్ళ‌ప‌ల్లి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్: నాగి
పి.ఆర్.ఒ: నాయుడు-ఫ‌ణి(బియాండ్ మీడియా)

TFJA

Recent Posts

‘బా బా బ్లాక్ షీప్’ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.. నెక్ట్స్ మా బ్యాన‌ర్‌లో మ‌రిన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ లైన‌ప్‌లో ఉన్నాయి – నిర్మాత వేణు దోనేపూడి

దోనేపూడి చక్రపాణి సమర్పణలో చిత్రాలయం స్టూడియోపై గుణి మంచికంటి ద‌ర్శ‌కుడిగా వేణు దోనేపూడి నిర్మించిన చిత్రం ‘బా బా బ్లాక్…

1 hour ago

అనన్య నాగళ్ల హిడి (వేర్ ది ఫీలింగ్) లాంచ్

నటిగా సూపర్ హిట్ సినిమాల్లో నటించిన అనన్య నాగళ్ల నూతనంగా హిడి పేరుతో కేవలం మహిళలకు ఉపయోగపడేలా క్లోతింగ్ బిజినెస్…

1 hour ago

నేడే ‘పర్ణశాల’ నుంచి ‘జిమ్ జిమ్ తార’ పూర్తి పాట విడుదల*

▪️ ఆదిత్య మ్యూజిక్ ద్వారా అధికారికంగా విడుదల ▪️ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌.. సెలబ్రిటీలనూ ఆకట్టుకుంటున్న సాంగ్‌ హైదరాబాద్:…

6 hours ago

పవన్ కళ్యాణ్‌కు అల్లు అరవింద్ అభినందనలు – సినీ ప్రయాణంపై ప్రశంసలు.

సినీ రంగంలో పవన్ కళ్యాణ్ 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఆయనకు హృదయపూర్వక…

6 hours ago

దీపావళి సందర్భంగా నవంబర్ 6న రానున్న విజయ్ ఆంటోని ‘నాన్న కుట్టి’

డిఫరెంట్ కాన్సెప్ట్, కంటెంట్ బేస్డ్ చిత్రాలతో ఆకట్టుకునే విజయ్ ఆంటోని ప్రస్తుతం ‘నాన్న కుట్టి’ అంటూ ఆడియెన్స్ ముందుకు రానున్నారు.…

1 day ago

షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద ‘శంబాల’ ఫేమ్ యుగంధర్ ముని తెరకెక్కిస్తున్న ‘కరికాల’ చిత్రంలో సందీప్ కిషన్‌కి జంటగా నటించనున్న కేథరిన్ థ్రెసా అలెగ్జాండర్.

‘శంబాల’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత నిర్మాతలు మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు దర్శకుడు యుగంధర్ ముని కలిసి మళ్లీ…

2 days ago