తమ చిత్రం #Ranabaali విడుదలకు ముందు స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమిళనాడు ముఖ్యమంత్రి, థళపతి విజయ్‌ను కలిశారు. ఎంతో బిజీ షెడ్యూల్‌లో ఉన్నప్పటికీ సీఎం విజయ్ ఈ జంటకు ఆత్మీయ స్వాగతం పలికి, వారితో కొంత సమయం గడిపారు.
ఈ సమావేశంలో సినిమా, జీవితం, ప్రపంచానికి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను ముగ్గురూ పంచుకున్నారు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలతో సీఎం విజయ్ సమావేశమైన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
ఈ ప్రత్యేకమైన భేటీపై హీరో విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
విజయ్ దేవరకొండ స్పందిస్తూ..
“థళపతి, సీఎం విజయ్ గారితో ఎంతో అందమైన సమయాన్ని గడిపాను. ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఆయన మమ్మల్ని ఎంతో ఆత్మీయంగా ఆహ్వానించి, తన ప్రేమను పంచుకున్నారు. జీవితం, పని, ప్రపంచం గురించి ఎన్నో వ్యక్తిగత విషయాలను మాతో పంచుకున్నారు. ఆయనను ఒక్కసారి కలిసినప్పుడే మరింత అభిమానించే వ్యక్తిగా మారిపోయారు. ❤️
థ్యాంక్యూ విజయ్ సార్!” అని విజయ్ దేవరకొండ తన సంతోషాన్ని పంచుకున్నారు.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన #Ranabaali అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
దోనేపూడి చక్రపాణి సమర్పణలో చిత్రాలయం స్టూడియోపై గుణి మంచికంటి దర్శకుడిగా వేణు దోనేపూడి నిర్మించిన చిత్రం ‘బా బా బ్లాక్…
కృష్ణ కమల్ , మహి హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న రూరల్ కామెడీ డ్రామా ‘జో జో’. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న…
నటిగా సూపర్ హిట్ సినిమాల్లో నటించిన అనన్య నాగళ్ల నూతనంగా హిడి పేరుతో కేవలం మహిళలకు ఉపయోగపడేలా క్లోతింగ్ బిజినెస్…
▪️ ఆదిత్య మ్యూజిక్ ద్వారా అధికారికంగా విడుదల ▪️ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్.. సెలబ్రిటీలనూ ఆకట్టుకుంటున్న సాంగ్ హైదరాబాద్:…
సినీ రంగంలో పవన్ కళ్యాణ్ 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఆయనకు హృదయపూర్వక…
డిఫరెంట్ కాన్సెప్ట్, కంటెంట్ బేస్డ్ చిత్రాలతో ఆకట్టుకునే విజయ్ ఆంటోని ప్రస్తుతం ‘నాన్న కుట్టి’ అంటూ ఆడియెన్స్ ముందుకు రానున్నారు.…